అనంత్‌ అంబానీ బరువుపై అసభ్యకరమైన కామెంట్లు చేసిన హీరోయిన్‌ | Rakhi Sawant Comments On Anant Ambani And Radhika Merchant Pre-Wedding | Sakshi
Sakshi News home page

వేడుకలకు పిలుపు లేదనే అక్కసుతో అనంత్‌ అంబానీ బరువుపై హీరోయిన్‌ కామెంట్లు

Published Thu, Mar 7 2024 9:45 AM | Last Updated on Thu, Mar 7 2024 10:50 AM

Rakhi Sawant Comments On Anant Ambani And Radhika Merchant Pre-Wedding - Sakshi

భారత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ , రాధికా మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్‌ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌ వేదికగా మార్చి 1-3 వరకు  ఘనంగా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలను ‘హస్తాక్షర్‌ ’ కార్యక్రమంతో ముగించారు. దేశ, విదేశాల్లో పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

ఈ క్రమంలో అంబానీ ఫంక్షన్‌పై బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్ స్పందించింది. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకు తనను ఎందుకు పిలవలేదని ఆమె ప్రశ్నించింది. ఒకవేళ తనను పిలిచి ఉంటే ఫ్లోర్‌ క్లీన్‌ చేయడం నుంచి వంట పాత్రలు కడగడం వరకు తానే స్వయంగా చేసేదానినంటూ ఆమె ఇలా పేర్కొంది. 'అంబానీ జీ నమస్తే. నన్ను పెళ్లికి ఎందుకు పిలవలేదు? మీరు ఇంకా నా డ్యాన్స్ చూడలేదనుకుంటా.. మీరు సింగర్‌ రిహానాతో పాటుగా ఖాన్‌, ఐఖాన్‌ అంటూ ఎందరినో పిలిచారు.

మీ వేడకలో వారు చేసిన డ్యాన్స్‌ నా ముందు జుజూబీ.. మీరు నా డాన్స్ చూశారా? మున్నీ బద్నామ్ హుయ్ డార్లింగ్ తేరే లియే, తుక్ తుక్ దేఖే, పరదేశియా ఇలా చాలా పాటలు చేశాను. అవన్నీ మీరు చూడలేదు అనుకుంటా. మీరు కోట్లకు కోట్లు డబ్బు ఇచ్చినా రిహానా చిరిగిన బట్టలతో వచ్చింది. నాకు రూ. 10 కోట్లు ఇచ్చి వుంటే మీకు ఎన్నో ప్రయోజనాలు కలిగేవి. మీ అతిథులందరి గదులు శుభ్రం చేయడం నుంచి వంట పాత్రలు కడిగే వరకు అన్నీ నేనే చేసేదాన్ని. అంటూ కామెంట్‌ చేసింది.

అనంత్‌ బరువుపై కామెంట్లు
అనంత్‌ అంబానీ బరువుపై రాఖీ సావంత్‌ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది. ' డియర్‌ అంబానీ జీ.. అనంత్ అంబానీ బాగా బరువు పెరిగారు.. ఆయన్ను నా వద్దకు 5రోజుల పాటు పంపించండి. కట్టెపుల్లలా సన్నగా చేసి పంపుతాను. దీని కోసమైన కొంత డబ్బు ఇచ్చి నన్ను  కొనుక్కోండి. ఆయనతో కసరత్తులు చేయించడమే కాకుండా.. తృప్తి చేసి పంపిస్తాను. అనంత​ అంబానీని జీరో సైజ్‌కు చేర్చి మీ వద్ద ఉంచే బాధ్యత నాది. ఆయన బరువు తగ్గితే మీతో పాటుగా మీ కోడలు కూడా చాలా సంతోషిస్తుంది. అసలే మీ కోడలు దానిమ్మ పండులా ఉంది. ఆయన సన్నగా అయితే ఆమెకే మంచిది.' అని అనంత్ అంబానీ బరువుపై రాఖీ సావంత్ సోషల్ మీడియాలో వివాదాస్పదంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది.

దీంతో రాఖీ సావంత్ తీరుపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బరువు పెరిగినట్లు స్వయంగా ఆయన చెబుతూ ప్రీవెడ్డింగ్‌ వేడుకలోనే ఎమోషనల్‌ అయ్యాడు. అలాంటి వ్యక్తి గురించి ఇలా వల్గర్‌గా మాట్లాడడానికి సిగ్గులేదా అని ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఆయన అమ్మగారు అయిన  నీతా అంబానీ కూడా అనంత్ ఆరోగ్య సమస్యల గురించి గతంలో వివరించారు. అనారోగ్య కారణాలతో కొన్ని రకాల స్టెరాయిడ్స్ వాడటం వల్ల అనంత్‌ బరువు పెరిగాడని ఆమె చెప్పుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement