
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా రాఖీ పెళ్లి కూతురిలా ముస్తాబైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రాఖీ సావంత్, ఓ ఎన్నారైని సీక్రెట్ గా వివాహం చేసుకున్నారని, ఈ నెల 28న వీరి పెళ్లి వేడుక అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిందంటూ వార్తలు వచ్చాయి.
అయితే రూమర్స్‌పై స్పందించిన రాఖీ సావంత్.. తానింకి సింగిల్‌గానే ఉన్నానని చెప్పారు. అంతేకాదు ప్రస్తుతం తాను ఎవరితో రిలేషన్‌లో కూడా లేనని వెల్లడించారు. ఓ ఫైవ్ స్టార్ హోటల్ ప్రమోషన్ కోసం తాను చేసిన బ్రైడల్ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయని క్లారిటీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment