
బిగ్‌బాస్ షోతో బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది నటి రాఖీ సావంత్. షో ముగిసిన తర్వాత కూడా ఆ పాపులారిటీని అలాగే కాపాడుకుంది. తరచూ ఏదో ఒక వివాదంలో నిలుస్తూ టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. ఇటీవలే తన భర్తతో తెగదెంపులు చేసుకున్న ఆమె మరోసారి ప్రేమలో పడిందట! ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా వెల్లడించింది. 'నాకు ఒకరు పరిచయం అయ్యారు. అతడు చాలా మంచి వ్యక్తి. కానీ అతడితో జీవితాన్ని పంచుకోవడానికి ఇప్పుడప్పుడే సిద్ధంగా లేను.
పెళ్లి బంధం బీటలు వారండంతో డిప్రెషన్‌లోకి..
నా మొదటి పెళ్లితో ఎన్ని తంటాలు వచ్చాయో, ఎన్ని కష్టాలు పడ్డానో మీ అందరికీ తెలుసు. అందుకే పెళ్లంటేనే భయమేస్తోంది. ఆ డిప్రెషన్ నుంచి బయటపడేందుకే దుబాయ్ వెళ్లి వచ్చాను. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. జీవితంలో మనల్ని బాధపెట్టేవాళ్లు ఉంటారు. పుండు మీద కారం చల్లేవాళ్లు కూడా ఉంటారు. కానీ ఆ గాయాలకు ఆయింట్‌మెంట్ రాసేవారు కొందరే ఉంటారు. వారిని వదిలిపెట్టకుండా మనతోనే ఉంచేసుకుంటే మనకే మంచిది' అని చెప్పుకొచ్చింది రాఖీ సావంత్.
తనకంటే చిన్నవాడితో ప్రేమ.. వివాహం.. విడాకులు!
కాగా రాఖీ సావంత్ గతంలో రితేశ్ సింగ్‌ను పెళ్లాడింది. అయితే అతడు తనకు ఇదివరకే వివాహమైన విషయాన్ని దాచిపెట్టాడు. పైగా మొదటి భార్యకు విడాకులు కూడా ఇవ్వలేదు. రితేశ్‌కు భార్యాపిల్లలు ఉన్నారని, అతడితో తన పెళ్లి చెల్లదంటూ తెగదెంపులు చేసుకుంది నటి. గతేడాది ప్రేమికుల రోజున భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన అదిల్ దురానీతో ప్రేమలో పడింది. అతడిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆమె ఆ విషయాన్ని ఆలస్యంగా బయటపెట్టింది. కానీ కొంతకాలానికే వీరి మధ్య గొడవలు తలెత్తడంతో చివరకు భర్తను జైల్లో పెట్టించింది రాఖీ సావంత్. అతడితో విడిపోయినప్పటికీ విడాకులు మంజూరవడం కోసం ఎదురు చూస్తోంది.
చదవండి: షారుక్ ఖాన్‌కు చేదు అనుభవం
Comments
Please login to add a commentAdd a comment