సాక్షి, న్యూఢిల్లీ: రూ. 200కోట్ల మేర మోసం కేసులో బాలీవుడ్ హీరోయిన్ లీనా మరియా పాల్, ఆమె భర్త సుకేశ్ చంద్రశేఖర్‌కు ఈడీ షాక్ ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ జంటను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం అరెస్ట్ చేసింది. అనంతరం వారి ఢిల్లీ కోర్టుముందు హాజరుపర్చింది. వీరికి 14 రోజుల రిమాండ్ విధించాలని కోరింది. గతంలో ఈ దంపతులను ఈడీ అనేక సందర్బాల్లో విచారించిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ మూవీ ‘మద్రాస్ కేఫ్’లో నటించిన లీనా, తన భర్త సుకేశ్ చంద్రశేఖర్ జైల్లో ఉండగా స్పూఫ్ ఫోన్ కాల్ ద్వారా ఒక కేంద్ర ప్రభుత్వ అధికారిలా నటిస్తూ ఒక వ్యాపారవేత్త భార్య నుండి 200 కోట్ల రూపాయలు దోచుకున్నట్టు ఆరోపణలు నమోదైనాయి. ఈ వ్యవహారంలో ఆమెతో కుమ్మక్కయ్యారంటూ అనేక మంది జైలు, బ్యాంకు అధికారులు కూడా అడ్డంగా బుక్కయ్యారు. ఈ కేసు దర్యాప్తులో ఈడీకి గట్టి ఆధారాలు లభించడంతో చంద్రశేఖర్ భార్య లీనాను ఢిల్లీ పోలీసులు కూడా అరెస్టు చేశారు
ఇటీవల చెన్నైలోని వీరి బంగ్లాపై నిర్వహించిన దాడుల్లో కోట్ల రూపాయల విలువైన వస్తువులను, అంతర్జాతీయ బ్రాండ్ల ఖరీదైన దుస్తులు, 16 వాహనాలను స్వాధీనం ఈడీ చేసుకుంది. సుకేశ్‌అక్రమంగా సంపాదించిన డబ్బులతో లీనా లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నట్టు ఈడీ భావించింది. అలాగే ఈ రాకెట్‌లో ప్రధాన నిందితుడు సుకేశ్‌కు సహకరించిన దీపక్ రామ్‌దానీ, ప్రదీప్ రమణిలను ఈడీ అరెస్టుచేసింది. సుకేష్ సూచనల మేరకు వ్యాపారవేత్త భార్య నుండి అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ అధికారులు వెల్లడించారు. జూన్ 2020 నుండి మే 2021 మధ్య, ఈ జంట దాదాపు 40 సార్లు మోసానికి పాల్పడినట్టు ఈడీ గతంలొ పేర్కొంది.
Enforcement Directorate arrests Sukesh Chandrasekhar & his partner actress Leena Maria Paul in connection with a Rs 200 crore extortion case, produces them before a court in Delhi, seeking 14 days remand
— ANI (@ANI) October 9, 2021
Comments
Please login to add a commentAdd a comment