![వెనక్కు తగ్గిన వర్మ](/styles/webp/s3/article_images/2017/09/5/41458812766_625x300.jpg.webp?itok=kbve7i4O)
వెనక్కు తగ్గిన వర్మ
మహిళలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మ వెనక్కు తగ్గారు. తన వ్యాఖ్యల కారణంగా బాధ పడిన వారికి ట్విటర్ ద్వారా క్షమాపణ చెప్పారు.
‘నేను నా అభిప్రాయాలు వ్యక్తపరిచాను. మహిళా దినోత్సవం సందర్భంగా అనుద్దేశపూర్వకంగా నేను పోస్ట్ చేసిన మొరటు ట్వీట్స్ ను తప్పుగా భావించిన వారికి క్షమాపణ చెబుతున్నాను. నా వ్యాఖ్యలు ఎవరికైతే నిజంగా కోపం తెప్పించాయో వారిని మాత్రమే క్షమాపణ అడుగుతున్నాను. ప్రచారం కోసం హడావుడి చేసిన వారికి, చట్టాన్ని తమ చేతుల్లోని తీసుకుంటామని బెదిరించిన వారికి మాత్రం కాద’ని వర్మ ట్వీట్ చేశారు.
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాంగోపాల్ వర్మ క్షమాపణ చెప్పకపోతే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటామని కొంత మంది హెచ్చరించిన నేపథ్యంలో ఆయనీ విధంగా స్పందించారు.