మరోసారి తన తీరుతో వార్తలో నిలిచాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. బుధవారం(మార్చి 15న) గుంటూరు ఆచార్య నాగార్జున వర్సిటీలో జరిగిన అకాడమిక్ ఎగ్జిబిషన్ 2023 ఈ వెంట్‌కు వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. నచ్చింది తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి అంటూ విద్యార్థులకు ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో ఆయన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.
చదవండి: క్రేజీ బజ్: రిషబ్ శెట్టి-విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీ?
అదే విధంగా ఆర్జీవీ మాట్లాడుతూ.. ‘నేను చనిపోయాక స్వర్గానికి వెళ్తే అక్కడ ఏం లేకపోతే ఎలా.. అందుకే ఆ చాన్స్ తీసుకోకుండ ఇక్కడే అన్ని అనుభవించేస్తా’ అన్నాడు. ఒకవేళ స్వర్గంలో రంభ, ఊర్వశీలు ఉండకపోవచ్చు.. అందుకే ఇక్కడే ఎంజాయ్ చేయాలంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. ఇక తాను చనిపోయిన తర్వాత ప్రపంచమంత మరో క్షణంలో అంతమైన తాను లెక్కయనన్నాడు. ఎందుకంటే తాను కేవలం తన కోసమే బ్రతుకుతానన్నాడు. మీ భవిష్యత్తు ఏంటీ? మీరు ఎంత బాగా చదువుతున్నారనేది తాను కేర్ కూడా చేయనన్నాడు.
చదవండి: రాము పరీక్షల్లో ఏం చేశాడంటే.. ఆర్జీవీ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
రంభ, ఊర్వశీ, మేనకలతో తిరిగినప్పుడే తనకు మోక్షం కలుగుతుందంటూ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అలాగే వైరస్ వచ్చి తాను తప్ప మగజాతి అంతా పోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో వర్మ కామెంట్స్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఇక వర్మ వ్యాఖ్యలకు అక్కడ ఉన్న మహిళా లెక్చరర్లు షాక్ అయ్యారు. అయితే ఆర్జీవీ మాట్లాడుతుంటే స్టూడెంట్స్ అంతా గట్టి గట్టిగా అరుస్తూ రెచ్చిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment