Pratyusha Banerjee suicide case
-
వ్యభిచారం చేయాలని టీవీ నటిపై ఒత్తిడి!
ముంబై: ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బేనర్జీ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. వ్యభిచారం చేయాలని ప్రత్యూషను ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. వారిద్దరి మధ్య ఫోన్లలో చివరిసారిగా జరిగిన సంభాషణలను 'ముంబై మిర్రర్' వెల్లడించింది. మూడు నిమిషాల నిడివున్న ఈ ఫోన్ సంభాషణలు ప్రత్యూష్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు జరిగినట్టు తెలిపింది. 'నన్ను నేను అమ్ముకోవడానికి ఇక్కడికి రాలేదు. నటించడానికి, పనిచేయడానికే ఇక్కడికి వచ్చాను. కానీ ఈరోజు నన్ను నువ్వు ఎక్కడ ఉంచావు? రాహుల్... నీకు తెలీదు ఇప్పడు నేనెంతగా కుమిలిపోతున్నానో. నువ్వు స్వార్థపరుడివి. నా పేరును చెడగొట్టావు. జనం నన్ను, నా తల్లిదండ్రుల గురించి చెడుగా మాట్లాడుకుంటున్నార'ని ప్రత్యూష ఫోన్ లో వాపోయింది. వ్యభిచారం చేయమని ప్రత్యూషను రాహుల్ ఒత్తిడి చేశాడని ఆమె తరపు న్యాయవాది నీరజ్ గుప్తా ఆరోపించారు. ప్రత్యూష చివరిసారిగా రాహుల్ తో ఫోన్ లో మాట్లాడినప్పుడు 'వ్యభిచారం' అనే పదం వాడిందని తెలిపారు. అయితే ఎలాగైనా డబ్బు సంపాదించాలని ప్రత్యూషపై ఆమె తల్లిదండ్రులే ఒత్తిడి తెచ్చారని రాహుల్ అంతకుముందు చెప్పాడు. డబ్బుకోసమే ప్రత్యూష తల్లిదండ్రులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నాడు. ప్రత్యూషకు అవకాశాలు దొరకప్పుడు తానే అండగా నిలిచానని బెయిల్ పై విడుదలైన రాహుల్ చెప్పుకొచ్చాడు. ఏప్రిల్ 1న ఆంధేరిలోని అపార్ట్ మెంట్ లో ఉరేసుకుని ప్రత్యూష్ ఆత్మహత్య చేసుకుంది. -
ఐటమ్ గాళ్ సంచలన విషయాలు
ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ ఐటమ్ గాళ్ రాఖీ సావంత్ సంచలన విషయాలు వెల్లడించింది. ప్రత్యూషను రాహుల్ రాజ్ సింగ్ నిత్యం చిత్రహింసలు పెట్టేవాడని విలేకరుల సమావేశంలో చెప్పింది. ప్రత్యూషను టార్చర్ పెట్టొద్దని రాహుల్ కు చాలాసార్లు చెప్పానని తెలిపింది. ప్రత్యూష కుటుంబానికి ప్రభుత్వం రూ. 5 కోట్లు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రత్యూషను హత్య చేశారని ఆమె ఆరోపించింది. మహిళల ఆత్మహత్యల నివారణకు తనదైన శైలిలో సూచన చేసింది రాఖీ సావంత్. ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్లు నిషేధించాలని సూచించింది. సీలింగ్ ఫ్యాన్లపై నిషేధం విధించాలని మీడియా ముఖంగా ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. 'కూతుళ్లు, సోదరీమణులు, కోడళ్లు సీలింగ్ ఫ్యాన్లకు ఉరేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీటిని నిషేధించాలని ప్రధాని మోదీని కోరుతున్నా. మీ కుమార్తెలు లేదా సోదరీమణులపై ప్రేమ ఉంటే ఇళ్లలోని సీలింగ్ ఫ్యాన్లను పీకి బయటపడేయండి. టేబుల్ ఫ్యాన్లు లేదా ఏసీలు వాడండి' అని రాఖీ సావంత్ సూచించింది. కాగా, ప్రత్యూష ఆత్మహత్య కేసులో రాహుల్ పై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు.