ప్రూట్ పూల్ | Dragon Fruit Farming in Telangana | Sakshi
Sakshi News home page

ప్రూట్ పూల్

Published Mon, Jun 24 2024 5:01 AM | Last Updated on Mon, Jun 24 2024 5:01 AM

Dragon Fruit Farming in Telangana

రంగారెడ్డి జిల్లాలో అవకాడో, కర్జూర, యాపిల్, డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: నగరాన్ని ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లాలో పండ్ల తోటల సాగు క్రమేపీ పెరుగుతోంది. అన్ని రకాల పండ్లతోటలు సాగు చేసి రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. భౌగోళిక, వాతావరణ పరిస్థితు లు భిన్నంగా ఉన్నా..వివిధ రకాల పండ్ల తోటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధిస్తూ యువరైతులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. డ్రాగన్‌ ప్రూట్, కర్జూర, అవకాడో, యాపిల్‌ ఇలా వివిధ పండ్ల తోటలు జిల్లాలో సాగవుతున్నాయి. 

పులిమామిడిలో ‘యాపిల్‌’ 
యాపిల్‌ అనగానే హిమాచల్‌ప్రదేశ్, కశీ్మర్‌ మాత్రమే గుర్తొస్తాయి. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోనూ యాపిల్‌ తోటలు ఉన్నాయి. కందుకూరు మండలం పులిమామిడి పరిధిలోని శ్రీనిఖిల్‌ చేతనాకేంద్రం ఆశ్రమ నిర్వాహకులు 2021 డిసెంబర్‌లో హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి హరిమన్‌–99 రకానికి చెందిన 170 మొక్కలు తెప్పించి, 30 గుంటల్లో నాటారు. మరో నాలుగు అన్నారకం మొక్క లు కూడా నాటారు. ప్రస్తుతం ఒక్కో మొక్క నుంచి వంద నుంచి రెండు వందల పండ్ల వరకు దిగుబడి వచ్చింది. సాధారణంగా మంచు, చలి ఎక్కువగా ఉండే ప్రదేశంలోనే ఈ యాపిల్‌ పంట పండుతుంది. కానీ జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకొని దిగుబడి వస్తుండటం విశేషం. 

దెబ్బగూడలో ‘అవకాడో’ 
సాధారణంగా 25 డిగ్రీల వాతావరణంలో మాత్రమే పెరిగే అవకాడో 40 డిగ్రీలకుపైగా నమోదైన ఉష్ణోగ్రతలను సైతం తట్టుకొని నిలబడింది. కందుకూరు మండలం దెబ్బ గూడకు చెందిన రమావత్‌ జైపాల్‌ జిల్లాలోనే తొలిసారిగా అవకాడో పండ్ల తోట సాగుచేశారు. ఆయన మూడేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా ఎకరం పది గుంటల్లో 220 అవ కాడో మొక్కలు నాటారు. మొక్క నాటే సమయంలో గుంతలో యాప పిండి, గులికల మందు వాడాడు. ఆ తర్వాత డ్రిప్‌ సాయంతో మొక్కలకు నీరు అందించాడు. చీడపీడల సమస్యే కాదు పెట్టుబడికి పైసా ఖర్చు కూడా లేకపోవడం ఆ యువరైతుకు కలిసి వచి్చంది. ప్రస్తుతం ఆ మొక్కలు ఏపుగా పెరిగి కాపు కొచ్చాయి. ఒక్కో చెట్టు నుంచి 150 నుంచి 200 కాయలు దిగుబడి వచి్చంది.

తుక్కుగూడలో ద్రాక్ష సాగు..
నిజాం నవాబుల బ్యాక్‌యార్డ్‌(ఇంటి వెనుక గార్డెన్‌)ల్లో ద్రాక్షతోటలు సాగయ్యేవి. ధనవంతుల పెరట్లో మాత్రమే ఈ తోటలు కనిపిస్తుండటంతో వీటికి ‘రిచ్‌మెన్‌ క్రాప్‌’గా పేరొచి్చంది. ఆ తర్వాత టోలిచౌకిలో గద్దె రామకోటేశ్వరరావు తొలిసారి ద్రాక్షపంటను సాగు చేశారు. అప్పట్లో ఎకరానికి ఆరు నుంచి ఏడు టన్నుల దిగుబడి వచి్చంది. సాధారణంగా సమ శీతోష్ణ మండలంలో పండే పంటను హైదరాబాద్‌ పరిసరాల్లో పండించి చరిత్ర సృష్టించారు. 1991లో హైదరాబాద్‌ వేదికగా గ్రేప్స్‌ పంటపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. నగరం గ్రేప్స్‌ రాజధానిగా గుర్తింపు పొందింది. ఇక్కడి రైతులను ఆదర్శంగా తీసుకొని మహారాష్ట్రలో కూడా సాగు ప్రారంభించారు. పంట భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వెలుస్తుండటంతో 2005 నుంచి ద్రాక్ష పంట క్రమంగా కనుమరుగవుతూ వస్తోంది. ప్రస్తుతం ఒక్క తుక్కుగూడ వేదికగా మాత్రమే ద్రాక్ష సాగవుతోంది.

ఈ ప్రాంతాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు.. 
జిల్లాలోని యాచారం, కందుకూరు, అబ్దుల్లాపూర్‌ మెట్, శంషాబాద్, మొయినాబాద్, శంకర్‌పల్లి తదితర ప్రాంతాల్లో ‘డ్రాగన్‌ ఫ్రూట్‌’ సాగవుతోంది.

15 ఏళ్లుగా ద్రాక్ష సాగు చేస్తున్నా  
పదిహేను ఏళ్లుగా ద్రాక్ష పంటను సాగు చేస్తున్నా. ఒక్కసారి మొక్క నాటితే 20 ఏళ్లపాటు దిగుమతి వస్తుంది. మొదట్లో ’థాంసన్‌’ వెరైటీ సాగు చేశాను. తాజాగా ’మాణిక్‌ చమాన్‌’ వెరైటీ ఎంచుకున్నా. ఎకరాకు వెయ్యి మొక్కలు నాటాను. మొక్కల ఎంపిక సహా సస్యరక్షణలో చిన్నచిన్న మెళకువలు పాటించి నాటిన రెండేళ్లకే అనూహ్యంగా దిగుబడిని సాధించాను. ప్రస్తుతం ఒక్కో చెట్టు నుంచి 25 కేజీల వరకు దిగుమతి వస్తుంది. ఎకరా పంటకు కనీసం ఆరు లక్షల ఆదాయం వస్తుంది. ఖర్చుపోను రూ.3 లక్షలు మిగులుతుంది.  – కొమ్మిరెడ్డి అంజిరెడ్డి, తుక్కుగూడ

విదేశాల నుంచి తిరిగొచ్చి.. 
మేం ముగ్గురం అన్నదమ్ములం. మాకు 47 ఎకరాల భూమి ఉంది. మాది మొదటి నుంచి వ్యవసాయ ఆధారిత కుటుంబం. నేను బీటెక్‌ పూర్తి చేసి, ఎంబీఏ కోసం పదేళ్ల క్రితం లండన్‌ వెళ్లాను. అక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేక మళ్లీ వెనక్కి తిరిగొచ్చా. అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్న అవకాడో సాగు చేయాలనుకున్నా. ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగం చేసుకోకుండా..వ్యవసాయం చేస్తున్నాడేంటి? అని అంతా నవ్వుకున్నారు.

ఏదో ఒక పండ్లతోట సాగు చేయాలని భావించి మొక్కల కొనుగోలుకు జడ్చర్ల నర్సరీకి వెళ్లాను. అక్కడ అవకాడో మొక్కలు చూశా. అప్పటికే ఆ పండు గురించి తెలుసు కాబట్టి..ఆ పంటను సాగుచేశా. మొక్క నాటిన తర్వాత పైసా ఖర్చు చేయలేదు. ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడి వచి్చంది. ఆన్‌లైన్‌లో చూసి, స్వయంగా తోట వద్దకే వచ్చి పండ్లు కొనుగోలు చేశారు.     – రమావత్‌ జైపాల్, యువరైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement