![రాఖీ సావంత్ కి నోటీసులు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/41396389911_625x300_0.jpg.webp?itok=INjZBEEp)
రాఖీ సావంత్ కి నోటీసులు
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల వ్యయవివరాలను అందజేయని ఆరుగురికి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడై ఆరు నెలలు కావస్తున్నప్పటికీ నగర శివారు ప్రాంతానికి చెందిన ఆరుగురు అభ్యర్థులు ఇంతవరకు కలెక్టర్ కార్యాలయానికి ఖర్చుల వివరాలను అందజేయలేదు.
నిబంధనల ప్రకారం ఫలితాలు వెల్లడైన నెలలోగా ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలను అందజేయాల్సి ఉంటుంది. ఏ రోజు ఖర్చుల వివరాలను అదే రోజు రాసి సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లలో అందజేయాల్సి ఉంటుంది. అయితే ఓటమిపాలైన ఆరుగురు అభ్యర్థులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కాగా ఈసీ నోటీసు జారీ చేసిన జాబితాలో సినీనటుడు హేమంత్ బిర్జే, నటి రాఖీ సావంత్ కూడా ఉన్నారు.