Rakhi Sawant Emotional Over Sidharth Malhotra-Kiara Advani Wedding, Video Viral - Sakshi
Sakshi News home page

Rakhi Sawant: కియారా- సిద్ధార్థ్ పెళ్లిని తలుచుకుని రాఖీ సావంత్ కన్నీటి పర్యంతం

Published Sun, Feb 12 2023 8:35 PM | Last Updated on Mon, Feb 13 2023 8:55 AM

Rakhi Sawant Emotional About Kiara Advani Marriage - Sakshi

 ఇటీవలే వివాహబంధంలోకి అడుపెట్టిన కియారా అద్వాని- సిద్ధార్థ్ మల్హోత్రా జంటకు బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అభినందనలు తెలిపింది. వారిద్దరి పెళ్లి చాలా అద్భుతంగా జరిగిందని కొనియాడింది. బాలీవుడ్ ప్రేమజంట వివాహా వేడుకను తలుచుకుంటూ కన్నీటి పర్యంతమైంది. ఎవరి పెళ్లి గురించి విన్నా నా గుండెల్లో బాధ మరింత ఎక్కువవుతోందని వాపోయింది. రాఖీ ఏడుస్తున్న వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

రాఖీ మాట్లాడుతూ..' కియారా- సిద్ధార్థ్ పెళ్లి చాలా పవిత్రంగా జరిగింది. కానీ నా జీవితం మాత్రం చాలా దారుణంగా తయారైంది అంటూ ఏడ్చేసింది రాఖీ. ఎవరిదైనా పెళ్లి వార్త వింటే సంతోషంగా అనిపిస్తుంది. కానీ నాకు పెళ్లి పేరు వింటేనే ఏడుపు వచ్చేస్తోంది. నా జీవితం ఎందుకు ఇలా జరుగుతోంది.' అంటూ రోదించింది.

కాగా.. గతేడాది ఆదిల్‌ దురానీతో వివాహం చేసుకున్నట్లు ప్రకటించిన తర్వాత ఆమె జీవితం ఊహించని మలుపులు తిరిగింది. ఆమె భర్తకు మరొకరితో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. అతనిపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవలే రాఖీ సావంత్ తల్లి అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. వరుస సంఘటనలతో రాఖీ సావంత్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement