సినీ నటి బ్యూటీ పార్లర్‌ వద్ద కాల్పులు | Firing at Actress Malayala Leena Maria Paul Salon | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 16 2018 9:19 AM | Last Updated on Sun, Dec 16 2018 9:36 AM

Firing at Actress Malayala Leena Maria Paul Salon - Sakshi

ప్రముఖ మలయాళ నటి, మోడల్‌ లీనాపాల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. శనివారం మధ్యాహ్నం 3:45 గంటల ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెపై కాల్పులు జరిపి పరారైనట్టుగా పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జరిగిన సమయంలో లీనా తన బ్యూటీ పార్లర్‌ నెయిల్‌ ఆర్టిస్ట్రీ లో ఉన్నారు. అయితే పార్లర్‌ బిజీగా ఉండటంతో దుండగులు బయటి నుంచే ఎయిర్‌ గన్స్‌తో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. 

అండర్‌ వరల్డ్‌ తో ఉన్న ఆర్థిక పరమైన విభేదాలే దాడికి కారణమని భావిస్తున్నారు. పార్లర్ తో పాటు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు  స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు. గతంలో లీనాపై పలు ప్రాంతాల్లో చీటింగ్ కేసులు నమైదయ్యాయి. 2013, 2015లలో చీటింగ్‌ కేసుల్లో ఈమె అరెస్ట్‌అయినట్టుగా పోలీసులు తెలిపారు. జాన్‌ అబ్రహం హీరోగా తెరకెక్కిన మద్రాస్‌ కేఫ్‌తో పాటు మోహన్‌ లాల్ రెడ్‌చిల్లీస్‌ సినిమాల్లో లీనా కీలక పాత్రల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement