'నాకిప్పుడు పోర్న్ స్టార్ అవ్వాలని ఉంది' | 'I want to become a porn star now!' Rakhi Sawant gets her claws out in ANOTHER dig at former adult star Sunny Leone | Sakshi

'నాకిప్పుడు పోర్న్ స్టార్ అవ్వాలని ఉంది'

Feb 11 2016 6:07 PM | Updated on Aug 20 2018 6:18 PM

'నాకిప్పుడు పోర్న్ స్టార్ అవ్వాలని ఉంది' - Sakshi

'నాకిప్పుడు పోర్న్ స్టార్ అవ్వాలని ఉంది'

సినిమాలతోకన్నా వివాదాలతోనే ఎప్పుడూ వార్తల్లో ఉండే బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ మరోసారి రెచ్చిపోయింది. చాలాకాలం నుంచి సన్నీ లియోన్పై నోటికొచ్చిన కామెంట్ చేస్తూ తన అక్కసు వెళ్లగక్కుతున్న రాఖీ ఈసారి కూడా అవకాశాన్ని వదులుకోలేదు.

సినిమాలతోకన్నా వివాదాలతోనే ఎప్పుడూ వార్తల్లో ఉండే బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ మరోసారి రెచ్చిపోయింది. చాలాకాలం నుంచి సన్నీ లియోన్పై నోటికొచ్చిన కామెంట్ చేస్తూ తన అక్కసు వెళ్లగక్కుతున్న రాఖీ ఈసారి కూడా అవకాశాన్ని వదులుకోలేదు. ఇటీవలే ఓ టీవీ ఇంటర్వ్యూలో యాంకర్ నుంచి సన్నీ అభ్యంతరకర ప్రశ్నలు ఎదుర్కొన్న సమయంలో ఆమె ప్రవర్తించిన తీరుపై బాలీవుడ్లోని పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలతోపాటు మద్దతు లభించిన విషయం తెలిసిందే. ఆమీర్ ఖాన్ కూడా సన్నీతో నటించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు.

అయితే తాజాగా బుధవారం ముంబైలో ఓ  కార్యక్రమంలో పాల్గొన్న రాఖీ సావంత్ను ఇంటర్యూ చేస్తున్న విలేకరులు.. సన్నీకి ఆమీర్ ఇచ్చిన మద్దతుపై స్పందన తెలియజేయమని అడగ్గా వెంటనే రాఖీ.. 'ఈ రోజు మీ అందరికీ నేనొక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను, రాఖీ సావంత్ త్వరలోనే పోర్న్ స్టార్ కానుంది. అవును.. నేనిప్పుడు పోర్న్ స్టార్ అవ్వాలనుకుంటున్నాను ' అంటూ విలేకరులనే కాదు అక్కడున్న అతిధులను సైతం అవాక్కయ్యేలా చేసింది. గత ఏడాది ఇలాంటి ఓ ఇంటర్వ్యూలోనే రాఖీ మాట్లాడుతూ.. ఓ పోర్న్ స్టార్ తో పోటీ పడేందుకు నేనెప్పటికీ పోర్న్ స్టార్ గా మారనంటూ వ్యాఖ్యానించింది. ఏదేమైనా సన్నీ నుంచి రాఖీ రసవత్తరమైన పోటీ ఎదుర్కొంటుందనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement