'ఆకలితో అలమటిస్తుంటే నినాదాలా?' | I want to live and fight elections in Assam: Rakhi Sawant | Sakshi
Sakshi News home page

'ఆకలితో అలమటిస్తుంటే నినాదాలా?'

Published Thu, Apr 7 2016 7:15 PM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM

'ఆకలితో అలమటిస్తుంటే నినాదాలా?'

'ఆకలితో అలమటిస్తుంటే నినాదాలా?'

గువాహటి: తనకు బీజేపీ ఎంపీ టిక్కెట్ ఆఫర్ చేసినా తిరస్కరించానని బాలీవుడ్ ఐటమ్ గాళ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా-అథవాలే(ఆర్పీఐ-ఏ) నాయకురాలు రాఖీ సావంత్ వెల్లడించింది. 2014 సాధారణ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి లోక్ సభ టిక్కెట్ ఇస్తానంటే తిరస్కరించానని చెప్పింది. అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేసేందుకు గువాహటికి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడింది.

ఈ నెల 11న జరగనున్న అసోంలో ఎన్నికల్లో తమ పార్టీ తరపున 21 స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేయనున్నారని చెప్పింది. దళిత హక్కుల కోసం పోరాడుతున్నానని.. కాంగ్రెస్, బీజేపీలు పేదలకు చేసింది ఏమీ లేదని విమర్శించింది. ప్రజలు పేదరికంతో అలమటిస్తుంటే 'భారత్ మాతాకి జై' అని ఎలా నినదిస్తారని సూటిగా ప్రశ్నించింది. అసోంలో నివాసం ఏర్పచుకోవాలనుకుంటున్నానని, ఇక్కడి నుంచే పోరాటం చేయాలనుకుంటున్నట్టు రాఖీ సావంత్ తెలిపింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement