Bollywood Actress Rakhi Sawant Cries On Her Marriage Issue - Sakshi
Sakshi News home page

Rakhi Sawant: నాకే ఎందుకు ఇన్ని కష్టాలు.. రాఖీ సావంత్ కన్నీటి పర్యంతం

Published Sun, Jan 15 2023 4:02 PM | Last Updated on Sun, Jan 15 2023 4:20 PM

Bollywood Actress Rakhi Sawant Cries On Her Marriage Issue - Sakshi

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, బాలీవుడ్ నటి రాఖీసావంత్‌ ఇటీవలే ప్రియుడు అదిల్‌ ఖాన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రాఖీ- అదిల్‌ రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో లవ్‌ బర్డ్స్‌ ఇద్దరూ దండలు మార్చుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుండగా.. వారి చేతిలో మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ పట్టుకుని కనిపించారు. కానీ ఈ పెళ్లి ఫేక్ అంటూ ఆదిల్ ప్రకటన చేయడంపై రాఖీ స్పందించింది. బోరున విలపిస్తూ మీడియా ముందు తన బాధను వ్యక్తం చేసింది. 

రాఖీ సావంత్ మాట్లాడుతూ.. 'పది రోజుల్లో పోయినా నా పరువు తిరిగొస్తుందా? పెళ్లికి సంబంధించిన అన్ని ఆధారాలు నా వద్ద ఉన్నాయి. కావాలంటే మీరు కోర్టుకు వెళ్లి చెక్ చేయండి. ఈ ప్రపంచంలో నాకు ఎవరూ లేరు. ఒక మహిళ పెళ్లి చేసుకునేది ఇంటికి రావడానికే కదా. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు. నా విషయంలో సల్మాన్ జీ ఏం చేస్తారు? నేను ఆయనను ఇబ్బంది పెట్టదలచుకోలేదు. ఆదిల్ చేస్తే ఏదైనా చేయాలి. మా అమ్మ ఇప్పడిప్పుడే నడుస్తోంది.' అంటూ కన్నీటి పర్యంతమైంది రాఖీ సావంత్. 

కాగా రాఖీ సావంత్‌ గతేడాది భర్త రితేశ్‌తో విడిపోగా, అతడి నుంచి విడాకుల కోసం దరఖాస్తు చేసింది. అనంతరం మైసూర్‌కు చెందిన బిజినెస్‌మెన్‌ అదిల్‌తో ప్రేమలో పడ్డ ఆమె అతడిని ప్రియుడిగా మీడియాకు పరిచయం చేసింది. ఇటీవలే బిగ్‌బాస్‌ మరాఠీ నాలుగో సీజన్‌లో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది రాఖీ. ఇకపోతే ప్రస్తుతం రాఖీ తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. తన తల్లి బ్రెయిన్‌ ట్యూమర్‌తో పోరాడుతోందని, తను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండని అభిమానులను కోరింది రాఖీ సావంత్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement