పుట్టుక‌తోనే ఎవ‌రూ వేశ్య కాదు | Rakhi Sawant Says Tawaif Highlight Plight Of Sex Workers | Sakshi
Sakshi News home page

సెక్స్ వ‌ర్కర్ల దీన స్థితిని చూపించబోతున్నాం

Dec 10 2020 9:14 PM | Updated on Dec 10 2020 9:14 PM

Rakhi Sawant Says Tawaif Highlight Plight Of Sex Workers - Sakshi

కూటి కోసం కోటి తిప్ప‌లు అన్న నానుడి ఊరికే రాలేదు. క‌డుపులో నాలుగు ముద్ద‌లు ప‌డాలంటే బండెడు క‌ష్టం చేయాల్సిందే. దీనికోసం ఎవ‌రికి తోచిన ప‌నులు వాళ్లు చేస్తారు. చాలామంది కాయ‌క‌ష్టాన్ని న‌మ్ముకోగా కొంద‌రు మాత్ర‌మే శ‌రీరాన్ని అమ్ముకుంటారు. వాళ్లే వేశ్య‌లు. ఈ పదాన్ని ఈసడించుకునేవాళ్లు ఎంతోమంది. కానీ వారి జీవితాలు అంత‌క‌న్నా హీనంగా ఉంటాయంటున్నారు బాలీవుడ్ న‌టి రాఖీ సావంత్‌. (నిన్ను నువ్వే పెళ్లి చేసుకుంటున్నావా?)

"వేశ్య అన్న ప‌దం విన‌గానే మ‌నుషుల ముఖాల్లో హావ‌భావాలు చిత్ర‌విచిత్రంగా  ఎందుకు మార‌తాయో నాకర్థం కాదు. కానీ వాళ్ల ద‌గ్గ‌ర నుంచి ప‌న్ను వ‌సూలు చేస్తున్న‌ప్పుడు వాళ్లకు ర‌క్ష‌ణ‌గా ఉండేందుకు బ‌ల‌మైన చ‌ట్టాల‌ను ఎందుకు చేయ‌డం లేదు? వాళ్ల పిల్ల‌ల‌కు స్కూల్‌లో ఎందుకు అడ్మిష‌న్ దొర‌క‌డం లేదు? అని ప్ర‌శ్నించారు.  ఈ సెక్స్ వ‌ర్క‌ర్ల వ‌ల్లే కుటుంబాలు విచ్ఛిన్న‌మ‌వుతాయ‌నుకుంటారు. కానీ వారు కుటుంబాల‌ను క‌లుపుతారు. పుట్టుక‌తోనే ఎవ‌రూ వేశ్య కాద‌న్న విష‌ష‌యంతో పాటు సెక్స్ వ‌ర్క‌ర్ల దీన‌స్థితిని మా వెబ్ సిరీస్ ద్వారా చూపించ‌బోతున్నాం" అని రాఖీ సావంత్ చెప్పుకొచ్చారు. కాగా బాలీవుడ్‌లో ప‌లువురు న‌టీన‌టులు వేశ్య‌గా న‌టించారు. దేవ‌దాస్‌లో మాధురీ దీక్షిత్‌, త‌వైఫ్‌లో రాతి అగ్రిహోత్రి, ఉమ్రావ్ జాన్‌, ముఖ‌ద్ద‌ర్ కా సికింద‌ర్‌లో రేఖా, ఉమ్రావ్ జాన్‌లో ఐశ్వ‌ర్యా రాయ్‌‌, పాకీజాలో మీనా కుమారి వేశ్య‌లుగా న‌టించి మెప్పించారు. (‘అంతిమ్’‌ ఫస్ట్‌లుక్‌.. సరికొత్త గెటప్‌లో సల్మాన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement