
వాలంటైన్స్ డే రోజే భర్త రితేశ్ సింగ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చింది నటి రాఖీ సావంత్. రితేశ్ తన దగ్గర ఎన్నో విషయాలు దాచిపెట్టాడని, తనకు తెలియకుండా చాలా సంఘటనలు జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా విడాకుల విషయాన్ని ప్రకటించింది బిగ్‌బాస్ కంటెస్టెంట్. ఇటీవల ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో విడాకులకు గల కారణాన్ని విపులంగా వివరించింది రాఖీ.
'బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చాక చాలా విషయాలు తెలుసుకున్నాను. రితేశ్‌కు ఇదివరకే పెళ్లైందని, వారికి ఓ బాబు ఉన్నాడని తెలిసి నా గుండె పగిలిపోయింది. అతడు తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు కాబట్టి మా వివాహం చట్టబద్ధంగా చెల్లదు. నిజానికి మేము ఈ ఏడాది పిల్లలను కనాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ అంతలోనే ఇలా జరిగింది. మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా నేనే అతడిని ముద్దు పెట్టుకున్నాను, కానీ రితేశ్ మాత్రం కనీసం నన్ను తాకనైనా తాకలేదు. సిగ్గుపడుతున్నాడేమో అనుకున్నాను, కానీ ఇలాంటివాడనుకోలేదు. నేను ఎంతగానో ప్రేమించిన అతడు నన్ను వదిలేయడానికే సిద్ధపడ్డాడు. నన్ను ఒంటరిగా వదిలేయొద్దని అతడి కాళ్లు పట్టుకుని బతిమాలినా వినిపించుకోకుండా నా జీవితంలో నుంచి వెళ్లిపోయాడు. ఒకవేళ అతడు నాతో మళ్లీ కలిసి ఉండాలనుకుంటే మాత్రం మంచి ఇల్లు, కారు కొన్న తర్వాతే తన దగ్గరకు రావాలి' అని కండీషన్ పెట్టింది రాఖీ సావంత్.
చదవండి: Rakhi Sawant Divorce: వాలంటైన్స్‌డే రోజు బాలీవుడ్ జంట విడాకులు!
Comments
Please login to add a commentAdd a comment