
బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ బ్యూటీ రాఖీ సావంత్ కొద్ది నెలల క్రితం రితేశ్ సింగ్‌తో విడిపోయిన విషయం తెలిసిందే! మొదట్లో తనను బాగానే చూసుకున్న అతడు రానురానూ తనను, తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడని వాపోయింది రాఖీ. ప్రస్తుతం వ్యాపారవేత్త అదిల్ దురానీతో ప్రేమలో ఉన్న ఆమె ఒకానొక సమయంలో తన మాజీ భర్త చేసిన పనికి ఉరేసుకోవాలనిపించిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ బీటౌన్‌లో వైరల్‌గా మారింది.
అందులో రాఖీ మాట్లాడుతూ.. తాను బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తన తల్లి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉంటే రితేశ్ కనీసం ఆమెను పట్టించుకోలేదని, హాస్పిటల్ బిల్లులు కూడా కట్టలేదని చెప్పుకొచ్చింది. అతడి ప్రవర్తనతో ఆ సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని ఉరేసుకుని చనిపోదామనిపించిందని తెలిపింది. తన చావుకు కారణం మాజీ భర్త రితేశ్ కారణం అని చావుకు ముందు సెల్ఫీ వీడియో తీసుకోవాలనుకున్నానని పేర్కొంది. తన మనసును ఎంతగానో గాయపర్చిన అతడిని ఎప్పటికీ క్షమించబోనని అంటోంది రాఖీ సావంత్.
చదవండి: మావాడికి నేను ఎక్స్‌పోజింగ్ చేస్తే నచ్చట్లే, అందుకే ఇలా..
Comments
Please login to add a commentAdd a comment