leena maria paul
-
రూ. 200 కోట్లకు టోకరా : బాలీవుడ్ హీరోయిన్, భర్త అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: రూ. 200కోట్ల మేర మోసం కేసులో బాలీవుడ్ హీరోయిన్ లీనా మరియా పాల్, ఆమె భర్త సుకేశ్ చంద్రశేఖర్‌కు ఈడీ షాక్ ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ జంటను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం అరెస్ట్ చేసింది. అనంతరం వారి ఢిల్లీ కోర్టుముందు హాజరుపర్చింది. వీరికి 14 రోజుల రిమాండ్ విధించాలని కోరింది. గతంలో ఈ దంపతులను ఈడీ అనేక సందర్బాల్లో విచారించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మూవీ ‘మద్రాస్ కేఫ్’లో నటించిన లీనా, తన భర్త సుకేశ్ చంద్రశేఖర్ జైల్లో ఉండగా స్పూఫ్ ఫోన్ కాల్ ద్వారా ఒక కేంద్ర ప్రభుత్వ అధికారిలా నటిస్తూ ఒక వ్యాపారవేత్త భార్య నుండి 200 కోట్ల రూపాయలు దోచుకున్నట్టు ఆరోపణలు నమోదైనాయి. ఈ వ్యవహారంలో ఆమెతో కుమ్మక్కయ్యారంటూ అనేక మంది జైలు, బ్యాంకు అధికారులు కూడా అడ్డంగా బుక్కయ్యారు. ఈ కేసు దర్యాప్తులో ఈడీకి గట్టి ఆధారాలు లభించడంతో చంద్రశేఖర్ భార్య లీనాను ఢిల్లీ పోలీసులు కూడా అరెస్టు చేశారు ఇటీవల చెన్నైలోని వీరి బంగ్లాపై నిర్వహించిన దాడుల్లో కోట్ల రూపాయల విలువైన వస్తువులను, అంతర్జాతీయ బ్రాండ్ల ఖరీదైన దుస్తులు, 16 వాహనాలను స్వాధీనం ఈడీ చేసుకుంది. సుకేశ్అక్రమంగా సంపాదించిన డబ్బులతో లీనా లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నట్టు ఈడీ భావించింది. అలాగే ఈ రాకెట్లో ప్రధాన నిందితుడు సుకేశ్‌కు సహకరించిన దీపక్ రామ్‌దానీ, ప్రదీప్ రమణిలను ఈడీ అరెస్టుచేసింది. సుకేష్ సూచనల మేరకు వ్యాపారవేత్త భార్య నుండి అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ అధికారులు వెల్లడించారు. జూన్ 2020 నుండి మే 2021 మధ్య, ఈ జంట దాదాపు 40 సార్లు మోసానికి పాల్పడినట్టు ఈడీ గతంలొ పేర్కొంది. Enforcement Directorate arrests Sukesh Chandrasekhar & his partner actress Leena Maria Paul in connection with a Rs 200 crore extortion case, produces them before a court in Delhi, seeking 14 days remand — ANI (@ANI) October 9, 2021 -
సినీ నటి బ్యూటీ పార్లర్ వద్ద కాల్పులు
ప్రముఖ మలయాళ నటి, మోడల్ లీనాపాల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. శనివారం మధ్యాహ్నం 3:45 గంటల ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెపై కాల్పులు జరిపి పరారైనట్టుగా పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జరిగిన సమయంలో లీనా తన బ్యూటీ పార్లర్ నెయిల్ ఆర్టిస్ట్రీ లో ఉన్నారు. అయితే పార్లర్ బిజీగా ఉండటంతో దుండగులు బయటి నుంచే ఎయిర్ గన్స్‌తో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అండర్ వరల్డ్ తో ఉన్న ఆర్థిక పరమైన విభేదాలే దాడికి కారణమని భావిస్తున్నారు. పార్లర్ తో పాటు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు. గతంలో లీనాపై పలు ప్రాంతాల్లో చీటింగ్ కేసులు నమైదయ్యాయి. 2013, 2015లలో చీటింగ్ కేసుల్లో ఈమె అరెస్ట్‌అయినట్టుగా పోలీసులు తెలిపారు. జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన మద్రాస్ కేఫ్‌తో పాటు మోహన్ లాల్ రెడ్‌చిల్లీస్ సినిమాల్లో లీనా కీలక పాత్రల్లో నటించారు. -
నటి ప్రేమికుడి అరెస్ట్
కేకేనగర్: ఐఏఎస్ అధికారి పేరుతో కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన ప్రముఖ మలయాళ నటి ప్రేమికుడిని చెన్నై కేంద్ర నేర విభాగ పోలీసులు ముంబైలో అరెస్టు చేసి చెన్నై పుళల్ జైలులో నిర్బంధించారు. చెన్నై అంబత్తూరు పారిశ్రామికవాడలో ఫ్యూచర్ టెన్నిక్స్ అనే ప్రైవేటు సంస్థను బాలసుబ్రమణియన్ నడిపేవాడు. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన ఐఏఎస్ అధికారి జయకుమార్ అనే వ్యక్తి బాలసుబ్రమణియన్‌కు పరిచయం అయ్యారు. అతడు కర్ణాటక ప్రభుత్వ పథకం కింద శానిటరీ నేప్కిన్ తయారు చేసే ఒప్పందాన్ని కుదురుస్తానని చెప్పారు. దీన్ని నమ్మిన బాల సుబ్రమణియన్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. తన అకౌంట్ గల అంబత్తూరు కెనరా బ్యాంకు బ్రాంచ్‌లో మేనేజర్‌ను బాలసుబ్రమణియన్ సంప్రదించారు. బ్యాంకులో తాను ఐఏఎస్ అధికారి జయకుమార్ అని బాలసుబ్రమణియన్‌కు అవసరమైన సహాయాన్ని అందించాలని సూచించడంతో బ్యాంకు రుణం ఇవ్వడానికి కెనరా బ్యాంక్ మేనేజరు జగదీష్ ఒప్పుకోవడంతో నకిలీ దస్తావేజులను సమర్పించి రూ.19 కోట్లను రుణం తీసుకున్న జయకుమార్ ఆ సొమ్ముకు జవాబుదారిగా బాలసుబ్రమణియన్ పేరు జత చేశారు. రుణం చెల్లించకపోవడంతో దీనిపై చెన్నై కేంద్ర నేర విభాగ పోలీసులకు కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. విచారణలో ఐఏఎస్ అధికారిగా నటించి మోసం చేసిన జయకుమార్ అసలు పేరు సుకాష్ చంద్రశేఖర్ అని, అతని ప్రియురాలు మలయాళ నటి లీనా మరియాపాల్ కలిసి నకిలీ దస్తావేజులను తయారు చేసి మోసానికి పాల్పడినట్లు తెలిసింది. ఇంకనూ బాలసుబ్రమణియన్ అకౌంట్ నుంచి రూ.19 కోట్లను ముంబైలో గల బ్యాంకు అకౌంట్‌కు చంద్రశేఖర్ మార్చుకున్న విషయం వెలుగుచూసింది. దీంతో బాలసుబ్రమణియన్, అతని భార్య, బ్యాంకు మేనేజర్ జగదీష్‌లను అరెస్టు చేశారు. ఇంకా సుకాష్ చంద్రశేఖర్‌ను ఢిల్లీనూ, అతని భార్య లీనా మరియాపాల్ను చెన్నై సేలయూరులో అరెస్టు చేశారు. సుకాష్ చంద్రశేఖర్‌పై ఇండియా వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 25కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ముంబైలో అతడు జైలులో ఉన్నాడు. ముంబైకు వె ళ్లిన చెన్నై పోలీసులు అక్కడ జైలులో ఉన్న సుకాష్ చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు. చెన్నైకు తీసుకువచ్చిన పోలీసులు అతడిని ఎగ్మూర్ న్యాయస్థానంలో హాజరు పరచి పుళల్ జైలుకు తరలించారు. త్వరలో అతడిని పోలీసు కస్టడీలో తీసుకుని విచారణ జరుపుతారు. -
కార్లు, వాచీల కోసం హీరోయిన్ మోసం.. అరెస్టు
చిన్న సినిమాల్లో హీరోయిన్గా చేస్తూ.. దాదాపు వెయ్యిమందిని కోట్లాది రూపాయల మేర మోసగించిన యువతిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆమె బాధితుల్లో ఐటెం బాంబ్ రాఖీ సావంత్ కూడా ఒకరు కావడం గమనార్హం. లీనా మారియా పాల్ (26), ఆమె సహజీవన భాగస్వామి శేఖర్ చంద్రశేఖర్ (25) మరికొందరితో కలిసి దాదాపు వెయ్యిమందికి టోపీ పెట్టి 9 లగ్జరీ కార్లు, 117 ఇంపోర్టెడ్ వాచీలు, ఒక స్పోర్ట్స్ బైకు, 12 సెల్ఫోన్లు, ఇంకా అనేక విలాసవంతమైన వస్తువులు సొంతం చేసుకున్నారు. దాంతో ముంబై క్రైం బ్రాంచి ఆర్థిక నేరాల విభాగం పోలీసులు వాళ్లను, వాళ్లతో పాటు అదిల్ జైపురి (24) అఖ్తర్ జైపురి (55), సల్మాన్ రిజ్వీ (28), నజీర్ జైపురి (50) అనే నలుగురిని కూడా అరెస్టు చేశారు. రెడ్ చిల్లీస్ అనే సినిమాలో మోహన్లాల్తోను, మద్రాస్ కేఫ్ సినిమాలో జాన్ అబ్రహంతోను పాల్ హీరోయిన్గా పనిచేసింది. లయన్ ఓక్ ఇండియా అనే బోగస్ కంపెనీ పెట్టి, వేలాది మంది నుంచి కోట్లాది రూపాయలు పెట్టుబడులుగా తీసుకున్నారు. పెట్టిన పెట్టుబడి మీద నెలకు 20 శాతం చొప్పున మూడు నెలల్లో 300 శాతం లాభాలు ఇస్తామని వీళ్లు చెప్పేవారు. వాళ్లు కట్టిన డబ్బుతో వ్యాపారాలు ఏమీ చేయకుండా.. పైపెచ్చు లగ్జరీ కార్లు కొనేవాళ్లు. బెంట్లీ, ఆడి, మెర్సిడిస్, మాసెరాటి, నిస్సాన్ లాంటి బ్రాండ్ కార్లు వాళ్ల వద్ద ఉన్నాయి. రూ. 23 లక్షల విలువైన హోండా స్పోర్ట్స్ బైకు కూడా ఉంది. అంతేకాదు, చంద్రశేఖర్ తనను తాను ఐఏఎస్ అధికారిగా చెప్పుకొని, ఓ బ్యాంకు నుంచి రూ. 19 కోట్ల రుణం కూడా తీసుకున్నాడు. నాకు 2.5 కోట్ల టోపీ: రాఖీసావంత్ ఈ స్కాం బాధితుల్లో బాలీవుడ్ ఐటెం బాంబు రాఖీ సావంత్ కూడా ఉన్నారు. తాను వీళ్ల వద్ద రూ.2.5 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ఆమె చెప్పింది. వాళ్ల జీవనశైలి చూసి షాక్ తిన్నానని, తన డబ్బు ఎలా తిరిగి వస్తుందనే ఆలోచిస్తున్నానని తెలిపింది.