
వాలంటైన్స్ డే.. ప్రేమను అభివ్యక్తీకరించే రోజు.. రెండు మనసులు ఒక్కటయ్యే వేడుక.. ఆల్‌రెడీ లవ్‌లో ఉన్నవాళ్లు గిఫ్టులు ఇచ్చిపుచ్చుకునే స్పెషల్ డే. ఇలాంటి ప్రేమికుల రోజున విడిపోతున్నామని ప్రకటించిందో బాలీవుడ్ జంట. వివాదాస్పద నటి రాఖీ సావంత్ తన భర్త రితేష్ సింగ్‌తో విడిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది.
'రితేష్, నేను విడిపోవాలని నిశ్చయించుకున్నాం. బిగ్‌బాస్ షో తర్వాత నాకు తెలియకుండా చాలా జరిగాయి. వాటిలో కొన్నింటిని నేను నియంత్రించలేకపోయాను. మేము మా మధ్య ఉన్న మనస్పర్థలను, గొడవలను పరిష్కరించుకునే ప్రయత్నం చేశాం. కానీ చివరాఖరకు ఇద్దరం విడివిడిగా ముందుకు సాగితేనే మంచిదని తెలుసుకున్నాం. వాలంటైన్స్‌డేకు ఒకరోజు ముందే ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది. హృదయం ముక్కలైనట్లుగా అనిపిస్తోంది.
విడాకుల తర్వాత రితేష్ మంచి జీవితం గడపాలని కోరుకుంటున్నా. నేను నా జీవితంపై, కెరీర్‌పై ఫోకస్ చేయాలనుకుంటున్నాను. ఎల్లప్పుడూ నన్ను నేను సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటున్నాను. మా నిర్ణయాన్ని గౌరవించి, నాకు అండగా నిలబడే ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు..' అని రాఖీ సావంత్ రాసుకొచ్చింది. కాగా రితేష్‌కు గతంలో స్నిగ్ధప్రియతో వివాహం జరగగా వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ పెళ్లి విషయాన్ని దాచిపెట్టి రితేష్ రాఖీ సావంత్‌కు దగ్గరయ్యాడని ఆమధ్య స్నిగ్ధప్రియ ఆరోపించిన విషయం తెలిసిందే. కట్టుకున్న భార్యను తానుండగా రాఖీతో అతడి బంధం చెల్లదని సైతం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment