ఐటమ్ గాళ్ సంచలన విషయాలు | Rahul used to torture Pratyusha Banerjee, says Rakhi Sawant | Sakshi
Sakshi News home page

ఐటమ్ గాళ్‌ సంచలన విషయాలు

Published Wed, Apr 6 2016 8:14 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

ఐటమ్ గాళ్ సంచలన విషయాలు

ఐటమ్ గాళ్ సంచలన విషయాలు

ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ ఐటమ్ గాళ్‌ రాఖీ సావంత్ సంచలన విషయాలు వెల్లడించింది. ప్రత్యూషను రాహుల్ రాజ్ సింగ్ నిత్యం చిత్రహింసలు పెట్టేవాడని విలేకరుల సమావేశంలో చెప్పింది. ప్రత్యూషను టార్చర్ పెట్టొద్దని రాహుల్ కు చాలాసార్లు చెప్పానని తెలిపింది. ప్రత్యూష కుటుంబానికి ప్రభుత్వం రూ. 5 కోట్లు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రత్యూషను హత్య చేశారని ఆమె ఆరోపించింది.

మహిళల ఆత్మహత్యల నివారణకు తనదైన శైలిలో సూచన చేసింది రాఖీ సావంత్. ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్లు నిషేధించాలని సూచించింది. సీలింగ్ ఫ్యాన్లపై నిషేధం విధించాలని మీడియా ముఖంగా ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. 'కూతుళ్లు, సోదరీమణులు, కోడళ్లు సీలింగ్ ఫ్యాన్లకు ఉరేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీటిని నిషేధించాలని ప్రధాని మోదీని కోరుతున్నా. మీ కుమార్తెలు లేదా సోదరీమణులపై ప్రేమ ఉంటే ఇళ్లలోని సీలింగ్ ఫ్యాన్లను పీకి బయటపడేయండి. టేబుల్ ఫ్యాన్లు లేదా ఏసీలు వాడండి' అని రాఖీ సావంత్ సూచించింది. కాగా, ప్రత్యూష ఆత్మహత్య కేసులో రాహుల్ పై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement