Rakhi Sawant Removes Ex-Husband Ritesh Tattoo, Shares Painful Video - Sakshi
Sakshi News home page

Rakhi Sawant: నా జిందగీలో నుంచే కాదు, నా బాడీలో నుంచి కూడా తరిమేశా

Published Sat, Apr 30 2022 8:41 AM | Last Updated on Sat, Apr 30 2022 10:00 AM

Rakhi Sawant Removes Ritesh Tattoo - Sakshi

తీసేటప్పుడు నొప్పి పెడుతున్నా దాన్ని పంటికింద భరించింది. మూడేళ్ల జర్నీ.. రితేష్‌, నువ్వు నా జిందగీలో నుంచే కాదు, నా శరరీంలో నుంచి కూడా శాశ్వతంగా వెళ్లిపోయినట్లే..

బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌ తన భర్త రితేశ్‌ సింగ్‌తో విడిపోయిన విషయం తెలిసిందే. రితేశ్‌కు ఆల్‌రెడీ పెళ్లైన విషయాన్ని తన దగ్గర దాచిపెట్టాడని, వారు విడాకులు తీసుకోలేదు కాబట్టి చట్టబద్ధంగా తమ వివాహం చెల్లదని బాధపడింది. అటు రితేశ్‌ కూడా మొదటి భార్యతో ఉండేందుకే సిద్ధపడి రాఖీని నిర్లక్ష్యం చేయడంతో వాలంటైన్స్‌డే రోజు అతడితో విడిపోతున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించింది రాఖీ సావంత్‌. 

మాజీ భర్త జ్ఞాపకాలను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్న రాఖీ తాజాగా తన ఒంటిపై ఉన్న రితేశ్‌ అనే టాటూను కూడా తీసేయించుకుంది. పచ్చబొట్టును తీసేటప్పుడు నొప్పి పెడుతున్నా దాన్ని పంటికింద భరించింది. 'మూడేళ్ల జర్నీ.. రితేష్‌, నువ్వు నా జిందగీలో నుంచే కాదు, నా శరరీంలో నుంచి కూడా శాశ్వతంగా వెళ్లిపోయినట్లే.. మీరు పీకల్లోతు ప్రేమలో మునిగితే ఇలా పచ్చబొట్టు వేయించుకోకండి.. ఎందుకంటే దాన్ని తీసేయడం చాలా కష్టం' అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

చదవండి: యాంకర్‌ సుమతో నటించడం నా అదృష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement