Rakhi Sawant Shocking Allegations Against Adil Durrani - Sakshi
Sakshi News home page

Rakhi Sawant: ప్రియురాలిపై ఆరునెలల పాటు.. రాఖీసావంత్ షాకింగ్ కామెంట్స్!

Published Tue, Aug 22 2023 7:20 PM | Last Updated on Wed, Sep 6 2023 10:10 AM

Rakhi Sawant Shocking Allegations Against Adil Durrani - Sakshi

బాలీవుడ్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ రాఖీ సావంత్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న రాఖీ.. తన మాజీభర్త ఆదిల్ ఖాన్ దురానీపై సంచలన కామెంట్స్ చేసింది. ఇరాన్‌కు చెందిన తన ప్రియురాలిని అత్యాచారం చేసినందుకే ఆదిల్ జైలు జీవితం గడిపాడని తెలిపింది. అంతేకాకుండా ఐదు రోజుల పాటు తీవ్రంగా కొట్టి, హింసించాడని వాపోయింది. ఇటీవలే జైలు నుంచి బయటకొచ్చిన ఆదిల్.. రాఖీ సావంత్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనపై అత్యాచారం కేసు పెట్టేందుకు రాఖీ రూ.3 లక్షలు ఖర్చు చేసిందని ఆదిల్ ఆరోపించాడు. ఈ నేపథ్యంలోనే రాఖీ సావంత్ మీడియాతో మాట్లాడింది. 

(ఇది చదవండి: అతనితో డేటింగ్.. కాబోయే భర్త గురించి లైగర్ భామ ఆసక్తికర కామెంట్స్!)

పురుషులతో కూడా...

రాఖీ సావంత్ మాట్లాడుతూ..'ఆదిల్ తన ఇరానీ గర్ల్‌ఫ్రెండ్‌ను లైంగికంగా, మానసికంగా వేధించాడు. నన్ను కూడా కొట్టి.. తీవ్రంగా హింసించాడు. ఆదిల్ మహిళలతో పాటు పురుషులను కూడా లైంగికంగా వాడుకోవడం చూశా. దుబాయ్‌లో నన్ను చంపడానికి ప్రయత్నించాడు. దురానీ అత్యంత దుర్మార్గుడు. అతనిపై కేసు పెట్టేందుకు నేను ఎవరికీ రూ.3 లక్షలు ఇవ్వలేదు.  తాను ఇరానీ గర్ల్ ఫ్రెండ్‌తో దాదాపు 5 ఏళ్లపాటు రిలేషన్‌లో ఉన్నాడు.  ఆమెపై ఆరు నెలల పాటు అత్యాచారం చేశాడు. నన్ను పెళ్లి చేసుకున్న విషయం కూడా ఆమెకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. ఆమెకు, నాకు పచ్చి అబద్దాలు చెప్పి మోసం చేశాడు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు." అంటూ ఏడుస్తూ వాపోయింది.  

ఆదిల్ ఫేమస్ అవ్వాలని, ఏక్తా కపూర్ టీవీ షోలలో భాగం కావాలని ప్రయత్నించాడని రాఖీ చెప్పింది. మీడియా దృష్టిని ఆకర్షించడానికే తన పేరును ఉపయోగించుకున్నాడని ఆమె పేర్కొంది. కాగా.. గతంలో ఆదిల్‌తో రాఖీ వివాహ వివాదానికి దారితీసింది. మార్చి 2023లో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఆ తర్వాత ఆదిల్ తనను మభ్యపెట్టి రూ. 1.5 కోట్లు తీసుకున్నాడని ఆరోపించింది. అంతే కాకుండా అతనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.  గతంలోఆదిల్ తన నగ్న వీడియోలను రికార్డు చేసి అపరిచితులకు అమ్మేకునేవాడని తెలిపింది.  అయితే రాఖీ ఆరోపణలన్నింటినీ ఆదిల్‌ ఖండించాడు. 

(ఇది చదవండి: 'అశ్లీల వీడియోలు తీసి వేధించింది'.. హీరోయిన్‌పై సంచలన కామెంట్స్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement