
ప్రపంచమంతా కరోనా వైరస్ పేరు వింటే భయపడుతుంటే.. ఓ బాలీవుడ్ నటి మాత్రం కరోనా అంతు చూసివస్తానంటూ చైనాకు బయల్దేరింది. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వివాదాల రాణిగా పేరొందిన రాఖీ సావంత్ తన విచిత్రమైన యాక్టివిటీస్‌తో ఎప్పుడూ వార్తల్లో కనిపిస్తుంటుంది. అయితే తాజాగా.. తాను చైనాకు వెళ్తున్నానని, కరోనా అంతు చూసి వస్తానంటూ విమానంలో తీసుకున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె చెప్పిన ఈ మాటలు విడ్డూరంగా ఉండటంతో ఇది వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందిస్తున్నారు. (కరోనా: సరిహద్దుల్ని దాటి ప్రాణాల్ని హరించేస్తోంది)
ఆ వీడియోలో.. కరోనా వైరస్‌కు ఏమాత్రం భయపడేది లేదని తెలిపింది. పైగా తాను చైనాకు వెళ్తున్నట్లు తీసిన వీడియోను పోస్ట్ చేసింది. అంతేగాక.. కరోనా వైరస్‌ను అంతమొందించాకే ఊపిరి పీల్చుకుంటా అంటోంది. ఇంతటితో ఆగని ఆ బాలీవుడ్ ముద్దుగుమ్మ అమెరికాలోని నాసాను సంప్రదించి వైరస్‌ను అంతమొందించేందుకు ఏవైనా ఔషదాలను అందించాలని కూడా కోరతానంటూ రాఖీ స్పష్టం చేసింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment