రాజ్ థాకరేకు రాఖీ సవాల్
ముంబై: బాలీవుడ్ నటి రాఖీ సావంత్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. ఆ పార్టీ జాతీయ మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. తాను ఎవరికీ భయపడే ప్రసక్తేలేదని రాఖీ అన్నారు. అవసరమైతే త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్ థాకరేపై పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే ఇటీవల ప్రకటించారు. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. శివసేన ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంది. ఆర్పీఐ కూడా బీజేపీ, శివసేనకు మద్దతు ఇస్తోంది. ఎంఎన్ఎస్ ఒంటరిగా పోటీ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో రాఖీ ఆర్పీఐ చేరడాన్ని ఆ పార్టీ చీఫ్ రామదాస్ అతవాలే స్వాగతించారు. కాగా ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాఖీ రాషీయ ఆమ్ పార్టీని స్థాపించింది. అయితే ముంబై వాయవ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాఖీ కేవలం 1,995 ఓట్లు సాధించింది.