కన్నకూతురిని 17సార్లు పొడిచి చంపింది | Obsessed About Having Son, Jaipur Mother Stabbed Baby Girl 17 Times | Sakshi
Sakshi News home page

కన్నకూతురిని 17సార్లు పొడిచి చంపింది

Published Fri, Sep 9 2016 5:28 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

కన్నకూతురిని 17సార్లు పొడిచి చంపింది

కన్నకూతురిని 17సార్లు పొడిచి చంపింది

జైపూర్: మగబిడ్డలేడని కన్నకూతురిని ఓ కసాయి తల్లి పొడిచి చంపిన దారుణ సంఘటన నగరంలో చోటుచేసుకుంది. మగబిడ్డ కావాలనే కోరికతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిందితురాలు ఒప్పుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 26వ తేదీన నాలుగు నెలలు వయసున్న తన కూతురు మహిక కనిపించడం లేదంటూ నేహా గోయల్(35), కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

ఈ మేరకు మహిక కనిపించకుండాపోయిన ఇంట్లోని గదులను పరిశీలించినట్లు తెలిపారు. వాడకంలో లేని ఎయిర్ కండిషనర్ లో బిడ్డ మృతదేహాన్ని గుర్తించినట్లు వివరించారు. బిడ్డ శరీరంపై 17 కత్తిపోట్లు ఉన్నాయని, గొంతును కూడా కత్తితో కోసిన ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. కొన్నాళ్లుగా మగబిడ్డ కోసం నేహా పూజలు చేస్తున్నట్లు విచారణలో తెలిసిందని చెప్పారు. మగబిడ్డ కోసం ఐవీఎఫ్, సరోగసి విధానాలను అవలంబించేందుకు కూడా ఆమె ప్రయత్నించిందని తెలిపారు. దీంతో ఇంటి వ్యక్తులే మహికను చంపారని భావించినట్లు చెప్పారు.

పాప మృతదేహం ఇంట్లోనే ఉండటంతో.. వెంటనే అనుమానం వచ్చిన అధికారులు ఆ మృతదేహం ఉన్న గదితో పాటు నేహాగోయల్ బెడ్రూం, బాత్రూంలను లాక్ చేశారు. అక్కడ ప్రతి అంగుళం క్షుణ్ణంగా గాలించారు. పాప మృతదేహం మీద ఉన్న రక్త నమూనాలు, బాత్రూంలో అప్పటికే శుభ్రం చేసినా.. అక్కడక్కడ మిగిలిన రక్త నమూనాలు తీసుకున్నారు. తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరి రక్త నమూనాలు కూడా సేకరించారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపగా, నేహ రక్త నమూనాలతో హత్యాస్థలంలో దొరికిన రక్తనమూనాలు సరిపోయాయి. దాంతో నేహను గట్టిగా ప్రశ్నించగా.. ఆమె తాను చేసిన ఘోరాన్ని అంగీకరించింది. నిందితురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement