సన్నీ లియోన్‌పై వర్మ వ్యాఖ్యల్లో తప్పేముంది? | I am with RGV and he is right, says Rakhi Sawant | Sakshi
Sakshi News home page

సన్నీ లియోన్‌పై వర్మ వ్యాఖ్యల్లో తప్పేముంది?

Published Fri, Mar 10 2017 8:05 PM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

సన్నీ లియోన్‌పై వర్మ వ్యాఖ్యల్లో తప్పేముంది?

సన్నీ లియోన్‌పై వర్మ వ్యాఖ్యల్లో తప్పేముంది?

ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ చేసిన ట్వీట్‌లపై బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్ స్పందించింది.

ముంబై: ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ చేసిన ట్వీట్‌లపై బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్ స్పందించింది. పైగా తన మద్దతు వర్మకేనని చెప్పింది. వివాదం ఏంటంటే.. బాలీవుడ్ హాట్ నటి సన్నీ లియోన్‌పై చేసిన ట్వీట్‌లకు గానూ వర్మపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వెనక్కి తగ్గిన వర్మ.. తన వ్యాఖ్యలపై బాధ పడ్డవారికి మరో ట్వీట్‌లో సారీ చెప్పేశారు. సెన్సేషన్ కోసం లేని హడావుడి చేసిన వారికి, తనపై బెదిరింపు చర్యలకు పాల్పడ్డ వారికి క్షమాపణలు వర్తించవని చురకలు అంటించాడు వర్మ. వివాదం ముగిసిపోయిన తరుణంలో తన మద్దతు మాత్రం దర్శకుడు వర్మకే ఉంటుందని మీడియాతో మాట్లాడుతూ రాఖీ సావంత్ చెప్పింది.

'వర్మ చెప్పింది అక్షరాలా నిజమే. నా మద్దతు ఆయనకే ఉంటుంది. సన్నీ లియోన్‌ను ప్రశంసించడం, ఆమెను చూసి మహిళలు నేర్చుకోవాలని.. అందరూ తమ భర్తలకు అలాంటి ఆనందాన్ని పంచాలని చెప్పడంలో తప్పేముంది. మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాకూడదు. సన్నీ తన పనిచేసుకుంటూనే భర్తను ఎంతో కేరింగ్‌గా చూసుకుంటుంది. అందుకే భర్తలను ఎలా సంతోషపెట్టాలో తెలుసుకునేందు భార్యలు ప్రత్యేక క్లాసులకు వెళ్లాలన్న వర్మ వ్యాక్యలను నేను పూర్తిగా సమర్ధిస్తున్నానని' రాఖీ సావంత్ మరో వివాదానికి తెరతీసింది. ప్రత్యేక క్లాసులతో మహిళలలో ఎంతో మార్పు వస్తుందని వ్యాఖ్యానించింది. ఈ ఐటమ్ గర్ల్ వ్యాఖ్యలపై మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

సంబంధిత కథనాలు

వెనక్కు తగ్గిన వర్మ
దర్శకుడు వర్మను చెప్పులతో కొడతాం
మరో వివాదంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement