బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చాక నటి రాఖీ సావంత్ తరచూ వార్తల్లో నిలుస్తోంది. భర్త రితేశ్ సింగ్‌తో బ్రేకప్, ఆ వెంటనే బిజినెస్‌మెన్‌తో లవ్, ఎంగేజ్‌మెంట్.. ఇలా నిత్యం సెన్సేషన్ అవుతోందీ రాఖీ. తనకంటే ఆరేళ్ల చిన్నవాడైన అదిల్ దురానీతో ప్రేమలో పడింది. అతడితో కొత్త జీవితం ప్రారంభించాలని ఆశగా ఎదురు చూస్తోన్న ఆమెకు తాజాగా అతడు షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎక్కడ చూసిన ఆదిల్‌తో జంటగా దర్శనమిస్తున్న ఆమె బుధవారం ముంబై ఎయిర్‌పోర్టులో ఒంటరిగా కనిపించింది. ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను చూడానికి మీడియా పర్సన్స్ తమ కెమెరాలకు పని చెప్పారు.
చదవండి: ఆయన కోసమే నగ్నంగా నటించా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఈ సందర్భంగా రాఖీతో వారు మాట్లాడుతున్న వీడియోను ప్రముఖ బాలీవుడ్ రిపోర్టర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం ఇది వైరల్‌గా మారింది. ఇందులో రాఖీ మాట్లాడుతూ.. బాయ్‌ఫ్రెండ్ ఆదిల్ కలిసేందుకు ఢిల్లీ వెళ్లానని, కానీ అతడు తనన కలవలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఆదిల్ కోసమే ఇలా రెడీ అయ్యానని, ఫ్లయిట్‌లో రెండు గంటల పాటు ఏడవడంతో తన కాజల్ చెరిగిపోయిందంటూ. నేను నిన్న ఢిల్లీకి వెళ్లి, ఈ రోజు ముంబైకి వచ్చానని మీకు తెలుసా? అతడు నన్ను కలుసుకునేందుకు కూడా రాలేదు. మేము ఇద్దరం కలిసి ముంబైకి రావాల్సి ఉంది. కానీ నేను ఒక్కదాన్నే వచ్చాను. నేను ఎంతో బాధలో ఉన్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆదిల్ కాల్ చేయండి, వీడియో కాల్ మాట్లాడండి అని ఓ మీడియా వ్యక్తి రాఖీకి సూచించాడు.
చదవండి: పెళ్లి వార్తలపై స్పందించిన నిత్యా మీనన్
దీంతో ఆమె తాను అతడికి ఫోన్ చేసే ప్రసక్తే లేదని చెప్పింది. తనకు ఆత్మగౌరవం ఉందని, వెనక్కి తగ్గేదే లేదు అని వ్యాఖ్యానించింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెకు సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ‘నీ మాజీ భర్త రితేష్ లాగే ఇతను కూడా నిన్ను వదిలించుకున్నాడు’ కాగా రాఖీ ఇప్పటికే పలువురితో సహాజీవనం, పెళ్లి, విడాకులతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. 2009లో ‘రాఖీ కా స్వయంవర్’ రియాలిటీ షో ద్వారా పరిచయమైన ఎలేష్ పురుంజన్ వాలాను భాగస్వామిగా ఎంపిక చేసుకుంది. అతడితో కొన్ని నెలల డేటింగ్ అనంతరం విడిపోయింది. ఆ తర్వాత 2019లో ఎన్‌ఆర్‌ఐ రితేష్‌ను వివాహం చేసుకుని 2022 ప్రారంభంలో విడాకులు తీసుకుని విడిపోయింది. ఆ వెంటనే ఆదిల్ దుర్రానీతో ప్రేమలో పడింది.
Comments
Please login to add a commentAdd a comment