cancer agent
-
త్వరలో ఈ రెండు రాష్ట్రాల్లో పానీ పూరీ బ్యాన్!?
బెంగళూరు/చెన్నై: పానీ పూరీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్. కర్ణాటక, తమిళనాడులో పానీ పూరీని బ్యాన్ చేసే దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. పానీ పూరీలో క్యాన్సర్ కారక పదార్దాలు ఉన్నట్టు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.కాగా, పానీ పూరి అనేక వ్యాధులకు కారణమవుతోందని ఫుల్ సెఫ్టీ అధికారులు గుర్తించారు. వీటిని అమ్మేవారు సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పానీపూరీ తిన్న వారు డయేరియా, టైఫాయిడ్, జాండిస్ వంటి వ్యాధులకు గురవుతున్నారు. ఇక, తాజాగా కర్ణాటకలో 250 నమూనాలు సేకరించగా దీనిలో 40 భద్రతా ప్రమాణాలు విఫలమయ్యాయని తేలింది.వీటిలో బ్రిలియంట్ బ్లూ, టార్ట్రాజైన్ వంటి రసాయనాలు కనుగొన్నారు. వీటిలో క్యాన్సర్ కలిగించే పదార్థాలను కనుగొన్నారు. పానీ పూరిలో రంగుల వాడకమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇక, ఇప్పటికే కర్ణాటకలో గోభీ మంచూరియన్, కబాబ్స్ వంటి ఇతర స్నాక్స్‌లలో ఇటువంటి అనేక ఏజెంట్ల వాడకంపై నిషేధం విధించారు.ఇక, తమిళనాడులో కూడా దాదాపు 80 చోట్ల 1500 పానీ పూరీ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని గుర్తించారు. అలాగే, చాట్ మసాలాలలో ఇథిలీన్ ఆక్సైడ్ ఎక్కువగా కూడా గుర్తించారు. దీంతో, పానీ పూరీని బ్యాన్ చేసే దిశగా ఆలోచిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
రానిటిడిన్ ఔషధంలో కేన్సర్ కారకాలు
సాక్షి, హైదరాబాద్ : ఛాతిలో, కడుపులో మంట ఇలా ఏదైనా సమస్య వస్తే వైద్యులకు చెప్పకుండానే అనేక మంది ‘రానిటిడిన్’ మందు లను వాడేస్తున్నారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ తోనూ, ప్రిస్కిప్షన్ లేకుండానే ఈ మం దును ఔషధ దుకాణాల్లో ఇస్తున్నారు. కానీ రానిటిడిన్‌లో ప్రమాదకరమైన ఎన్– నైట్రొసో డైమిథైలమైన్ (ఎన్డీఎంఏ) కొద్ది మోతాదులో ఉందని, దీంతో కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) తాజాగా ప్రకటించింది. దీంతో కెనడా, సింగపూర్, ఈజిప్ట్, బహ్రెయిన్ సహా పలుదేశాలు ఈ మందును నిషేధించాయి. హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ఈ ఔషధంతో కూడిన మాత్రలను తయారు చేస్తాయి. ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా కంపెనీ ఇప్పటికే కొన్ని దేశాలకు ఎగుమతి చేయగా.. ఎఫ్ఏడీ ప్రకటనతో ఆ సరుకును వెనక్కి తెప్పిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. దేశంలోనూ ఈ ఔషధంతో కూడిన మాత్రలను నిషేధించాలని ఫార్మసిస్టులు కోరుతున్నారు. దేనికి వాడుతున్నారంటే.. రానిటిడిన్‌తో దేశంలో అనేక అంతర్జాతీయ బహుళ ఫార్మా కంపెనీలు రెండు మూడు ప్రధాన మైన బ్రాండ్ల పేరుతో ఔషధాన్ని తయారు చేస్తున్నాయి. రానిటిడిన్–150 ఎంజీ మాత్ర హిస్టమైన్–2 బ్లాకర్ అని పిలిచే ఒక ఔషధ సమూహాన్ని కలిగి ఉంది. ఈ ఔషధం కడుపులో ఆమ్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. కడుపు, పేగు లోపల పూతలా చికిత్స అందిస్తుంది. గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లక్స్ వ్యాధి, జోలింగర్–ఎల్లిసన్ సిండ్రోమ్ వంటి వ్యాధులు కడుపులో అధిక ఆమ్ల ఉత్పత్తికి దోహదం చేస్తాయి. అలాగే డియోడినల్ అల్సర్లు వచ్చినప్పుడు రానిటిడిన్–150 ఎంజీ మాత్ర ఉపయోగిస్తారు. చిన్న పేగు పూతల స్వల్పకాలిక చికిత్స కోసం ఉపయోగిస్తారు. కడుపు పూతలకు స్వల్పకాలిక చికిత్స కోసం రానిటిడిన్–150 ఎంజీ వాడుతారు. పూతల బారిన పడిన తర్వాత నిర్వహణ చికిత్సగా ఉపయోగిస్తారు. గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లక్స్ వ్యాధి నివారణకు కూడా రానిటిడిన్–150 ఎంజీని వాడతారు. ఎరోసివ్ ఈసోఫాగిటిస్ వచ్చినప్పుడు కూడా ఈ మాత్ర వాడతారు. కడుపు నుంచి సుదీర్ఘ ఆమ్లం రిఫ్లక్స్ కారణంగా ఆహార గొట్టం క్షీణిస్తే చికిత్స చేసేందుకు ఈ మాత్ర ఉపయోగిస్తారు. అలాగే జోలింగర్–ఎల్లిసన్ సిండ్రోమ్ వచ్చినప్పుడు కడుపులో ఆమ్ల స్రావం అరుదుగా ఉన్న అరుదైన పరిస్థితుల లక్షణాల ఉపశమనానికి ఈ మాత్రను ఉపయోగిస్తారు. హైపర్ సీక్రెటరీ కండీషన్లో చికిత్సకు ఉపయోగిస్తారు. భారత్‌లో ప్రతి ముగ్గురిలో ఒకరు.. కడుపులో మంట, ఎసిడిటీ, ఛాతిలో మంట వంటి పరిస్థితులను అనేకమంది ఎదుర్కొంటున్నారు. దీన్ని నివారించడానికి రానిటిడిన్ మూలనామం కలిగిన అనేక బ్రాండ్లతో కంపెనీలు తయారు చేస్తున్నాయి. అవన్నీ కూడా ప్రజలకు సుపరిచితం. భారత్‌లో ప్రతి ముగ్గురిలో ఒకరు వీటిని ఉపయోగిస్తున్నారని తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడు సంజయ్‌రెడ్డి తెలిపారు. భారత్‌లో ఈ మందును నిషేధించాలని కోరారు. -
మరణంలోనూ వీడని బంధం
సాక్షి, అన్నానగర్: కేన్సర్‌తో బాధపడుతున్న భర్తను రక్షించుకోలేక పోతున్నాననే ఆవేదనతో భార్య సముద్రంలో మునిగి ఆత్మహత్య చేసుకుంది. కాగా అదే రోజు రాత్రి పరిస్థితి విషమించి భర్త మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. చెన్నై మందవెలి సెయింట్ మేరీస్ రోడ్డుకి చెందిన ఉమామహేశ్వరి (46), ఈమె భర్త ప్రకాష్ వరదన్ (50). దంపతులకు కేశవన్ (19) అనే కుమారుడు ఉన్నాడు. ఎనిమిది నెలల కిందట ప్రకాష్ వరదన్‌కి కేన్సర్ ఉన్నట్లు తెలిసింది. పలు ఆపరేషన్లు చేసినప్పటికీ కేన్సర్ నుంచి కోలుకోలేకపోయాడు. కేన్సర్ నయం అయ్యే అవకాశం లేకపోవడంతో ప్రకాష్‌వరదన్ కొన్ని రోజులే మాత్రమే బతుకుతాడని డాక్టర్లు చెప్పారు. దీంతో ఉమామహేశ్వరి భర్తను ఇంటికి తీసుకొచ్చి బాగోగులు చూసుకునేది. ఈ స్థితిలో బుధవారం వేకువజామున ఆలయానికి వెళ్లి వస్తానని చెప్పిన ఉమామహేశ్వరి తిరిగి రాలేదు. తన కుమారుడు కేశవన్ సెల్‌ఫోన్‌కు ఆమె ఆడియో మెసేజ్ పంపింది. ఇందులో తండ్రిని బాగా చూసుకోవాలని, తాను భర్త లేకుండా జీవించలేనని పేర్కొంది. దీనిపై కేశవన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఎలియట్స్ సముద్రతీరంలో ఉమామహేశ్వరి మృతదేహం ఒడ్డుకు చేరింది. ఇలాఉండగా అదే రోజు రాత్రి పరిస్థితి విషమించి ప్రకాష్‌వరదన్ మృతి చెందాడు. ఒకే రోజున కుటుంబంలో ఇద్దరు మృతిచెందడంతో విషాదం నెలకొంది. -
క్యాన్సర్లను నివారించే ఎండుద్రాక్ష!
కిస్మిస్ లేదా ఎండుద్రాక్ష అని పిలిచే ఈ డ్రైఫ్రూట్స్ రుచికరమే కాదు... ఆరోగ్యకరం కూడా. 100 గ్రాముల ఎండుద్రాక్షలో 249 క్యాలరీలతో పాటు పీచుపదార్థాలు, ఎన్నో రకాల లవణాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఎండుద్రాక్షతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని... ►ఎండుద్రాక్షలో (ద్రాక్షలో మాదిరిగానే) రెస్వెరట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. నొప్పి, మంటను తగ్గించడంతో పాటు క్యాన్సర్లను నివారించే శక్తి దీనికి ఉంటుంది. ముఖ్యంగా అది మెలనోమా, పెద్దపేగు, ప్రోస్టేట్ క్యాన్సర్లను నివారిస్తుందని ఎన్నో అధ్యయనాల్లో తేలింది ∙ఎండుద్రాక్ష అనేక రకాల ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ►కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గించడంతో పాటు గుండెజబ్బులను (కరోనరీ ఆర్టరీ డిసీజ్‌ను) రాకుండా కాపాడుతుంది ∙రక్తనాళాలను సన్నబార్చే ఏంజియోటెన్సిన్ అనే హార్మోన్‌ను స్రావాలను తగ్గించి పక్షవాతాన్ని నివారిస్తుంది. అంతేకాదు... ఇలా ఏంటియోటెన్సిన్ను తగ్గించడం వల్ల హైబీపీ కూడా నివారితమవుతుంది. ∙రక్తనాళాలను విప్పారేలా చేసే నైట్రిక్ ఆక్సైడ్ పాళ్లను పెరిగేలా చేయడం వల్ల రక్తనాళాలు సన్నబారవు. దాంతో గుండెజబ్బులతోపాటు పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది. ►ఎండుద్రాక్షలో క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, జింక్ వంటి ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. ఐరన్ పాళ్లు కూడా పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత (అనీమియా) ఉన్నవారికి రక్తవృద్ధి చేస్తుంది ∙100 గ్రాముల ఎండుద్రాక్షలో 749 మి.గ్రా. పొటాషియం ఉంటుంది. ఇది హైబీపీని నివారించడంతో పాటు గుండెజబ్బులను, పెరిఫెరల్ వాస్కులార్ డిసీజ్‌ను నివారించడానికీ తోడ్పడుతుంది ∙థయామిన్, పైరిడాక్సిన్, రైబోఫ్లేవిన్, పాంటథోనిక్ యాసిడ్ వంటి బి–కాంప్లెక్స్‌కు సంబంధించిన విటమిన్ అంశాలు ఉండటం వల్ల అవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. -
జపాన్ కంపెనీతో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జపాన్‌కు చెందిన ‘ఇసాయి’ కంపెనీతో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఇసాయి అభివృద్ధి చేస్తున్న క్యాన్సర్ ఏజెంట్ ఈ7777పై వాణిజ్యపరమైన హక్కులను (ఆసియా, జపాన్ కాకుండా) డాక్టర్ రెడ్డీస్ కొనుగోలు చేసింది. కానీ ఎంత మొత్తానికి ఈ హక్కులను కొనుగోలు చేసింది కంపెనీ తెలియచేయలేదు.