condoms usage
-
కండోమ్ కొనేందుకు సిగ్గు.. విస్తరిస్తున్న హెచ్ఐవీ
సాక్షి, హైదరాబాద్: హెచ్ఐవీ చాపకింది నీరులా విస్తరిస్తోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ.. అత్యధిక కేసులు నమోదవుతున్న జాబితాలో గ్రేటర్ టాప్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ కుటుంబ నియంత్రణ సంస్థ తాజా లెక్కల ప్రకారం కండోమ్‌ల వినియోగంలో జాతీయ సగటు 5.2 శాతం ఉండగా, రాష్ట్రంలో 0.5 శాతమే ఉండటమే ఇందుకు కారణం. అక్షరాస్యతలోనే కాదు.. ఆరోగ్యపరమైన అంశాల్లోనూ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడి వారిలో అవగాహన కొంత ఎక్కువే. కానీ సురక్షిత శృంగారంపై మాత్రం అవగాహన తక్కువ. కండోమ్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే హెచ్‌ఐవీనే కాదు హెపటైటీస్–బి, సి, గనేరియా, సిఫిలిస్ వంటి వ్యాధుల బారినపడుతున్నారు. అంతేకాదు చాలామందికి హెచ్ఐవీ ఉన్నా.. బయటికు చెప్పడం లేదు. బంధువులకు తెలుస్తుందనే భయంతో చికిత్సకు దూరంగా ఉంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా ఇతరులతో శృంగారంలో పాల్గొంటున్నారు. వీరు చూసేందుకు అందంగా ఉన్నారు.. కదా! అని భావించి చాలా మంది ఏమీ ఆలోచించకుండా వీరితో అనైతిక సంబంధాలు కొనసాగిస్తున్నారు. రక్షణ కోసం కనీసం కండోమ్‌లను కూడా వాడటం లేదు. ప్రస్తుతం హెచ్ఐవీ కేసుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఓ కారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అవగాహన ఉన్నా.. జాతీయ కుటుంబ నియంత్రణ సంస్థ తాజా లెక్కల ప్రకారం ఫ్యామిలీ ప్లానింగ్‌పై అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 86.3 శాతం మందికి అవగాహన ఉంది. కానీ కండోమ్‌ల వినియోగం మాత్రం 0.2 శాతమే. ఇక పాండిచ్చేరిలో 79.9 శాతం మందికి కుటుంబ నియంత్రణపై చైతన్యం ఉండగా, 0.8 శాతం మందే కండోమ్ వాడుతున్నారు. గోవాలో 77.4 శాతం మందికి అవగాహన ఉండగా, వీరిలో 7.1 శాతం మంది కండోమ్‌లను వినియోగిస్తున్నారు. హర్యానాలో 71.6 శాతం మందికి అవగాహన ఉన్నప్పటికీ.. 12 శాతం మంది కండోమ్‌లను వినియోగిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో 65.3 శాతం మందికి అవగాహన ఉండగా, ఇక్కడ అత్యధికంగా 16.1 శాతం మంది కండోమ్‌లను వినియోగిస్తున్నారు. తమిళనాడులో 64.7 శాతం మందికి అవగాహన ఉండగా, 0.8 శాతం మంది మాత్రమే కండోమ్ వాడుతున్నారు. సిక్కింలో 62.7 శాతం మందికి చైతన్యం కలిగి ఉండగా, వీరిలో 5.2 శాతం మందే కండోమ్‌లను వాడుతున్నట్లు తేలింది. త్రిపురలో 57.6 శాతం మందికి అవగాహన ఉండగా, వీరిలో 1.9 శాతం మంది కండోమ్ వాడుతున్నారు. ఇక తెలంగాణలో 67 శాతం మందికి పరిజ్ఞానం కలిగి ఉండగా, వీరిలో 0.5 శాతం మందే కండోమ్ వాడుతున్నట్లు స్పష్టమైంది. నిర్లక్ష్యం వల్లే హెచ్ఐవీ.. అపరిచిత వ్యక్తులతో సెక్స్‌లో పాల్గొనడం వల్ల హెచ్ఐవీ సోకుతుంది. ·గర్భిణి నుంచి పుట్టబోయే బిడ్డకు సోకే అవకాశం ఐదు శాతం ఉంది. ఎయిడ్స్‌కు స్వలింగ సంపర్కం కూడా ఒక కారణం. కలుషిత రక్తాన్ని ఇతరులకు ఎక్కించడం వల్ల కూడా సోకుతుంది. ఒకరికి వాడిన సిరంజ్‌లు, బ్లేడ్స్ మరొకరికి వాడటం వల్ల వస్తుంది. నిరంతరం జ్వరం, నీళ్ల విరేచనాలు, అకారణంగా బక్కచిక్కడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. గొంతువాపు, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. - డాక్టర్ ప్రసన్నకుమారి, ఎయిడ్స్ కంట్రోల్ విభాగం అధికారిణి -
కండోమ్ బ్యాన్.. ఎయిడ్స్‌తో పోతావ్!
నటీమణుల మధ్య సరదాగా మొదలైన సంభాషణ కాస్త.. దుర్భాషలాడుకునే దాకా వెళ్లింది. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటి రాఖీ సావంత్.. మరోసారి నోటిదురుసును ప్రదర్శించారు. ఎలాంటి విషయాన్ని అయినా సరే ఓపెన్‌గా మాట్లాడే రాఖీకి ఓ సీరియల్ నటి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. దీంతో రాఖీ ఇన్‌స్టాగ్రామ్‌లో బండబూతులు తిడుతూ వరుస పోస్టులు చేశారు. మహారాష్ట్రలో ప్లాస్టిక్ బ్యాన్‌ను ఉద్దేశిస్తూ సీరియల్ నటి మహికా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ముందుగా సరదాగా ఓ పోస్ట్ చేసిన ఆమె తర్వాత అసలు వ్యవహారం మొదలుపెట్టారు. ‘సోదరి.. ప్లాస్టిక్ బ్యాన్ గురించి కాస్త పరిజ్ఞానం నాకు పంచుతావా? కండోమ్‌లు కూడా బ్యాన్ అయ్యాయా?’ అంటూ ఓ సందేశం ఉంచారు. అంతే అది చూసిన రాఖీకి ఎక్కడో కాలింది. వెంటనే పచ్చి బూతులు తిడుతూ (వీడియో సందేశాలు కూడా) వరుసగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు రాఖీ ఉంచారు. ‘కండోమ్‌ల గురించి నాకు అవగాహన ఉంది. అవి రబ్బర్‌తో కాకుండా ప్లాస్టిక్‌తోనే తయారు చేస్తారు. ఒకవేళ కండోమ్‌లు బ్యాన్ చేస్తే మాత్రం మహికా లాంటి వాళ్లు ఎయిడ్స్ వచ్చి పోతారు’ అంటూ పోస్టులు చేశారు. ఆవెంటనే మహికా దానికి ఘాటుగానే సమాధానిమిచ్చారు. ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. నటి రాఖీ సావంత్ -
పెళ్లికాని యువతులు.. పెరిగిన కండోమ్‌ల వాడకం
న్యూఢిల్లీ : గర్భనిరోధక పద్ధతులపై పెళ్లికాని యువతులు ఇప్పుడిప్పుడే అవగాహనకు వస్తున్నారని, వారిలో కండోమ్ వాడకం పెరిగిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్) లో వెల్లడైంది. గడిచిన దశాబ్ధకాలంలో పెళ్లికాని (15 నుంచి 45 ఏళ్ల వయసున్న)మహిళల్లో కండోమ్‌ల వాడకం 2 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది. ప్రధానంగా 20-24 ఏళ్ల వయసున్న యువతులే అత్యధికంగా రక్షణాత్మక పద్ధతులను పాటిస్తున్నట్లు తేలింది. మొత్తంగా భారత్‌లో గర్భనిరోధక రేటు 54 శాతంగా ఉందని జాతీయ సర్వే తెలిపింది. పెళ్లైన మహిళల్లో అత్యధికులు ఇప్పటికీ పాత పద్ధతులనే పాటిస్తున్నారని, కేవలం ఒక్క శాతం మహిళలు మాత్రమే కాంట్రసెప్టివ్ పిల్స్ లాంటి అధునిక గర్భనిరోధక పద్ధతులను పాటిస్తున్నారని సర్వేలో పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్(ఐఐపీఎస్), భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్)ను నిర్వహించారు. 1992 నుంచి 2016 వరకు నాలుగు సార్లు సర్వేను చేపట్టారు. కుటుంబ ఆరోగ్య సర్వే ముఖ్యాంశాలు కొన్ని.. ⇒99శాతం మంది పెళ్లైన మహిళలు ఏదో ఒక పద్ధతిలో ఫ్యామిలీ ప్లానింగ్‌ను పాటిస్తున్నారు. ⇒కేవలం 1 శాతం మంది మాత్రమే పిల్స్‌ను వినియోగిస్తున్నారు. ⇒పెళ్లికాని మహిళల్లో 34 శాతం మంది గర్భనిరోధక పద్ధతులు పాటిస్తున్నారు. ⇒ప్రతి ఎనిమిది మంది పురుషుల్లో ముగ్గురు.. గర్భనిరోధం అనేది మహిళలకు సంబంధించిన వ్యవహారంగా భావిస్తున్నారు. ⇒గర్భనిరోధక పద్ధతులు పాటించడంలో పంజాబ్ మహిళలదే పైచేయి. ఆ రాష్ట్రంలో 76 శాతం మంది ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారు. ⇒మణిపూర్, బిహార్, మేఘాలయా రాష్ట్రాల్లో అత్యల్పస్థాయిలో 24 శాతం మంది మహిళలు మాత్రమే గర్భనిరోధక పద్ధతులను అనుసరిస్తున్నారు. ⇒కండోమ్‌ను సరిగ్గా వాడితే గర్భ నిరోధం సాధ్యమవుతుందని 61 శాతం మంది పురుషులు నమ్ముతున్నారు. ⇒సిక్కు, బౌద్ధ మహిళల్లో గర్భనిరోధక సాధనాలు వాడేవారి శాతం 65గా ఉంటే, ముస్లిం మహిళల్లో అది 38 శాతం మాత్రమే ఉందని సర్వేలో తేలింది. ⇒అల్పాదాయ వర్గాల్లో 36 శాతం, అధికాదాయ వర్గాల్లో 53 శాతం మంది ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారు. ⇒59 శాతం మంది మహిళలు టీవీల్లో వచ్చే ప్రకటనల ద్వారా గర్భనిరోధానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. -
కండోమ్‌లు ఓకే.. గర్భస్రావం వద్దు!
జికా వైరస్ వస్తుందన్న భయం ఉన్న మహిళలు కావాలంటే కండోమ్‌ల లాంటి కృత్రిమ గర్భనిరోధక పద్ధతులు వాడొచ్చు గానీ, ఆ పేరు చెప్పి గర్భస్రావానికి వెళ్లడం మాత్రం సరికాదని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి గర్భస్రావం ఒక్కటే మార్గం అనడాన్ని ఆయన నిర్మొహమాటంగా ఖండించారు. 1960 ప్రాంతాల్లో బెల్జియన్ కాంగో ప్రాంతంలో కొంతమంది నన్లపై పదేపదే అత్యాచారాలు జరిగేవని, వాళ్లు గర్భం ధరించకుండా ఉండేందుకు కృత్రిమ గర్భనిరోధ పద్ధతులు పాటించాల్సిందిగా అప్పట్లో పోప్ పాల్ -6 చెప్పిన విషయాన్ని పోప్ ఫ్రాన్సిస్ గుర్తుచేశారు. అబార్షన్లు మానవాళికే మంచివి కావని, అయితే గర్భం రాకుండా ఆపడం మాత్రం తప్పు కాదని ఆయన చెప్పారు. జికా లాంటి సందర్భాలలో అయితే పోప్ పాల్ 6 సూచించిన మార్గాన్ని అనుసరించడం మంచిదని తెలిపారు. గర్భిణులకు ఎక్కువగా సోకుతున్న జికా వైరస్ కారణంగా పుట్టబోయే శిశువులకు కూడా లోపాలు ఉంటున్నాయన్న కారణంగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్వవ్యాప్త ఆరోగ్య ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు.