కార్లు, వాచీల కోసం హీరోయిన్ మోసం.. అరెస్టు | heroine dupes more than 1000 people, arrested | Sakshi
Sakshi News home page

కార్లు, వాచీల కోసం హీరోయిన్ మోసం.. అరెస్టు

Published Wed, Jun 3 2015 3:23 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

కార్లు, వాచీల కోసం హీరోయిన్ మోసం.. అరెస్టు - Sakshi

కార్లు, వాచీల కోసం హీరోయిన్ మోసం.. అరెస్టు

చిన్న సినిమాల్లో హీరోయిన్గా చేస్తూ.. దాదాపు వెయ్యిమందిని కోట్లాది రూపాయల మేర మోసగించిన యువతిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆమె బాధితుల్లో ఐటెం బాంబ్ రాఖీ సావంత్ కూడా ఒకరు కావడం గమనార్హం. లీనా మారియా పాల్ (26), ఆమె సహజీవన భాగస్వామి శేఖర్ చంద్రశేఖర్ (25) మరికొందరితో కలిసి దాదాపు వెయ్యిమందికి టోపీ పెట్టి 9 లగ్జరీ కార్లు, 117 ఇంపోర్టెడ్ వాచీలు, ఒక స్పోర్ట్స్ బైకు, 12 సెల్ఫోన్లు, ఇంకా అనేక విలాసవంతమైన వస్తువులు సొంతం చేసుకున్నారు. దాంతో ముంబై క్రైం బ్రాంచి ఆర్థిక నేరాల విభాగం పోలీసులు వాళ్లను, వాళ్లతో పాటు అదిల్ జైపురి (24) అఖ్తర్ జైపురి (55), సల్మాన్ రిజ్వీ (28), నజీర్ జైపురి (50) అనే నలుగురిని కూడా అరెస్టు చేశారు. రెడ్ చిల్లీస్ అనే సినిమాలో మోహన్లాల్తోను, మద్రాస్ కేఫ్ సినిమాలో జాన్ అబ్రహంతోను పాల్ హీరోయిన్గా పనిచేసింది. లయన్ ఓక్ ఇండియా అనే బోగస్ కంపెనీ పెట్టి, వేలాది మంది నుంచి కోట్లాది రూపాయలు పెట్టుబడులుగా తీసుకున్నారు. పెట్టిన పెట్టుబడి మీద నెలకు 20 శాతం చొప్పున మూడు నెలల్లో 300 శాతం లాభాలు ఇస్తామని వీళ్లు చెప్పేవారు. వాళ్లు కట్టిన డబ్బుతో వ్యాపారాలు ఏమీ చేయకుండా.. పైపెచ్చు లగ్జరీ కార్లు కొనేవాళ్లు. బెంట్లీ, ఆడి, మెర్సిడిస్, మాసెరాటి, నిస్సాన్ లాంటి బ్రాండ్ కార్లు వాళ్ల వద్ద ఉన్నాయి. రూ. 23 లక్షల విలువైన హోండా స్పోర్ట్స్ బైకు కూడా ఉంది. అంతేకాదు, చంద్రశేఖర్ తనను తాను ఐఏఎస్ అధికారిగా చెప్పుకొని, ఓ బ్యాంకు నుంచి రూ. 19 కోట్ల రుణం కూడా తీసుకున్నాడు.

నాకు 2.5 కోట్ల టోపీ: రాఖీసావంత్
ఈ స్కాం బాధితుల్లో బాలీవుడ్ ఐటెం బాంబు రాఖీ సావంత్ కూడా ఉన్నారు. తాను వీళ్ల వద్ద రూ.2.5 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ఆమె చెప్పింది. వాళ్ల జీవనశైలి చూసి షాక్ తిన్నానని, తన డబ్బు ఎలా తిరిగి వస్తుందనే ఆలోచిస్తున్నానని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement