leena paul cheating
-
బాలీవుడ్ భామ జాక్వెలిన్‌కు షాక్.. ఎయిర్పోర్ట్ వద్ద అడ్డుకున్న అధికారులు
Jacqueline Fernandez Stopped At Mumbai Airport: బాలీవుడ్ భామ, శ్రీలంక ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ముంబై విమానాశ్రయంలో షాక్ తగిలింది. ఇండియా నుంచి వెళ్తున్న జాక్వెలిన్‌ను ముంబై ఎయిర్‌పోర్టులో అధికారులు అడ్డుకున్నారు. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసు విచారణ ఎదర్కొంటూ జైలులో ఉన్న నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్ సన్నిహితంగా దిగిన ఫొటోలు వైరల్ అవడంతో ఈ భామ చిక్కుల్లో పడింది. అప్పట్లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొంది. అప్పుడు సుఖేష్ చంద్రశేఖర్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని జాక్వెలిన్ కొట్టిపారేసింది. ఇది జరిగిన వారాలా తర్వాత సుఖేష్‌ను ముద్దు పెట్టుకుంటూ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో రచ్చ చేశాయి. ఇదీ చదవండి: జాదుగాడితో జాక్వెలిన్ కిస్సింగ్ ఫోటో లీక్ అంతకుముందు ఈ రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటీమణులు జాక్వెలిన్, నోరా ఫతేహి, సుఖేష్ చంద్రశేఖర్, అతని భార్య లీనా పాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. పలు నివేదికల ప్రకారం జాక్వెలిన్‌ను సుకేష్ నాలుగు సార్లు చెన్నైలో కలిశారని సమాచారం. అంతేకాకుండా ఆమె కోసం ప్రైవేట్ జెట్‌ను కూడా ఏర్పాటు చేశాడట. సుఖేష్ నుంచి జాక్వెలిన్ కోట్ల రూపాయల బహుమతి పొందినట్లు ఈడీ విచారణలో తేలిందని సమాచారం. అందులో రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పెర్షియన్ పిల్లితో పాటు దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సుఖేష్ భార్య లీనా పాల్‌తో కూడా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. జాక్వెలిన్‌తో పాటు నోరా ఫతేహీనికి కూడా సుఖేష్ భారీ బహుమతులు ఇచ్చాడట. ఆమెకు ఒక బీఎండబ్ల్యూ కారు, ఐఫోన్‌తో పాటు మొత్తంగా రూ.కోటి విలువైన గిఫ్టులు ఇచ్చాడని సమాచారం. ఇదీ చదవండి: బాలీవుడ్ భామకి గిఫ్ట్‌గా రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పిల్లి -
కార్లు, వాచీల కోసం హీరోయిన్ మోసం.. అరెస్టు
చిన్న సినిమాల్లో హీరోయిన్గా చేస్తూ.. దాదాపు వెయ్యిమందిని కోట్లాది రూపాయల మేర మోసగించిన యువతిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆమె బాధితుల్లో ఐటెం బాంబ్ రాఖీ సావంత్ కూడా ఒకరు కావడం గమనార్హం. లీనా మారియా పాల్ (26), ఆమె సహజీవన భాగస్వామి శేఖర్ చంద్రశేఖర్ (25) మరికొందరితో కలిసి దాదాపు వెయ్యిమందికి టోపీ పెట్టి 9 లగ్జరీ కార్లు, 117 ఇంపోర్టెడ్ వాచీలు, ఒక స్పోర్ట్స్ బైకు, 12 సెల్ఫోన్లు, ఇంకా అనేక విలాసవంతమైన వస్తువులు సొంతం చేసుకున్నారు. దాంతో ముంబై క్రైం బ్రాంచి ఆర్థిక నేరాల విభాగం పోలీసులు వాళ్లను, వాళ్లతో పాటు అదిల్ జైపురి (24) అఖ్తర్ జైపురి (55), సల్మాన్ రిజ్వీ (28), నజీర్ జైపురి (50) అనే నలుగురిని కూడా అరెస్టు చేశారు. రెడ్ చిల్లీస్ అనే సినిమాలో మోహన్లాల్తోను, మద్రాస్ కేఫ్ సినిమాలో జాన్ అబ్రహంతోను పాల్ హీరోయిన్గా పనిచేసింది. లయన్ ఓక్ ఇండియా అనే బోగస్ కంపెనీ పెట్టి, వేలాది మంది నుంచి కోట్లాది రూపాయలు పెట్టుబడులుగా తీసుకున్నారు. పెట్టిన పెట్టుబడి మీద నెలకు 20 శాతం చొప్పున మూడు నెలల్లో 300 శాతం లాభాలు ఇస్తామని వీళ్లు చెప్పేవారు. వాళ్లు కట్టిన డబ్బుతో వ్యాపారాలు ఏమీ చేయకుండా.. పైపెచ్చు లగ్జరీ కార్లు కొనేవాళ్లు. బెంట్లీ, ఆడి, మెర్సిడిస్, మాసెరాటి, నిస్సాన్ లాంటి బ్రాండ్ కార్లు వాళ్ల వద్ద ఉన్నాయి. రూ. 23 లక్షల విలువైన హోండా స్పోర్ట్స్ బైకు కూడా ఉంది. అంతేకాదు, చంద్రశేఖర్ తనను తాను ఐఏఎస్ అధికారిగా చెప్పుకొని, ఓ బ్యాంకు నుంచి రూ. 19 కోట్ల రుణం కూడా తీసుకున్నాడు. నాకు 2.5 కోట్ల టోపీ: రాఖీసావంత్ ఈ స్కాం బాధితుల్లో బాలీవుడ్ ఐటెం బాంబు రాఖీ సావంత్ కూడా ఉన్నారు. తాను వీళ్ల వద్ద రూ.2.5 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ఆమె చెప్పింది. వాళ్ల జీవనశైలి చూసి షాక్ తిన్నానని, తన డబ్బు ఎలా తిరిగి వస్తుందనే ఆలోచిస్తున్నానని తెలిపింది.