
న్యూఢిల్లీ: వ్యక్తిగత రవాణాకు బలమైన డిమాండ్ కొనసాగడంతో ఫిబ్రవరిలో 3.35 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెల విక్రయాలతో పోలిస్తే ఇది 11 శాతం అధికం. ఆటో మొబైల్ రంగంలో ఇప్పటి వరకు ఫిబ్రవరిలో నమోదైన అత్యధిక టోకు అమ్మకాలు రికార్డు ఇవే కావడం విశేషం.
మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్ ఎంఅండ్‌ఎం, కియా మోటార్స్, టయోటో కిర్లోస్కర్ కంపెనీలు చెప్పుకోదగిన స్థాయిలో అమ్మకాలు జరిపాయి. ఇదే నెలలో ద్విచక్ర విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయాలు పెరిగాయి. బజాజ్ ఆటో, హోండా మోటోసైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్‌ఎంఎస్‌ఐ) టీవీఎస్ మోటార్ అమ్మకాలు నిరాశపరిచాయి. వాణిజ్య వాహనాలకు గిరాకీ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment