
ముంబై : ఇప్పటివరకు నేరుగా ఎదురుపడకున్నా నటీమణులు రాఖీ సావంత్-సన్నీ లియోన్‌లు నిత్యం కలహించుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా సన్నీపై విచిత్రమైన ఆరోపణలతో విరుచుకుపడింది రాఖీ. అడల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి తనకు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, మొబైల్ నంబర్‌ను ఇచ్చింది కూడా సన్నీనే అని ఆరోపిస్తోంది. ‘బిజినెస్ టైమ్స్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సావంత్ ఈ మేరకు సంచలన విషయాలు చెప్పుకొచ్చింది.
‘‘ఇటీవల పోర్న్ ఇండస్ట్రీకి చెందిన కొందరు నాకు ఫోన్లు చేసి, నటించమని అడిగారు. నేను షాకయ్యాను. అసలు మీకు నా నంబర్ మీకు ఎలా వచ్చిందని అడిగా, వాళ్లు సన్నీ లియోన్ పేరు చెప్పారు. మళ్లీ షాక్. కొద్ది సెకన్లకు తేరుకుని.. నేను భారతీయురాలిని కాబట్టి అలాంటి సినిమాల్లో నటించలేనని స్పష్టం చేశా’’ అని రాఖీ తెలిపారు. ఒకప్పుడు అడల్ట్ ఫిలిమ్స్ చేసిన సన్నీ.. బాలీవుడ్‌లోకి ఎంటరై, వరుస విజయాలు సాధించడం, దేశంలో అత్యధికులు ‘సెర్చ్ చేసే పేరు’గా ఖ్యాతికెక్కడం తెలిసిందే. ‘
సన్నీ రాకతో అవకాశాలు కోల్పోయారని అసూయగా ఉందా?’ అన్న హోస్ట్ ప్రశ్నకు రాఖీ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ‘‘బాలీవుడ్‌లో నాకంటూ ఒక పేరుంది. ఎవరో సన్నీ లియోన్‌పై ఈర్ష్య పడాల్సిన అవసరంలేదునాకు. అయినా, కుటుంబమంతా కలిసి చూడగలిగే సినిమాలు చేసిన నాకు, ఆమెకు పోలికేలేదు. నేను అచ్చమైన భారతవనితను కాబట్టే, ఎక్కువ డబ్బు ఇస్తామని ఆఫర్లొచ్చినా, ఆ సినిమాలకు దూరంగా ఉంటున్నా’’ అని రాఖీ సావంత్ చెప్పారు. కాగా, ఈ రాఖీ కామెంట్లపై సన్నీగానీ ఆమె భర్త డానియెల్‌గానీ ఇంకా స్పందిచలేదు.
Comments
Please login to add a commentAdd a comment