
తనుశ్రీ దత్తా - రాఖీ సావంత్
నటుడు నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమానికి బీజం వేశారు తనుశ్రీ దత్తా. ఈ వివాదంలో సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్లు తనుశ్రీ దత్తాకి మద్దతు తెలపగా.. రాఖీ సావంత్ మాత్రం తనుశ్రీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ‘తనుశ్రీ పదేళ్ల నుంచి కోమాలో ఉంది.. ఆమెకి పిచ్చి పట్టిందం’టూ రాఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇంతటితో ఊరకోక ఈ మధ్య జరిగిన ఓ మీడియా సమావేశంలో రాఖీ మాట్లాడుతూ.. తనుశ్రీ డ్రగ్స్ తీసుకుంటుందని, రేవ్ పార్టీకి తీసుకెళ్లి పలుమార్లు తనపై అత్యాచారం చేసిందని.. తనుశ్రీ ఓ లెస్బియన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఇప్పటికే రాఖీ సావంత్ మీద 10 కోట్లకు పరువు నష్టం దావా వేసిన తనుశ్రీ దత్తా ఈ వ్యాఖ్యల పట్ల తీవ్రంగా స్పందించారు. తనను లెస్బియన్ అంటూ చేసిన ఆరోపణ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తనుశ్రీ స్పందిస్తూ.. ‘రాఖీ సావంత్ చేసే ఆరోపణలకు నేను భయపడను. నాపై కావాలని ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. నేను డ్రగ్స్ తీసుకోను. నాకు డ్రింక్ చేసే అలవాటు లేదు. కనీసం స్మోకింగ్ అలవాటు కూడా లేదు. నేను లెస్బియన్ని కానే కాదు. మహిళలకు మంచి జరిగే ఉద్యమాన్ని నీరుగార్చేందుకు రాఖీ సావంత్ ఇలాంటి నీతి మాలిన వ్యాఖ్యలు చేస్తోంది. ఆమె వేసే జోకర్ వేషాలకు.. ఆమె నవ్వుల పాలవ్వడమే కాక చివరకు ఆమె బలవుతుంద’ని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment