వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్
ముంబై వేదికగా వన్‌ప్లస్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6ను కంపెనీ గత వారమే విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధరను 34,999 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. నిన్న అంటే మే 21న ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్ ప్రైమ్, వన్‌ప్లస్ కమ్యూనిటీ మెంబర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలిసారి సేల్‌కు వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌కు అనూహ్య స్పందన వచ్చింది. 10 నిమిషాల్లోనే రూ.100 కోట్ల విలువైన విక్రయాలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఈ స్మార్ట్‌ఫోన్ సేల్‌ను వన్‌ప్లస్ కంపెనీ ప్రారంభించింది. గతేడాది వన్‌ప్లస్ 5టీ రికార్డును సైతం బద్దలు కూడా వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో దూసుకెళ్లింది. గతేడాది వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్ రూ.100 కోట్ల విక్రయాలను ఆర్జించడానికి ఒక రోజంతా పట్టింది. కానీ వన్‌ప్లస్ 6కు అది కేవలం నిమిషాల వ్యవధిలోనే సాధ్యమవడం విశేషం. అది కూడా పరిమిత సంఖ్యలో కస్టమర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ ఇది వన్‌ప్లస్ 6కు ఇది సాధ్యమైంది.
నేడు వినియోగదారులందరకూ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయానికి అందుబాటులో ఉంచింది. అమెజాన్ సైట్‌లోనూ, వన్‌ప్లస్ వెబ్‌సైట్లలోనూ, పాప్-అప్ స్టోర్లలో, క్రోమా, కంపెనీకి చెందిన ఇతర స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్ నేడు లభ్యమవుతోంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. వన్‌ప్లస్ 6 అందుబాటులో ఉండే స్టోర్లు.. ముంబైలో హై స్ట్రీట్ ఫోనిక్స్, పుణేలో ఫోనిక్స్ మార్కెట్‌సిటీ, చెన్నైలో ది ఫోరమ్ విజయ, హైదరాబాద్‌లో ది ఫోరమ్ సుజన, ఢిల్లీలో డీఎల్‌ఎఫ్ ప్లేస్ సాకెట్, కోల్‌కతాలో సౌత్‌సిటీ మాల్, అహ్మదాబాద్‌లో గుల్‌మోహర్ పార్క్ మాల్, బెంగళూరులో వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్, బ్రిగేడ్ రోడ్డులో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఇంకా దేశవ్యాప్తంగా ఉన్న క్రోమా స్టోర్లలో కూడా దొరుకుతోంది. ఎస్‌బీఐ కస్టమర్లకు కంపెనీ రెండు వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఇస్తోంది.
వన్‌ప్లస్ 6 స్పెషిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆక్సీజెన్‌ఓఎస్ 5.1
డ్యూయల్-సిమ్(నానో)
6.28 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఫుల్ ఆప్టిక్ అమోలెడ్ డిస్‌ప్లే
84 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో
గొర్రిల్లా గ్లాస్ 5
క్వాల్‌కామ్ 845 ఎస్‌ఓసీ
6జీబీ ర్యామ్ లేదా 8జీబీ ర్యామ్
16 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా
16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
ఫేస్ అన్‌లాక్ ఫీచర్(0.4 సెకన్లలో అన్‌లాక్)
వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్
64జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు
3300ఎంఏహెచ్ బ్యాటరీ
ఈ ఫోన్ రెండు రకాల స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తోంది. 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999 కాగా.. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999గా నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment