క్యాన్సర్లను నివారించే ఎండుద్రాక్ష! | Raisins to prevent cancer | Sakshi
Sakshi News home page

క్యాన్సర్లను నివారించే ఎండుద్రాక్ష!

Published Thu, Nov 9 2017 11:21 PM | Last Updated on Fri, Nov 10 2017 10:42 AM

Raisins to prevent cancer - Sakshi

కిస్‌మిస్‌ లేదా ఎండుద్రాక్ష అని పిలిచే ఈ డ్రైఫ్రూట్స్‌ రుచికరమే కాదు... ఆరోగ్యకరం కూడా. 100 గ్రాముల ఎండుద్రాక్షలో 249 క్యాలరీలతో పాటు పీచుపదార్థాలు, ఎన్నో రకాల లవణాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఎండుద్రాక్షతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని...

►ఎండుద్రాక్షలో (ద్రాక్షలో మాదిరిగానే) రెస్వెరట్రాల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఉంటుంది. నొప్పి, మంటను తగ్గించడంతో పాటు క్యాన్సర్లను నివారించే శక్తి దీనికి ఉంటుంది. ముఖ్యంగా అది మెలనోమా, పెద్దపేగు, ప్రోస్టేట్‌ క్యాన్సర్లను నివారిస్తుందని ఎన్నో అధ్యయనాల్లో తేలింది ∙ఎండుద్రాక్ష అనేక రకాల ఫంగల్, వైరల్‌ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

►కొలెస్ట్రాల్‌ పాళ్లను తగ్గించడంతో పాటు గుండెజబ్బులను (కరోనరీ ఆర్టరీ డిసీజ్‌ను) రాకుండా కాపాడుతుంది ∙రక్తనాళాలను సన్నబార్చే ఏంజియోటెన్సిన్‌ అనే హార్మోన్‌ను స్రావాలను తగ్గించి పక్షవాతాన్ని నివారిస్తుంది. అంతేకాదు... ఇలా ఏంటియోటెన్సిన్‌ను తగ్గించడం వల్ల హైబీపీ కూడా నివారితమవుతుంది. ∙రక్తనాళాలను విప్పారేలా చేసే నైట్రిక్‌ ఆక్సైడ్‌ పాళ్లను పెరిగేలా చేయడం వల్ల రక్తనాళాలు సన్నబారవు. దాంతో గుండెజబ్బులతోపాటు పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది.

►ఎండుద్రాక్షలో క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, జింక్‌ వంటి ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. ఐరన్‌ పాళ్లు కూడా పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత (అనీమియా) ఉన్నవారికి రక్తవృద్ధి చేస్తుంది ∙100 గ్రాముల ఎండుద్రాక్షలో 749 మి.గ్రా. పొటాషియం ఉంటుంది. ఇది హైబీపీని నివారించడంతో పాటు గుండెజబ్బులను, పెరిఫెరల్‌ వాస్కులార్‌ డిసీజ్‌ను నివారించడానికీ తోడ్పడుతుంది ∙థయామిన్, పైరిడాక్సిన్, రైబోఫ్లేవిన్, పాంటథోనిక్‌ యాసిడ్‌ వంటి బి–కాంప్లెక్స్‌కు సంబంధించిన విటమిన్‌ అంశాలు ఉండటం వల్ల అవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement