కండోమ్‌ బ్యాన్‌.. ఎయిడ్స్‌తో పోతావ్‌! | Actress Rakhi Sawant Abuses TV Actress Mahika | Sakshi
Sakshi News home page

Jun 28 2018 8:29 AM | Updated on Oct 2 2018 6:54 PM

Actress Rakhi Sawant Abuses TV Actress Mahika - Sakshi

నటి మహికా శర్మ

నటీమణుల మధ్య సరదాగా మొదలైన సంభాషణ కాస్త.. దుర్భాషలాడుకునే దాకా వెళ్లింది. కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే నటి రాఖీ సావంత్‌.. మరోసారి నోటిదురుసును ప్రదర్శించారు. ఎలాంటి విషయాన్ని అయినా సరే ఓపెన్‌గా మాట్లాడే రాఖీకి ఓ సీరియల్‌ నటి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. దీంతో రాఖీ ఇన్‌స్టాగ్రామ్‌లో బండబూతులు తిడుతూ వరుస పోస్టులు చేశారు. 

మహారాష్ట్రలో ప్లాస్టిక్‌ బ్యాన్‌ను ఉద్దేశిస్తూ సీరియల్‌ నటి మహికా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ముందుగా సరదాగా ఓ పోస్ట్‌ చేసిన ఆమె తర్వాత అసలు వ్యవహారం మొదలుపెట్టారు. ‘సోదరి.. ప్లాస్టిక్‌ బ్యాన్‌ గురించి కాస్త పరిజ్ఞానం నాకు పంచుతావా? కండోమ్‌లు కూడా బ్యాన్‌ అయ్యాయా?’ అంటూ ఓ సందేశం ఉంచారు. అంతే అది చూసిన రాఖీకి ఎక్కడో కాలింది. వెంటనే పచ్చి బూతులు తిడుతూ (వీడియో సందేశాలు కూడా) వరుసగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు రాఖీ ఉంచారు. ‘కండోమ్‌ల గురించి నాకు అవగాహన ఉంది. అవి రబ్బర్‌తో కాకుండా ప్లాస్టిక్‌తోనే తయారు చేస్తారు. ఒకవేళ కండోమ్‌లు బ్యాన్‌ చేస్తే మాత్రం మహికా లాంటి వాళ్లు ఎయిడ్స్‌ వచ్చి పోతారు’ అంటూ పోస్టులు చేశారు. ఆవెంటనే మహికా దానికి ఘాటుగానే సమాధానిమిచ్చారు. ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

                                      నటి రాఖీ సావంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement