mahika
-
హీరోయిన్స్‌ను హై ప్రొఫైల్ వేశ్యలుగానే చూస్తారు :నటి
Mahika Sharma On Casting Couch : హాలీవుడ్ నుంచి మొదలు టాలీవుడ్ వరకు సినీ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా క్యాస్టింగ్ కౌచ్, మీటూ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ మహిళలకు లైంగిక వేధింపులు తప్పవని.. ఆయా నిర్మాతలు, దర్శకులతో మానసికంగా ఇబ్బంది పెట్టారని పలువురు తారలు బహిరంగా వ్యాఖ్యలు చేశారు. నటి మహికా శర్మ ఈ విషయంపై మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఎంటర్టైన్మెంట్ రంగంలో హీరోయిన్స్‌ను ఎప్పుడూ లైంగిక వస్తువులుగానే చూస్తారు. కొందరు బలవంతం చేస్తే మరికొందరు అవకాశాల ఆశ చూపి లోబర్చుకుంటారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఏదో ఒకటి త్యాగం చేయాల్సిందే అని నాతో చాలామంది చెప్పారు. వాళ్లు చెప్పినదానికి ఒప్పుకోకపోతే అవకాశాలు రావు. ఇక జీవితాంతం కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలని వచ్చిన చాలామంది హీరోయిన్లు కాస్టింగ్ డైరెక్టర్ లేదా నిర్మాతలకు బలవుతుంటారు. వాళ్లు అమ్మాయిలను కేవలం లైంగిక వస్తువులుగానే చూస్తారు. ఇక ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన అమ్మాయిల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. సొసైటీ కూడా సినీ ఇండస్ట్రీని చూసే విధానం వేరుగా ఉంటుంది. హీరోయిన్స్ అంటే హై ప్రొఫైల్ ఉన్న వేశ్యలుగానే చూస్తారు. క్రేజ్ తప్ప గౌరవం ఉండదు. ఇది చాలా దారుణమైన విషయం' అంటూ సినీ ఇండస్ట్రీలో వేధింపుల గురించి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మోడల్‌గా కెరీర్ ఆరంభించిన మహికా పలు బాలీవుడ్ చిత్రాల్లో మెరిసింది. బుల్లితెరపై రామాయణ, ఎఫ్.ఐ.ఆర్ వంటి సీరియల్స్‌తో గుర్తింపు పొందింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్న రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసుపై స్పందిస్తూ.. 'శిల్పాశెట్టిని మేము ఇన్స్పిరేషన్గా తీసుకుంటాము. అలాంటిది పోర్నోగ్రఫీ కేసులో ఆమె భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్ కావడం చూస్తుంటే గుండె బద్దలవుతోంది' అని పేర్కొంది. -
కండోమ్ బ్యాన్.. ఎయిడ్స్‌తో పోతావ్!
నటీమణుల మధ్య సరదాగా మొదలైన సంభాషణ కాస్త.. దుర్భాషలాడుకునే దాకా వెళ్లింది. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటి రాఖీ సావంత్.. మరోసారి నోటిదురుసును ప్రదర్శించారు. ఎలాంటి విషయాన్ని అయినా సరే ఓపెన్‌గా మాట్లాడే రాఖీకి ఓ సీరియల్ నటి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. దీంతో రాఖీ ఇన్‌స్టాగ్రామ్‌లో బండబూతులు తిడుతూ వరుస పోస్టులు చేశారు. మహారాష్ట్రలో ప్లాస్టిక్ బ్యాన్‌ను ఉద్దేశిస్తూ సీరియల్ నటి మహికా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ముందుగా సరదాగా ఓ పోస్ట్ చేసిన ఆమె తర్వాత అసలు వ్యవహారం మొదలుపెట్టారు. ‘సోదరి.. ప్లాస్టిక్ బ్యాన్ గురించి కాస్త పరిజ్ఞానం నాకు పంచుతావా? కండోమ్‌లు కూడా బ్యాన్ అయ్యాయా?’ అంటూ ఓ సందేశం ఉంచారు. అంతే అది చూసిన రాఖీకి ఎక్కడో కాలింది. వెంటనే పచ్చి బూతులు తిడుతూ (వీడియో సందేశాలు కూడా) వరుసగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు రాఖీ ఉంచారు. ‘కండోమ్‌ల గురించి నాకు అవగాహన ఉంది. అవి రబ్బర్‌తో కాకుండా ప్లాస్టిక్‌తోనే తయారు చేస్తారు. ఒకవేళ కండోమ్‌లు బ్యాన్ చేస్తే మాత్రం మహికా లాంటి వాళ్లు ఎయిడ్స్ వచ్చి పోతారు’ అంటూ పోస్టులు చేశారు. ఆవెంటనే మహికా దానికి ఘాటుగానే సమాధానిమిచ్చారు. ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. నటి రాఖీ సావంత్ -
కన్నకూతురిని 17సార్లు పొడిచి చంపింది
జైపూర్: మగబిడ్డలేడని కన్నకూతురిని ఓ కసాయి తల్లి పొడిచి చంపిన దారుణ సంఘటన నగరంలో చోటుచేసుకుంది. మగబిడ్డ కావాలనే కోరికతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిందితురాలు ఒప్పుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 26వ తేదీన నాలుగు నెలలు వయసున్న తన కూతురు మహిక కనిపించడం లేదంటూ నేహా గోయల్(35), కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ మేరకు మహిక కనిపించకుండాపోయిన ఇంట్లోని గదులను పరిశీలించినట్లు తెలిపారు. వాడకంలో లేని ఎయిర్ కండిషనర్ లో బిడ్డ మృతదేహాన్ని గుర్తించినట్లు వివరించారు. బిడ్డ శరీరంపై 17 కత్తిపోట్లు ఉన్నాయని, గొంతును కూడా కత్తితో కోసిన ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. కొన్నాళ్లుగా మగబిడ్డ కోసం నేహా పూజలు చేస్తున్నట్లు విచారణలో తెలిసిందని చెప్పారు. మగబిడ్డ కోసం ఐవీఎఫ్, సరోగసి విధానాలను అవలంబించేందుకు కూడా ఆమె ప్రయత్నించిందని తెలిపారు. దీంతో ఇంటి వ్యక్తులే మహికను చంపారని భావించినట్లు చెప్పారు. పాప మృతదేహం ఇంట్లోనే ఉండటంతో.. వెంటనే అనుమానం వచ్చిన అధికారులు ఆ మృతదేహం ఉన్న గదితో పాటు నేహాగోయల్ బెడ్రూం, బాత్రూంలను లాక్ చేశారు. అక్కడ ప్రతి అంగుళం క్షుణ్ణంగా గాలించారు. పాప మృతదేహం మీద ఉన్న రక్త నమూనాలు, బాత్రూంలో అప్పటికే శుభ్రం చేసినా.. అక్కడక్కడ మిగిలిన రక్త నమూనాలు తీసుకున్నారు. తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరి రక్త నమూనాలు కూడా సేకరించారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపగా, నేహ రక్త నమూనాలతో హత్యాస్థలంలో దొరికిన రక్తనమూనాలు సరిపోయాయి. దాంతో నేహను గట్టిగా ప్రశ్నించగా.. ఆమె తాను చేసిన ఘోరాన్ని అంగీకరించింది. నిందితురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.