Orchards
-
ఉద్యాన రంగానికి కేంద్రం ఊతం
సాక్షి, అమరావతి: దేశంలో ఉద్యాన రంగాన్ని మరింత బలోపేతం చేసి, ఉద్యాన ఉత్పత్తుల్లో నాణ్యత పెంచడమే లక్ష్యంగా కేంద్రం క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ (సీపీపీ)కు రూపకల్పన చేసింది. గతంలో రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యాన రైతులకు మేలు కలిగేలా నర్సరీల క్రమబద్ధీకరణ చట్టంలో చేసిన సవరణల తరహాలోనే కేంద్రం కూడా నూతన విధానాన్ని రూపొందించింది.పండ్ల తోటల్లో నాణ్యతతో పాటు ఉత్పత్తిని పెంచి, ఎగుమతులను ప్రోత్సహించేలా రూ.1,766 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతోంది. ఇందులో భాగంగా ఏపీ సహా దేశవ్యాప్తంగా 9 ప్రాంతాల్లో క్లీన్ ప్లాంట్ సెంటర్స్ (సీపీసీలు) ఏర్పాటు చేయబోతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఇప్పటికే ఉద్యాన హబ్‌గా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్‌కు ఈ ప్రాజెక్టు మరింతగా తోడ్పడుతుంది. నాణ్యత లేని మొక్కలు, ప్లాంట్ మెటీరియల్స్ కారణంగా దేశంలో ఉద్యాన రైతులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ అత్యంత నాణ్యమైన, వైరస్‌లను తట్టుకొనే ప్లాంట్ మెటీరియల్స్‌ను రైతులకు అందుబాటులోకి తేవడం, సాగులో, ఆ తర్వాత ఉత్పత్తుల మార్కెటింగ్‌లో కూడా చేయూతనివ్వడమే లక్ష్యంగా సీపీపీని కేంద్రం అమలు చేస్తోంది.క్లీన్ ప్లాంట్ సెంటర్స్ లక్ష్యాలు» ఉద్యాన పంటలకు సోకే వ్యాధులు, వైరస్ల గుర్తింపు, వాటి నియంత్రణకు అత్యాధునిక లేబొరేటరీల ఏర్పాటు. ప్రత్యేకంగా టిష్యూ కల్చర్ ల్యాబ్స్ ఏర్పాటు» నాణ్యమైన ప్లాంట్ మెటీరియల్, విత్తనాల సరఫరాకు నర్సరీలను బలోపతం చేయడం, కొత్త నర్సరీల ఏర్పాటు» పాలీ హౌసెస్, గ్రీన్ హౌసెస్, షేడ్‌నెట్ హౌసెస్, వాక్ ఇన్ టన్నల్స్కు ప్రోత్సాహకాలు» కొత్తగా ఆర్కెడ్స్, తోటల విస్తరణ, డ్రిప్ ఇరిగేషన్‌కు చేయూత.. ఆర్గానిక్ ఫార్మింగ్, ఆన్ ఫామ్ పాండ్స్, వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ అభివృద్ధిఇదే లక్ష్యంతో ఏపీలో నర్సరీ చట్టం బలోపేతంఇదే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలోనే నర్సరీల క్రమబద్ధీకరణ చట్టాన్ని సవరించి బలోపేతం చేసింది. రాష్ట్రంలో 5,883 నర్సరీలున్నాయి. ఏటా 422.5 కోట్ల మొక్కల ఉత్పత్తి, అమ్మకాల ద్వారా రూ.2,483 కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. ఈ చట్టం పరిధిలో శాశ్వత పండ్ల మొక్కలు ఉత్పత్తి చేసే నర్సరీలు మాత్రమే ఉండగా, నర్సరీల చట్టాన్ని బలోపేతం చేయడం ద్వారా నర్సరీలతో పాటు పాలీ హౌస్‌లు, షేడ్ నెట్లను కూడా జగన్ ప్రభుత్వం చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. 2023–24లో 3,171 నర్సరీలను రిజిస్ట్రేషన్ కూడా చేశారు. వీటి ద్వారా నాణ్యమైన ధ్రువీకరించిన మొలకలు, ప్లాంట్ మెటీరియల్స్ ఉత్పత్తి, సరఫరాకు బాటలు వేసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్లాంట్ మెటిరియల్స్పైనా నిఘాను కట్టుదిట్టం చేసింది. ఈ చర్యల ఫలితంగా రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు, దిగుబడులు, ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. -
ప్రూట్ పూల్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: నగరాన్ని ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లాలో పండ్ల తోటల సాగు క్రమేపీ పెరుగుతోంది. అన్ని రకాల పండ్లతోటలు సాగు చేసి రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. భౌగోళిక, వాతావరణ పరిస్థితు లు భిన్నంగా ఉన్నా..వివిధ రకాల పండ్ల తోటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధిస్తూ యువరైతులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. డ్రాగన్ ప్రూట్, కర్జూర, అవకాడో, యాపిల్ ఇలా వివిధ పండ్ల తోటలు జిల్లాలో సాగవుతున్నాయి. పులిమామిడిలో ‘యాపిల్’ ⇒ యాపిల్ అనగానే హిమాచల్‌ప్రదేశ్, కశీ్మర్ మాత్రమే గుర్తొస్తాయి. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోనూ యాపిల్ తోటలు ఉన్నాయి. కందుకూరు మండలం పులిమామిడి పరిధిలోని శ్రీనిఖిల్ చేతనాకేంద్రం ఆశ్రమ నిర్వాహకులు 2021 డిసెంబర్లో హిమాచల్‌ప్రదేశ్ నుంచి హరిమన్–99 రకానికి చెందిన 170 మొక్కలు తెప్పించి, 30 గుంటల్లో నాటారు. మరో నాలుగు అన్నారకం మొక్క లు కూడా నాటారు. ప్రస్తుతం ఒక్కో మొక్క నుంచి వంద నుంచి రెండు వందల పండ్ల వరకు దిగుబడి వచ్చింది. సాధారణంగా మంచు, చలి ఎక్కువగా ఉండే ప్రదేశంలోనే ఈ యాపిల్ పంట పండుతుంది. కానీ జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకొని దిగుబడి వస్తుండటం విశేషం. దెబ్బగూడలో ‘అవకాడో’ ⇒ సాధారణంగా 25 డిగ్రీల వాతావరణంలో మాత్రమే పెరిగే అవకాడో 40 డిగ్రీలకుపైగా నమోదైన ఉష్ణోగ్రతలను సైతం తట్టుకొని నిలబడింది. కందుకూరు మండలం దెబ్బ గూడకు చెందిన రమావత్ జైపాల్ జిల్లాలోనే తొలిసారిగా అవకాడో పండ్ల తోట సాగుచేశారు. ఆయన మూడేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా ఎకరం పది గుంటల్లో 220 అవ కాడో మొక్కలు నాటారు. మొక్క నాటే సమయంలో గుంతలో యాప పిండి, గులికల మందు వాడాడు. ఆ తర్వాత డ్రిప్ సాయంతో మొక్కలకు నీరు అందించాడు. చీడపీడల సమస్యే కాదు పెట్టుబడికి పైసా ఖర్చు కూడా లేకపోవడం ఆ యువరైతుకు కలిసి వచి్చంది. ప్రస్తుతం ఆ మొక్కలు ఏపుగా పెరిగి కాపు కొచ్చాయి. ఒక్కో చెట్టు నుంచి 150 నుంచి 200 కాయలు దిగుబడి వచి్చంది.తుక్కుగూడలో ద్రాక్ష సాగు..⇒ నిజాం నవాబుల బ్యాక్‌యార్డ్(ఇంటి వెనుక గార్డెన్)ల్లో ద్రాక్షతోటలు సాగయ్యేవి. ధనవంతుల పెరట్లో మాత్రమే ఈ తోటలు కనిపిస్తుండటంతో వీటికి ‘రిచ్మెన్ క్రాప్’గా పేరొచి్చంది. ఆ తర్వాత టోలిచౌకిలో గద్దె రామకోటేశ్వరరావు తొలిసారి ద్రాక్షపంటను సాగు చేశారు. అప్పట్లో ఎకరానికి ఆరు నుంచి ఏడు టన్నుల దిగుబడి వచి్చంది. సాధారణంగా సమ శీతోష్ణ మండలంలో పండే పంటను హైదరాబాద్ పరిసరాల్లో పండించి చరిత్ర సృష్టించారు. 1991లో హైదరాబాద్ వేదికగా గ్రేప్స్ పంటపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. నగరం గ్రేప్స్ రాజధానిగా గుర్తింపు పొందింది. ఇక్కడి రైతులను ఆదర్శంగా తీసుకొని మహారాష్ట్రలో కూడా సాగు ప్రారంభించారు. పంట భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తుండటంతో 2005 నుంచి ద్రాక్ష పంట క్రమంగా కనుమరుగవుతూ వస్తోంది. ప్రస్తుతం ఒక్క తుక్కుగూడ వేదికగా మాత్రమే ద్రాక్ష సాగవుతోంది.ఈ ప్రాంతాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు.. జిల్లాలోని యాచారం, కందుకూరు, అబ్దుల్లాపూర్ మెట్, శంషాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి తదితర ప్రాంతాల్లో ‘డ్రాగన్ ఫ్రూట్’ సాగవుతోంది.15 ఏళ్లుగా ద్రాక్ష సాగు చేస్తున్నా పదిహేను ఏళ్లుగా ద్రాక్ష పంటను సాగు చేస్తున్నా. ఒక్కసారి మొక్క నాటితే 20 ఏళ్లపాటు దిగుమతి వస్తుంది. మొదట్లో ’థాంసన్’ వెరైటీ సాగు చేశాను. తాజాగా ’మాణిక్ చమాన్’ వెరైటీ ఎంచుకున్నా. ఎకరాకు వెయ్యి మొక్కలు నాటాను. మొక్కల ఎంపిక సహా సస్యరక్షణలో చిన్నచిన్న మెళకువలు పాటించి నాటిన రెండేళ్లకే అనూహ్యంగా దిగుబడిని సాధించాను. ప్రస్తుతం ఒక్కో చెట్టు నుంచి 25 కేజీల వరకు దిగుమతి వస్తుంది. ఎకరా పంటకు కనీసం ఆరు లక్షల ఆదాయం వస్తుంది. ఖర్చుపోను రూ.3 లక్షలు మిగులుతుంది. – కొమ్మిరెడ్డి అంజిరెడ్డి, తుక్కుగూడవిదేశాల నుంచి తిరిగొచ్చి.. మేం ముగ్గురం అన్నదమ్ములం. మాకు 47 ఎకరాల భూమి ఉంది. మాది మొదటి నుంచి వ్యవసాయ ఆధారిత కుటుంబం. నేను బీటెక్ పూర్తి చేసి, ఎంబీఏ కోసం పదేళ్ల క్రితం లండన్ వెళ్లాను. అక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేక మళ్లీ వెనక్కి తిరిగొచ్చా. అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న అవకాడో సాగు చేయాలనుకున్నా. ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగం చేసుకోకుండా..వ్యవసాయం చేస్తున్నాడేంటి? అని అంతా నవ్వుకున్నారు.ఏదో ఒక పండ్లతోట సాగు చేయాలని భావించి మొక్కల కొనుగోలుకు జడ్చర్ల నర్సరీకి వెళ్లాను. అక్కడ అవకాడో మొక్కలు చూశా. అప్పటికే ఆ పండు గురించి తెలుసు కాబట్టి..ఆ పంటను సాగుచేశా. మొక్క నాటిన తర్వాత పైసా ఖర్చు చేయలేదు. ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడి వచి్చంది. ఆన్లైన్లో చూసి, స్వయంగా తోట వద్దకే వచ్చి పండ్లు కొనుగోలు చేశారు. – రమావత్ జైపాల్, యువరైతు -
Fact Check: చీడపీడలు మీ మెదడుకే
సాక్షి, అమరావతి: ఐదేళ్లుగా మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచింది. పాత తోటల పునరుద్ధరణ, కొత్త తోటల విస్తరణ కోసం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందించింది. నాణ్యమైన దిగుబడులే లక్ష్యంగా తోట బడులు, ఆర్బీకేల ద్వారా రైతులకు శిక్షణ ఇప్పించింది. వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, ప్రకృతి వైపరీత్యాల్లో పంట నష్టపోయిన మామిడి రైతులకు పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అందించింది. బంగినపల్లి, ఇమామ్ పసంద్ వంటి ఫైన్ వెరైటీ పండ్లకు టీడీపీ ప్రభుత్వ హయాంలో గరిష్టంగా టన్ను రూ.40వేలు–50వేలు పలుకగా, ఈ ప్రభుత్వంలో రూ.1.30లక్షల వరకు కూడా పలికింది. గత ప్రభుత్వంలో టన్ను రూ.ఐదారువేలు కూడా పలకని తోతాపూరికి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా రూ.10వేలకు తగ్గకుండా పలికేలా చేసింది. కానీ ఇవేమీ పట్టని ఈనాడు దినపత్రిక ప్రభుత్వంపై బురద జల్లడం, మామిడి రైతులను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా ‘మామిడి రైతుకు ఏటా కష్టాలే’ అంటూ విషం కక్కింది. ఆరోపణ: 5.86 లక్షల ఎకరాల్లో తగ్గిన విస్తీర్ణం! వాస్తవం: 2019–20లో 9,41,235 ఎకరాల్లో మామిడి తోటలు సాగవగా, 2023–24లో అది 9,97,100 ఎకరాలకు పెరిగింది. కొత్తగా ఈ ఐదేళ్లలో 55,865 ఎకరాల్లో కొత్తగా మామిడి తోటలు పెరిగాయి. 2019–20లో 46.88లక్షల టన్నుల దిగుబడులు రాగా, 2023–24లో 49.85లక్షల టన్నులు వస్తాయని అంచనా వేశారు. వాస్తవం ఇలా ఉంటే ఈనాడుకు మాత్రం రాష్ట్రంలో 5.86 లక్షల ఎకరాల్లో మామిడి సాగు తగ్గిపోయింది, ఆరోపణ: చీడపీడలను నివారించేందుకు చర్యలేవి? వాస్తవం: 5 ఏళ్లలో 883 తోట బడుల ద్వారా సమీకృత తెగులు, ఎరువు యాజమాన్య పద్ధతులపై మామిడి రైతులకు ఆర్బీకే స్థాయిలో శిక్షణనిచ్చారు. శాస్త్రవేత్తలు, అధికారులతో కూడిన బృందాలను మామిడి సాగయ్యే జిల్లాలకు పంపి క్షేత్ర స్థాయిలో తోటలకు సోకుతున్న చీడపీడలు, తెగుళ్లను గుర్తించడం, తక్షణ నివారణ చర్యలు చేపట్టేలా రైతులను అప్రమత్తం చేస్తున్నారు. నల్లతామరతో సహా వివిధ రకాల చీడపీడలు, తెగుళ్ల నివారణకు రైతు క్షేత్రాల్లోనే సామూహిక చర్యలు చేపట్టారు. వాట్సప్ గ్రూపుల ద్వారా చిన్న చిన్న వీడియో సందేశాలను పంపి రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందించారు. రూ.కోటి రాయితీతో 2802.50 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా మామిడి సాగుకు, రూ.3.50 కోట్ల రాయితీతో 6250 ఎకరాల విస్తీర్ణంలో పండ్ల నాణ్యత ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు చేపట్టారు. ఇలా 4 ఏళ్లలో రూ.1.80 కోట్ల రాయితీతో ఫ్రూట్ కవర్లను రైతులకు పంపిణీ చేశారు. తద్వారా మామిడి నాణ్యత ప్రమాణాలను పెంచి దేశీయంగానే కాకుండా విదేశాలలో కూడా ఆంధ్ర మామిడికి గిరాకీ వచ్చేటట్టు చేయగలిగారు. ఆరోపణ: వైకాపా వచ్చాక ప్రోత్సాహమే కరువు వాస్తవం: పండ్ల తోటల విస్తరణ, నిర్వహణ కార్యక్రమం కింద 1.14 లక్షల మంది రైతులకు రూ.126.51 కోట్లు, పాత తోటల పునరుద్ధరణ కింద 8618 మందికి రూ.14.53 కోట్ల లబ్ధి చేకూర్చారు. ప్రస్తుతం ఉన్న తోటలలో ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా సూక్ష్మనీటి సాగు పథకం కింద ఐదేళ్లలో 70,350 ఎకరాల్లో మామిడి తోటలకు డ్రిప్ పరికరాలను సమకూర్చారు. 5 ఏళ్లలో రూ.35.04 కోట్ల రాయితీతో 1752 ప్యాక్ హౌస్‌లను రైతుల పొలాల్లో నిర్మించగా, రూ.39.02 కోట్ల రాయితీతో 485 కలెక్షన్ కేంద్రాలను మామిడి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా నిర్మించారు. 91 కోల్డ్ రూమ్స్ నిర్మాణానికి 70 శాతం రాయితీ అందించారు. 2023–24లో మామిడి రైతుల అభివృధ్ధి కోసం రూ.22.50 కోట్ల రాయితీతో మామిడి ఎఫ్పీఓల ద్వారా 200 కలెక్షన్ సెంటర్లు, రూ.10.50 కోట్ల రాయితీతో రైతు క్షేత్రాల్లో 525 ప్యాక్ హౌస్‌లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆరోపణ: ఎగుమతులకు ఏదీ ప్రోత్సాహం వాస్తవం: ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రతిఏటా అపెడా ఆధ్వర్యంలో అమ్మకపు, కొనుగోలు దారుల సదస్సులు నిర్వహించారు. దక్షిణ కొరియా, జపాన్, న్యూజిలాండ్, అమెరికా, లండన్ వంటి దేశాలకు కూడా పెద్ద ఎత్తున ఎగుమతులు జరిగాయి. టీడీపీ కాలంలో ఐదేళ్లలో ఏటా సగటున 500 టన్నులు ఎగుమతి అయితే.. ఈ 5 ఏళ్లలో ఏటా సగటున 1200 టన్నుల పండ్లతో పాటు 8 లక్షల టన్నుల మామిడి గుజ్జును విదేశాలకు ఎగుమతి చేయగలిగారు. మరో వైపు దేశంలోనే తొలిసారి మామిడి రైతులకు జీఏపీ సర్టిఫికేషన్ జారీ చేస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎన్టీఆర్, చిత్తూరు జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ఫలితంగా మామిడి ఎగుమతులు పెరగడమే కాదు..రైతులు అత్యధిక ధర పొందేందుకు దోహదపడనుంది. ఆరోపణ: మామిడి రైతులకు చేయూత ఏదీ వాస్తవం: ప్రాంతాల వారీగా మామిడి తోటలను సమీప గుజ్జు పరిశ్రమలకు అనుసంధానం చేశారు. తోతాపురి మామిడి ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ధరలు పతనం కాకుండా చర్యలు చేపట్టారు. పండ్ల నాణ్యతను పెంచడానికి పండు ఈగల నష్టాన్ని నివారించడానికి ఆధునిక పండ్లకోత పరికరాలతో పాటు పండు ఈగ నివారణకు అవసరమైన ఆకర్షణ బుట్టలను పంపిణీ చేస్తున్నారు. పండ్ల కోత, నాణ్యతపై మండల స్థాయిలో రైతులకు, కోసిన పండ్లను గుజ్జు తయారీ పరిశ్రమలకు చేరవేయడంపై ఆర్బీకే సిబ్బందికి జిల్లా స్థాయిలోనూ శిక్షణ ఇచ్చారు. ధరలు పడిపోకుండా ఉండేందుకు దశల వారీగా పండ్ల కోతలు జరిగేలా చర్యలు చేపట్టారు. కోత మొదలైనప్పటి నుంచి చివరి పండు కోత కొచ్చే వరకు ప్రతిరోజు ధరల స్థిరీకరణకు విశేషమైన కృషి చేస్తున్నారు. ఫలితంగా ఈ ఐదేళ్లలో ఏ దశలోనూ టన్ను రూ.10వేలకు తగ్గకుండా ఉంది. సీజన్లో గరిష్టంగా రూ.23వేలకు అమ్ముకోగలిగారు. అదే టీడీపీ హయాంలో ఏనాడు రూ.5వేలకు మించి కొనలేని పరిస్థితి ఉండేది. -
రైతుల చూపు..పండ్లతోటల వైపు
పీలేరు రూరల్ : సన్న, చిన్నకారు రైతులకు ఆదాయ మార్గాలను సమకూర్చడం... జీవనోపాధులకు భద్రత కల్పించడం.. ఉత్పాదక ఆస్తులను పెంపొందిండం.. కరువుపీడత ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షన, శాశ్వత ప్రాతిపదిక భూ అభివృద్ధి, భూసార రక్షణ లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన పండ్ల తోటల పెంపకం అన్నమయ్య జిల్లాలో లక్ష్యాన్ని అధిగమించింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గానూ మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా 2735 మంది రైతులకు లబ్ధి కలిగింది. జిల్లాలో 5050 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం లక్ష్యం కాగా 5266 ఎకరాల్లో సాగు చేసి లక్ష్యాన్ని అధిగమించినట్లు డ్వామా పీడీ ఎంసీ మద్దిలేటి తెలిపారు. లబ్ధిదారులు ఇప్పటికే 85 శాతం మొక్కలు నాటడం పూర్తయిందని, వర్షాలు కురిస్తే వందశాతం పూర్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ద్వారా సహకారం... ఎంపిక చేసిన రైతులకు పండ్లతోటల పెంపకం, 3 సంవత్సరాల వరకు వంద శాతం నిర్వహణ వ్యయం ప్రభుత్వం చెల్లిస్తుంది. భూమి దున్నేందుకు, గుంతలు తీసేందుకు, ముళ్ల కంచెల ఏర్పాటుకు, సేంద్రియ, రసాయన ఎరువులు, సస్యరక్షణ మందులకు, పాదుల్లో కలుపు తీసేందుకు, అంతర్‌పంటలకు, 30 శాతం డ్రిప్ పరికరాల ఏర్పాటుకు, మామిడి తోటల పెంపకానికి ఏడాదికి 20 పర్యాయములు నీరు పోయుటకు బిల్లులు మంజూరు అవుతాయి. పండ్ల తోటల పెంపకానికి ఎకరాకు నిర్వహణ ఖర్చు... మామిడికి రూ. 10,31,193, చీని రూ. 1,07,459, నిమ్మ రూ. 1,41,515, జామ రూ. 1,27,451, తైవాన్ జామ, రూ. 2,26,783, సపోట రూ. 90,027, కొబ్బరి రూ. 90,610, సీతాఫలం రూ. 59,217, సీతాఫలం (బ్లాక్) రూ. 1,82,840, దానిమ్మ రూ. 2,44,819, నేరేడు రూ. 41,292, చింత రూ. 66,500, ఆపిల్రేగు రూ. 1,08,338, 5 లేయర్స్ బహళ పంట రూ. 1,64,863, డ్రాగన్ ఫ్రూట్ రూ. 1,84,533, గులాబీ పూల తోట రూ. 10,795, మల్లెపూట తోట రూ. రూ. 10,295 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. 85 శాతం మొక్కలు నాటడం పూర్తి... ఈ ఆర్థిక సంవత్సర పండ్ల తోటల పెంపకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 85 శాతం మొక్కలు నాటడం పూర్తి చేశాం. వర్షాభావ పరిస్థితులతో ఇంకా కొన్ని ప్రాంతాల్లో పూర్తి కాలేదు. వర్షాలు కురిస్తే వందశాతం పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లబ్ధిదారులకు బిల్లులు పెండింగ్ లేకుండా చెల్లించడం జరుగుతోంది. – ఎం.సి. మద్దిలేటి, డ్వామా పీడీ. వందశాతం రాయితీ లభిస్తోంది... ఉపాధి హామీ పథకంలో 16 రకాల పండ్ల తోటలు సాగు చేసుకోవడానికి రైతులకు వందశాతం రాయితీ లభిస్తోంది. వివిధ రకాల పండ్ల తోటల తోపాటు పూల తోటలు పెంపకాన్ని ప్రోత్సహిస్తూ సకాలంలో బిల్లులు ఇస్తున్నాం. అంతర్‌పంటలకు కూడా బిల్లులు ఇవ్వడం జరుగుతోంది. గట్లపై టేకు, ఎర్రచందనం లాంటి మొక్కలు నాటుకోవడానికి బిల్లులు మంజూరవుతున్నాయి. – ఎస్. మధుబాబు, ఏపీడీ, కలికిరి ఉపాధి హామీతో ఎంతో ప్రయోజనం... ఉపాధి హామీ పథకంతో ఎంతో ప్రయోజనం పొందాం. ఆర్థిక స్థోమత లేక నాకున్న పొలం మొత్తం ఖాళీగా పెట్టుకున్నాం. అయితే ఉపాధి హామీ పథకంతో నా రెండు ఎకరాల్లో 150 మామిడి మొక్కలు నాటా. అందుకు సంబంధించి బిల్లులు మొత్తం నా ఖాతాకు జమ అయ్యాయి. చాలా సంతోషంగా ఉంది. – బి.డి. సిద్ధారెడ్డి, రైతు రామిరెడ్డిగారిపల్లె, పీలేరు మండలం. బిల్లులు చెల్లించారు ఉపాధి హామీ పథకంలో పండ్ల తోటలు సాగు చేసుకోవడానికి బిల్లులు అందించడం తోపాటు అధికారులు సలహాలు కూడా ఇస్తున్నారు. రెండు ఎకరాల పొలంలో మామిడి మొక్కలు నాటా. ఇప్పటి వరకు బిల్లులు పెండింగ్ లేకుండా చెల్లించారు. మా లాంటి పేద వారికి ప్రభుత్వం ఎంతో మేలు చేసింది. – జి. శ్రీధర్‌నాయుడు, భయ్యారెడ్డిగారిపల్లె, పీలేరు మంలం. -
హార్టీకల్చర్ హబ్‌గా ఏపీ
సాక్షి ప్రతినిధి కర్నూలు: వర్షాలపై ఆధారపడి అదృష్టాన్ని పరీక్షించుకునే రైతులకు ఏటా కచ్చితమైన ఆదాయం లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పొడి భూముల్లో ఉద్యాన పంటలు (డ్రై ల్యాండ్ హార్టీకల్చర్) కార్యక్రమం కింద రైతులకు మొక్కలు నాటే సమయం నుంచి 100 శాతం సబ్సిడీ ఇవ్వడంతోపాటు మూడేళ్లపాటు సాగు ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తోంది. దీంతో రాష్ట్రంలో పండ్ల తోటలు సాగు చేసే రైతుల సంఖ్య పెరిగింది. ఈ కార్యక్రమం ద్వారా రైతులు స్థిరంగా లాభాల పంటను పండిస్తూ ఆర్థికంగా బలపడుతున్నారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులను చూసి సంప్రదాయ పంటలు సాగు చేసే పొరుగు రైతులు కూడా పండ్ల తోటల సాగువైపు మళ్లుతున్నారు. సన్న, చిన్నకారు రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వమే దన్నుగా నిలుస్తుండటంతో దేశంలోనే ‘హార్టీ కల్చర్ హబ్’గా ఏపీ అభివృద్ధి చెందుతోంది. నాలుగేళ్లలో 2.35 లక్షల ఎకరాల్లో.. 2018–19 వరకూ రాష్ట్రంలో 17,62,240 ఎకరాల్లో పండ్ల తోటలు సాగయ్యేవి. ఆ విస్తీర్ణం ప్రస్తుతం 19,97,467.5 ఎకరాలకు సాగు పెరిగింది. అంటే నాలుగేళ్లలో రికార్డు స్థాయిలో 2,35,227.5 ఎకరాల్లో పండ్ల తోటల సాగు పెరిగింది. 2018–19లో 1,76,43,797 టన్నుల పండ్ల దిగుబడులు రాగా.. ప్రస్తుతం 2,03,70,557 టన్నులకు పెరిగింది. అంటే 27,26,760 టన్నుల దిగుబడి పెరిగింది. పండ్ల తోటలతో పాటు పూలు, కూరగాయలు కలిపి మొత్తం రాష్ట్రంలో 47.02 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. వీటిద్వారా 3.63 కోట్ల టన్నుల దిగుబడులు వస్తున్నాయి. ప్రస్తుత ఏడాది 2023–24లో రికార్డు స్థాయిలో 75 వేల ఎకరాల్లో పండ్ల తోటలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 100 శాతం సబ్సిడీతో పండ్ల తోటల అభివృద్ధికి అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా పండ్ల తోటల సాగు, అభివృద్ధి మోతుబరి రైతులు మాత్రమే చేసేవారు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు ఇస్తుండటంతో సన్న, చిన్నకారు రైతులు కూడా పండ్ల తోటలను సాగు చేయగలుగుతున్నారు. ఆ రెండు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. వీరిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో పండ్ల తోటల అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుండటం విశేషం. ఈ జిల్లాల్లో ప్రత్యేకంగా 10 వేల ఎకరాల్లో పండ్ల తోటలు అభివృద్ధి చేస్తున్నారు. కాగా.. పొండి భూములు అధికంగా ఉండే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10 వేల ఎకరాల్లోను, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 11వేల ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి జరుగుతోంది. ఇక ‘లక్ష’ణంగా ఆదాయం! కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కారుమంచి గ్రామానికి చెందిన ఈ రైతు పేరు నర్సిరెడ్డి. ఈయనకు అర ఎకరం పొడి భూమి ఉంది. వర్షాధారంగా పత్తి, మిరప వంటి పంటలు సాగు చేసేవాడు. అన్నీ అనుకూలిస్తే.. ఏటా రూ.15 వేల వరకు ఆదాయం వచ్చేది. వర్షాలు మొహం చాటేస్తే నష్టాలు చవిచూడాల్సి వచ్చేది. 2020 వరకు ఇదే పరిస్థితి. 2021–22లో డ్రైలాండ్ హార్టీకల్చర్ స్కీమ్ కింద డ్రాగన్ ఫ్రూట్ సాగు చేశాడు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సబ్సిడీ ఇచ్చింది. పొలంలో గుంతలు తవ్వడం నుంచి మొక్కల వరకూ పూర్తిగా ప్రభుత్వమే రూ.1.70 లక్షల ఖర్చు భరించింది. తొలి ఏడాది రూ.22 వేలు, రెండో ఏడాది రూ.55 వేల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది రూ.లక్ష దాటుతుందని నర్సిరెడ్డి చెప్పాడు. ఈ పంట సాగువల్ల ఏటా ఆదాయం పెరుగుతూనే ఉంటుందంటున్నాడు. రూ.750 కోట్లతో తోటల అభివృద్ధి పండ్ల తోటల అభివృద్ధికి ఎకరాకు కనిష్టంగా రూ.40 వేల నుంచి గరిష్టంగా రూ.2.44 లక్షల వరకు ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తోంది. ఎకరాకు సగటున రూ.లక్ష వరకూ సబ్సిడీ ఇస్తోంది. 2023–24లో 75 వేల ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి జరుగుతోంది. మామిడి, చీనీ, నిమ్మ, కొబ్బరి, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, తైవాన్ జామ తదితర పండ్ల తోటలతో పాటు పూల తోటలను రైతులు అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా హార్టీకల్చర్ అభివృద్ధికి ఈ ఏడాది రూ.750 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 26 జిల్లాలకు సంబంధించి 64,544 ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధికి అంచనాలు రూపొందించగా.. 63,250 ఎకరాలకు పరిపాలన అనుమతులు లభించాయి. మరోవైపు పండ్ల మొక్కలు నాటే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రెండెకరాల్లో మామిడి సాగు మాకు 2 ఎకరాల పొలం ఉంది. గత ఏడాది వర్షాధారం కింద ఆముదం, సజ్జ, కంది సాగు చేశాం. ఏ పంట వేసినా నష్టం తప్ప లాభం లేదు. ఈ ఏడాది ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో మామిడి మొక్కలు అందించింది. 2 ఎకరాల్లో 140 మామిడి మొక్కలు నాటుకున్నాం. కాపు వచ్చేదాకా 3–4ఏళ్లు అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. ఏ ఖర్చు లేకుండా పండ్ల తోటలు సాగు చేశాం. సంతోషంగా ఉంది. కాపు వస్తే మా బతుకు మారుతుంది. – వై.లక్ష్మీదేవి, ప్యాపిలి, నంద్యాల జిల్లా -
పండ్ల తోటలకు ప్రభుత్వ తోడ్పాటు
ఈ రైతు పేరు ఉడుముల పిచ్చిరెడ్డి. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం రాచకొండ స్వగ్రామం. 2019 వరకు తనకున్న రెండెకరాల్లో మిర్చి, పత్తి లాంటి వాణిజ్య పంటలు సాగు చేసేవాడు. నాటుకునే మొక్కలు మొదలు.. పండ్ల తోట ద్వారా ఫలసాయం వచ్చే దాకా వివిధ రూపాల్లో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని తెలుసుకుని 2020లో తైవాన్ జామ పంట సాగు చేశాడు. మొక్కలు తెచ్చుకోవడానికి ప్రభుత్వమే డబ్బులిచ్చింది. నాటేటప్పుడు గుంతల ఖర్చు, తర్వాత కలుపు తీసేందుకు కూలి డబ్బులు, అవసరమైనప్పుడు నీళ్లకు డబ్బులిచ్చింది. మొక్కలు నాటిన ఏడు నెలల నుంచే ఫలసాయం రావడం మొదలైంది. కాయల కోత ఖర్చులు పోను ఏటా రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల దాకా మిగులుతోంది. గతంలో మిర్చి, పత్తి పంటలు వేసినప్పటి కంటే ఇప్పుడే నికర ఆదాయం వస్తోందని పిచ్చిరెడ్డి ఆనందంగా చెబుతున్నాడు. ఇదే జిల్లా పీసీపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వీరపునేని బాలచెన్నయ్య తన పొలం, తన సోదరుడి పొలం.. మొత్తం రెండెకరాల్లో 2021 జూన్‌లో 800 తైవాన్ జామ మొక్కలు నాటాడు. గుంతలు తీసేందుకు ప్రభుత్వం రూ. 50 వేలు ఆర్థిక సాయం చేసింది. కాపలా, నీటి తడుల కోసం ఇప్పటి దాకా రూ.72 వేలు ఇచ్చింది. ప్రస్తుతం పంట తీరును బట్టి ఎకరాకు రూ.50 వేలకు పైగా నికర ఆదాయం వస్తుందని సంతోషంగా చెబుతున్నాడు. సాక్షి, అమరావతి: మెట్ట భూముల్లో వర్షాధారంగా కంది, పత్తి వంటి పంటలు పండించుకునే రైతులు 1,18,842 మందికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మూడేళ్లుగా పండ్ల తోటల పెంపకానికి పూర్తి స్థాయిలో ఆర్థిక తోడ్పాటును అందజేసింది. మొక్కలు నాటుకోవడానికి గుంతలు తవ్వడం మొదలు.. మొక్కల కొనుగోలు, నాటిన మొక్కలకు నీటి తడుల ఖర్చు, పెంపకంలో అవసరమయ్యే ఎరువు ఖర్చుల వంటిì వాటన్నింటికీ ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ రూపాల్లో ఆర్థిక సహాయం చేసింది. మూడేళ్లలో రైతులకు ఎకరాకు రూ.1,35,141 దాకా లబ్ధి చేకూర్చింది. ప్రభుత్వం అందజేస్తోన్న ఆర్థిక సహాయంతో ఆగస్టు 2019 – 2022 మార్చి మధ్య 1,18,842 మంది రైతులు 1,75,493 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేశారు. ఇందుకోసం ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా దాదాపు రూ.400.28 కోట్లు ఆర్థిక సహాయం అందజేసిందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది కూడా పండ్ల తోటల సాగుకు ముందుకొచ్చే రైతులను గుర్తించే ప్రక్రియ అన్ని జిల్లాల్లో కొనసాగుతుందని చెప్పారు. మూడో వంతు మామిడి సాగే మామిడి, జీడిమామిడి, బత్తాయి, నిమ్మ, జామ, సపోట, కొబ్బరి, దానిమ్మ, రేగు, సీతాఫలం, నేరేడు, ఆయిల్ పామ్, అంజూర వంటి పండ్ల మొక్కల పెంపకానికి ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు ప్రభుత్వం తోడ్పాటు అందజేస్తోంది. పండ్ల తోట సాగు చేసేందుకు ముందుకొచ్చే రైతుకు తొలి ఏడాది రూ.65 వేల దాకా, రెండో ఏడాది మరో రూ.35 వేలు, మూడో ఏడాది రూ.33–34 వేల మధ్య ఆర్థిక తోడ్పాటు అందిస్తుందని అధికారులు వెల్లడించారు. మూడేళ్లుగా ఈ పథకం ద్వారా 33 శాతం మంది రైతులు మామిడి తోటలనే సాగు చేశారని అధికారులు వెల్లడించారు. 2019లో 20,824 ఎకరాల్లో, 2020లో 22,147 ఎకరాల్లో మామిడి తోటలు సాగయ్యాయి. ఏటా రూ.1000 కోట్ల ఆదాయం మామిడి, జీడి, కొబ్బరి పంటలను సాగు చేసుకునే రైతులకు ఏటా ఎకరాకు రెండు లక్షల దాకా నికర ఆదాయం ఉంటుంది. మార్కెట్లో వివిధ రకాల పండ్లకు ఉన్న డిమాండ్ మేరకు పంట తక్కువ వచ్చే ఏడాది కూడా ఎకరాకు లక్ష ఆదాయం గ్యారంటీగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. పండ్ల తోటలు సాగు చేసిన వారిలో దాదాపు మూడో వంతు మంది రైతులు ఏటా నికర ఆదాయం పొందుతున్నారు. వీరి ఆదాయం ఏటా రూ.1,000 కోట్లకు తక్కువ లేదన్నది అంచనా అని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. -
ఉద్యానకేంద్రంగా అన్నమయ్య జిల్లా
అన్నమయ్య జిల్లాలో విస్తారంగా పండ్లతోటలు సాగవుతున్నాయి. మామిడి,చీనీ, అరటి,టమాట,బొప్పొయి, కర్బూజ సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు. పండ్లతోటల పెంపకానికి ఉపాధినిధులు తోడ్పాటు అందిస్తున్నాయి. ఉద్యానకేంద్రంగా జిల్లా విరాజిల్లనుంది. బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా పండ్లతోటలకు కేరాఫ్‌గా మారనుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఉద్యానపంటల సాగుతో ప్రత్యేక గుర్తింపు కూడా దక్కించుకోనుంది. రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో ఉద్యానవన పంటల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఇందులో జిల్లాకు రెండో స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం జిల్లాలో 75,731 హెక్టార్లలో ఉద్యానవన పంటలు సాగులో ఉన్నాయి. ఇందులో మామిడి, టమాట ఒకటి, రెండుస్థానాల్లో ఉండగా అన్ని ఉద్యాన పంటల సాగు సమాహారంగా జిల్లాకు గుర్తింపు వచ్చింది. తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజక వర్గాల్లో టమాట సాగు ప్రథమస్థానంలో ఉంది. మామిడి జిల్లా అంతటా విస్తరించింది. అరటి, పసుపు, బత్తాయి, నిమ్మ తోటలు రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరులో సాగులో ఉన్నాయి. మొత్తమ్మీద అన్ని రకాల పంటలు జిల్లాలో సాగవుతున్నాయి. టమాట కేరాఫ్ తంబళ్లపల్లె టమాట సాగులో తంబళ్లపల్లె నియోజకవర్గానిదే అగ్రస్థానం. దశాబ్దాలుగా దీనిపైనే రైతులు ఆధారపడ్డారు. ప్రత్యామ్నయ పంటలవైపు వెళ్లడం లేదు. తంబళ్లపల్లె తర్వాత మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో టమాట సాగువుతోంది. ఉద్యానవన పంటల్లో ఈ మూడు నియోజకవర్గాల్లో టమాటనే అధికం. రాయచోటి, చిన్నమండెం, గాలివీడు ప్రాంతాల్లో కొద్దిపాటి కనిపిస్తుంది. జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో టమాట సాగు కనిపించదు. ఈ ప్రాంతాల్లో కట్టెలతో టమాటను సాగు చేస్తారు. దిగుబడి ఎలా ఉన్నా వీటి ధరలు నిలకడగా ఎప్పుడూ ఉండవు. అయినప్పటికీ రైతులు దీని సాగును వదలరు. ఇదే పంటతో కోట్లకు పడగలెత్తిన రైతులు లేకపోలేదు. తర్వాత మామిడితోటల పెంపకం ఉంది. పండ్లతోటలకు అందే ఉపాధి సహయం మామిడికి రూ.1,02,756, జీడిమామిడికి రూ.94,019, బత్తాయికి రూ.1,05,521, అసిడ్లైమ్కి రూ.1,41,515, నాటుజామకి రూ.1,41,784, తైవాన్జామకి రూ.2,30,023, సపోటకి రూ.88,255, కొబ్బరికి రూ.88,821, సీతాఫలంకి రూ.1,70,603, దానిమ్మకి రూ.2,48,845, నేరేడుకి రూ.18,124, చింతకి రూ.89,120, ఆపిల్బేర్కి రూ.1,06,962, డ్రాగన్ప్రూట్కి రూ.1,79,626, గులాబీకి రూ.1,92,500, మల్లెకి రూ.1,09,672, మునగకు రూ.1,01,541లు ప్రభుత్వం పూర్తి రాయితీగా అందిస్తోంది. ఈ పండ్లతోటలకు మంజూరైన ఉపాధి నిధుల రాయితీ సొమ్మును పంటల సాగునుబట్టి రెండు, మూడేళ్లపాటు అందించడం జరుగుతుంది. పోలాల్లో గుంతలు తవ్వి, మొక్కలు నాటి, సంరక్షణ, పంటల దిగుబడి వచ్చే వరకు రాయితీని విడతల వారీగా అందిస్తారు. ఇది పండ్ల రైతాంగానికి ఎంతో ప్రయోజనకరం. అరటికి కేరాఫ్ ఇవే జిల్లాలో అత్యధికంగా సాగయ్యే మూడో పంట అరటి. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట, చిట్వేలి, రాజంపేటలో మాత్రమే ఈ పంట సాగు చేస్తున్నారు. బొప్పాయిని పెనగలూరు కలుపుకొని పై ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. ఈ పంటల సాగులో 95శాతం వాటా ఈ ప్రాంతాలదే. పసుపు అక్కడక్కడ సాగవుతోంది. మామిడితోటల పెంపకం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ జరుగుతోంది. రెండోస్థానంలో జిల్లా పండ్లతోటల పెంపకంలో అన్నమయ్య జిల్లా రెండోస్థానంలో ఉండనుంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో సాగులోని ఉద్యానవన పంటల సాగు వివరాలను సేకరిస్తున్నారు. అనంతపురంజిల్లా మొదటిస్థానంలో ఉండే అవకాశం కనిపిస్తోంది. జిల్లాకు రెండవ స్థానం దక్కితే పండ్లతోటలకు నిలయంగా మారినట్టే. దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం అధికంగా ఉంటుంది. –రవీంద్రనాధ్‌రెడ్డి, జిల్లా ఉద్యానవన అధికారి, రాయచోటి ఐదెకరాలలోపు భూమి కలిగిన రైతులకు రాయితీ పండ్లతోటల పెంపకం కోసం ఉపాధి రాయితీని ప్రభుత్వం వర్తింపజేస్తోంది. ఒక మొక్కకు నీరుపోసినందుకు రూ.17, సంరక్షణకు రూ.10 చొప్పున నెలకు రూ.27 చెల్లిస్తాం. జాబ్‌కార్డు, ఐదెకరాలోపు భూమి కలిగిన ప్రతి రైతు రాయితీ పొందడానికి అర్హులు. రైతులు సద్వినియోగం చేసుకొని పండ్లతోటల పెంపకంతో ఆదాయం పొందాలి. ఈ పంటలసాగుతో కొన్నేళ్లపాటు ఆదాయం పొందవచ్చు. –ఎస్.మధుబాబు, డ్వామా ఏపీడీ, ములకలచెరువు -
బీడు భూముల్లోనూ ఉద్యాన సిరులు
కర్నూలు (అగ్రికల్చర్): పండ్ల తోటల సాగులో రాష్ట్ర ప్రభుత్వం విప్లవం తీసుకొస్తోంది. బీడు భూముల్లోనూ ఉద్యాన పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తోంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వంద శాతం సబ్సిడీతో పండ్ల తోటల సాగుకు అవకాశం కల్పిస్తోంది. బావి, బోరు లేకున్నా పండ్ల తోటలు అభివృద్ధి చేసుకునేలా డ్రై ల్యాండ్ హార్టీకల్చర్ పథకం కింద బీడు భూమి సమీపంలోని చెరువు, కుంట, ఫారమ్ పాండ్ నుంచి నీళ్లు తెచ్చి మొక్కలను బతికించుకునే విధంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. కరువు పీడిత జిల్లాల రైతులకు ఈ పథకం వరంగా మారుతోంది. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో చాలామంది రైతులు ఈ విధానం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది లక్ష ఎకరాల్లో పండ్ల తోటలు 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ విధానంపై ఆసక్తి ఉన్న 39,173 మంది రైతులను ఇప్పటివరకు అధికారులు గుర్తించారు. 60,495 ఎకరాల్లో సాగుకు అంచనాలు సిద్ధం చేశారు. వీరిలో 23,747 మంది రైతులకు 38,096 ఎకరాల్లో సాగు చేపట్టేలా ఇప్పటికే అనుమతులు ఇచ్చారు. పండ్ల తోటల అభివృద్ధిలో కర్నూలు జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో ఉంది. ఉపాధి నిధులతో పండ్ల తోటల సాగులో అనంతపురం జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. కృష్ణా జిల్లా అట్టడుగున ఉంది. అనంతపురం జిల్లాలో 15,001 ఎకరాల్లో పండ్ల తోటల సాగు చేపట్టాలనేది లక్ష్యం కాగా.. ఇప్పటికే 15,351 ఎకరాలకు సంబంధించి 5,652 మంది రైతులను గుర్తించడం విశేషం. విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోనూ పండ్ల తోటల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఉపాధి నిధులతో అన్ని రకాల పండ్ల తోటలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. రైతులు పండ్ల మొక్కలను ఎక్కడి నుంచైనా తెచ్చుకుని నాటుకోవచ్చు. వీటికి జిల్లాస్థాయి పర్చేజ్ కమిటీ నిర్ణయించిన ధరలను చెల్లిస్తారు. లేకపోతే ప్రభుత్వం టెండర్ ద్వారా ఎంపిక చేసిన నర్సరీల నుంచి తెచ్చుకోవచ్చు. 26 వేల కి.మీ. పొడవునా అవెన్యూ ప్లాంటేషన్ పండ్ల తోటలను అభివృద్ధి చేస్తూనే.. మరోవైపు పచ్చదనం పెంపుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 26,002 కి.మీ. రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు నిర్ణయించింది. కి.మీ.కు 200 మొక్కల చొప్పున నాటి పచ్చదనం అభివృద్ధికి గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు 15,027 కి.మీ. మేర అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టేందుకు అంచనాలు సిద్ధం చేశారు. ఇందులో ఇప్పటికే 6,600 కి.మీ. మేర మొక్కలు నాటేందుకు పరిపాలన అనుమతులొచ్చాయి. పచ్చదనం తరిగిపోయిన కొండల్లో అటవీ జాతి చెట్లకు సంబంధించి లక్షలాది సీడ్‌బాల్స్‌ను వెదజల్లనున్నారు. కర్నూలు జిల్లాలోనే 10 లక్షల సీడ్‌బాల్స్‌ను వేయనున్నారు. డ్రై ల్యాండ్ హార్టీకల్చర్ రైతుల్ని ఆదుకుంటోంది ఉపాధి హామీ పథకం కింద వంద శాతం సబ్సిడీతో చేపట్టిన డ్రై ల్యాండ్ హార్టీకల్చర్ పథకం రైతులను ఆదుకుంటోంది. ఉపాధి నిధులతో జిల్లాలో 35 వేల ఎకరాల్లో పండ్ల తోటల్ని అభివృద్ధి చేశాం. ఈ ఏడాది జిల్లాలో 8వేల ఎకరాల్లో పండ్ల తోటలు, 2 వేల కిలోమీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్‌కు చర్యలు తీసుకున్నాం. – అమరనాథరెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా, కర్నూలు -
పండ్లతోటల రక్షణకు చర్యలు అవసరం
సాక్షి, అమరావతి: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకు 12,583 హెక్టార్లలో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. 22,738 మంది రైతులు నష్టపోయారు. పది జిల్లాల్లో పండ్లు, కూరగాయలు, పూలతోటలు దెబ్బతిన్నాయి. అరటి, మిర్చి, బొప్పాయి, జామ, బత్తాయి, నిమ్మ తదితర తోటలు ప్రభావితమయ్యాయి. పండ్లతోటల సంరక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలని తాడేపల్లిగూడెంలోని డాక్టర్ వైఎస్సా్ర్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించారు. అన్ని పంటలకు సాధారణ సూచనలు.. ⇔ వీలైనంత త్వరగా చేలల్లో అధికంగా ఉన్న నీటిని తీసివేయాలి. ⇔ పంట ఎదుగుదలకు తోడ్పడేలా బూస్టర్ డోస్ ఎరువులు – నత్రజని, డీఏపీ, జింక్ వంటివి వాడాలి. ⇔ అధిక తేమతో తెగుళ్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నందున పురుగుల నివారణ చర్యలు చేపట్టాలి. ⇔ లేత తోటల్లో చనిపోయిన మొక్కల్ని తీసేసి కొత్తవి నాటాలి. ⇔ వర్షాలు తగ్గగానే వీలైనంత త్వరగా చెట్ల మధ్య దున్నడం వల్ల తేమ త్వరగా ఆరి చెట్లు కోలుకుంటాయి. ⇔ అధిక గాలులకు వేళ్లతో సహా ఒరిగిన చెట్లను నిలబెట్టి మట్టిని ఎగదోసి ఊతమివ్వాలి. అరటి తోటలో.. ⇔ రెండు పిలకలు వదిలేసి విరిగిన చెట్లను నరికేయాలి. చెట్లకు వెదురు కర్రలను పాతి ఊతమివ్వాలి. ⇔ అరటిచెట్లు నాలుగురోజుల కంటే ఎక్కువగా నీళ్లలో ఉంటే కోలుకోవడం కష్టం. కోలుకున్నా ఎదుగుదల, దిగుబడి తక్కువగా ఉంటాయి. ⇔ రెండురోజులు నీటిముంపులో ఉంటే త్వరగా నీళ్లు బయటకుపంపి తోట ఆరేలా చేయాలి. ఒక్కో చెట్టుకు వందగ్రాముల యూరియా, 80 గ్రాముల పొటాష్ వేయాలి. ⇔ మూడునెలల కన్నా తక్కువ వయసు మొక్కలు మూడడుగుల లోతు నీటిలో ఉంటే నేల ఆరిన వెంటనే కొత్త పిలకలు నాటుకోవాలి. ⇔ గొర్రుతో అంతరసేద్యం చేసి యూరియా, మ్యూరేట్ పొటాష్‌ను 20, 25 రోజుల వ్యవధిలో రెండుమూడుసార్లు వేయాలి. ⇔ ఆకులు, గెలలపై పొటాషియం నైట్రేట్‌ను వారం రోజుల వ్యవధిలో మూడునాలుగుసార్లు పిచికారీ చేయాలి. ⇔ సగం తయారైన గెలలను ఎండిన ఆకులతో కప్పి 15 రోజుల్లోగా కోసి అమ్ముకోవాలి. ⇔ దుంపకుళ్లు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడుగ్రాముల్ని లీటర్ నీటికి కలిపి మొక్క చుట్టూ తడిచేలా నేలలో పోయాలి ⇔ సిగటోక ఆకుమచ్చ తెగులును అరికట్టేందుకు ప్రొపికొనజోల్ ఒక మిల్లీలీటరును వారంరోజుల వ్యవధిలో రెండుమూడుసార్లు పిచికారీ చేయాలి. బత్తాయి, నిమ్మ తోటల్లో.. ⇔ వేర్లకు ఎండ తగిలేలా చూడాలి. పడిపోయిన చెట్లను నిలబెట్టే ఏర్పాట్లు చేయాలి. ⇔ విరిగిన కొమ్మల్ని కొట్టేసి పైభాగాన బోర్డో మిశ్రమం పోయాలి. ⇔ ఎనిమిదేళ్లపైబడి కాపు ఇస్తున్న తోటలో చెట్టుకు 500 గ్రాముల యూరియా, 750 గ్రాముల పొటాష్ వేసుకోవాలి. ⇔ చెట్టు మొదళ్ల దగ్గర ఒకశాతం బోర్డో మిశ్రమం లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడుగ్రాములను లీటర్ నీటికి కలిపి పోయాలి. ⇔ తోటలో కాపు ఉంటే 2–4–డి మందు చల్లి పిందె, పండు రాలడాన్ని నివారించుకోవాలి. ⇔ బెంజైల్ ఆడినైన్ పిచికారీ చేస్తే అధిక తేమను నివారించుకోవచ్చు. బొప్పాయి తోటలో.. ⇔ మెటలాక్జిల్ ఎంజెడ్ మూడుగ్రాములు లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడుగ్రాములను నీటికి కలిపి మొదళ్ల దగ్గర పోయాలి. ⇔ ఐదుగ్రాముల సూక్ష్మ పోషకాల మిశ్రమ పిచికారీ చేయాలి. ⇔ కోతకు తయారైన కాయలుంటే తక్షణమే కోసివేయాలి. పండు కుళ్లు నివారణకు హెక్సాకొనజోల్ జిగురు మందు చల్లాలి. జామ తోటలో.. ⇔ అధిక నీటిని తీసేయాలి. గొర్రుతో దున్ని పాదులు చేసి మొదళ్ల దగ్గర కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడుగ్రాముల్ని లీటర్ నీటికి కలిపి పోయాలి. ⇔ కాయకోత అనంతరం వచ్చే ఆంత్రాక్నోస్ తెగులు నివారణకు కార్బండిజం పిచికారీ చేయాలి. ⇔ వడలు తెగులు నివారణకు ట్రైకోడెర్మావిరిడి మిశ్రమాన్ని (30 కిలోల పశువుల ఎరువు, 4 కిలోల వేపపిండి, 500 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి) ఒక్కో చెట్టుకు వేయాలి. ⇔ చౌడుభూమి ఉంటే ఒక్కో చెట్టుకు కిలో జిప్సం వేయాలి. మిరప తోటలో.. ⇔ ఎండుతెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్, మెటాలాక్సిల్, మంకోజెబ్‌ను మొక్కల మొదళ్లలో పోయాలి. ⇔ ఆకుమచ్చ తెగులు నివారణకు కార్బండిజం, మంకోజెబ్ పిచికారీ చేయాలి. ⇔ నేలలో తేమ ఎక్కువగా ఉంటే సాలిసిక్ యాసిడ్ పిచికారీ చేసి మొక్కల్లో నిల్వ ఉండే పోషకాల వినియోగాన్ని పెంపొందించవచ్చు. ⇔ వర్షాలు ఆగిన తర్వాత మూడు 19లు లేదా 13ః0ః45, యూరియా వంటి పోషకాలను చల్లుకోవాలి. -
ఆశావహ సేద్యం!
రసాయనిక వ్యవసాయానికి పెట్టింది పేరైన హర్యానా రాష్ట్రంలో ఆశా వంటి ప్రకృతి వ్యవసాయదారులు అరుదుగా కనిపిస్తారు. ఆశ తన కుటుంబ సభ్యులు, కూలీల సహకారంతో గత పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పండ్ల తోటలు, పంటలు సాగు చేస్తానంటే వాళ్ల ఇంట్లో వాళ్లే ఎగతాళి చేశారు. అయినా, ఆశా వెనకంజ వెయ్యలేదు. జిల్లా కేంద్రం చర్కి–దద్రి జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో పిచొంప కలన్ గ్రామం ఆమెది. 3,200 గడప ఉంటుంది. ఆశా, ఆమె కోడలు జ్యోతితోపాటు ఆ ఊళ్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు చాలా కొద్దిమంది మాత్రమే. వాళ్లకు మూడెకరాల భూమి ఉంది. అందులో నారింజ, నిమ్మ, బత్తాయి చెట్లతో కూడిన పండ్ల తోటను సాగు చేస్తున్నారు. పరస్పరం పోటీ పడని సీజనల్ పంటలను అంతర పంటలుగా సాగు చేయడం ప్రకృతి వ్యవసాయంలో ఓ ముఖ్య సూత్రం. ఆశా ఆ సూత్రాన్ని పాటిస్తున్నారు. పాలకూర, మెంతికూర, శనగలు, సజ్జలు, గోధుమలను కూడా అంతరపంటలుగా సాగు చేస్తూ ఉత్తమ రైతుగా ఆశా పేరు గడించారు. అదే తోటలో సీతాఫలం మొక్కలను కూడా నాటాలని ఆమె అనుకుంటున్నారు. తొలుత రెండేళ్ల పాటు సాధారణ దిగుబడితో పోల్చితే 40 శాతం మేరకే దిగుబడి వచ్చిందని, అయినా మక్కువతో ప్రారంభించిన ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగించి, ఇప్పుడు మంచి దిగుబడులు పొందుతున్నానని ఆశా తెలిపారు. ఏ రోజైనా ఇంటిపనులు చేసుకున్న తర్వాత ఉదయం, సాయంత్రం తోటలోకి వెళ్లి పనులు స్వయంగా చేసుకోవడం ఆశాకు, ఆమె కోడలికి అలవాటు. ప్రతిరోజూ శ్రద్ధగా తోటను గమనించుకుంటూ.. ఎక్కడైనా చీడపీడల జాడ కనిపిస్తే వెంటనే కషాయాలు, ద్రావణాలు పిచికారీ చేసి అదుపు చేయడం ముఖ్యమైన సంగతి అని ఆశ అంటున్నారు. గొయ్యిలో పాతిపెట్టిన మట్టి పాత్రలో పుల్లమజ్జిగ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. చీడపీడలకు దాన్ని నీటిలో కలిపి పిచికారీ చేస్తారు. ఔషధ చెట్ల నుంచి సేకరించిన జిగురుకు నిప్పు అంటించి తోటలో పొగబెట్టడం ద్వారా చీడపీడలను సంప్రదాయ పద్ధతిలో ఆశా పారదోలుతున్నారు. ‘పంటలు పూత దశలో మా బామ్మ ఇలాగే చేసేది’ అంటున్నారామె. ప్రతి రెండు నెలలకోసారి ద్రవ జీవామృతాన్ని తోటకు అందిస్తూ భూసారాన్ని పెంపొందిస్తున్నారు. వర్మీకంపోస్టును సైతం తయారు చేసి పంటలకు వాడుతున్నారు. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని ఎరువులు, పురుగుమందులను తయారు చేసుకుంటున్నారు. బయట ఏవీ కొనడం లేదు. బోరు నీటిని స్ప్రింక్లర్లు, డ్రిప్ ద్వారా పంటలకు అందిస్తున్నారు. ‘ఈ తరహా ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి చాలా తక్కువే. అయితే, కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది’ అంటున్నారు ఆశా కోడలు జ్యోతి. సతత్ సంపద అనే స్వచ్ఛందసంస్థ హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో రైతులకు సుస్థిర వ్యవసాయ పద్ధతులను పరిచయం చేస్తూ ఉంటుంది. ఆశకు ఈ సంస్థ తోడ్పాటునందించింది. సతత్ సంపద డైరెక్టర్ జ్యోతి అవస్థి ఇలా అంటున్నారు.. ‘భూమిలో డీఏపీ, యూరియా వెయ్యకుండా పంటలు ఎలా పండుతాయి? అని రైతులు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. భూమిలో సారం పెరగడానికి రెండేళ్లు పడుతుంది. అందుకే ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టిన తొలి రెండేళ్లలో దిగుబడి తక్కువగా ఉంటుంది. ఎంతో మక్కువతో ప్రారంభించిన ఆశ వంటి రైతులు తట్టుకొని నిలబడగలరు. కానీ, మరీ చిన్న రైతులు దీనికి తట్టుకోలేరు. అందుకే మేం ఈ రైతులతో పనిచేస్తున్నాం. మార్పు నెమ్మదిగా వస్తుంది..’. -
కష్టం.. నష్టం..
లింగాల : వరుస కరువులతో పండ్ల తోటల రైతులు విలవిల్లాడిపోతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. వర్షాలు వస్తాయని నమ్మి సాగు చేసిన పంటలు ఎండిపోవడం చూడలేక రైతులు తలలు తాకట్టు పెట్టి అందిన చోటల్లా అప్పులు చేసి బోరుబావుల తవ్వకాలను చేపడుతున్నారు. పాతాళ గంగను బయటికి తీసైనా పంటలను కాపాడుకోవాలన్న మొండి ధైర్యంతో బోరుబావుల తవ్వకాలను చేపట్టిన రైతులు నిలువునా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రామనూతనపల్లె గ్రామానికి చెందిన రైతు తుమ్మలూరు ఈశ్వరరెడ్డి తనకున్న 35ఎకరాల పొలంలో గత 15ఏళ్ల క్రితం ఊట బావుల సాయంతో పంటలను సాగు చేసేవారు. వ్యవసాయంలో అధునాతన ఒరవడి రావడంతో నాలుగైదు బోరుబావులను 500అడుగుల లోతు తవ్వి పంటలను సాగు చేశాడు. అయితే ప్రతి ఏడాది భూగర్భజలాలు తగ్గుతూ వచ్చాయి. దీనికితోడు బోరుబావులు లోతు తవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. 15 ఏళ్ల నుంచి 125 బోరుబావులను తవ్వించాడు. ఈ ఏడాది అత్యధికంగా 10 బోరుబావులను 1500 అడుగుల లోతు వరకూ తవ్వించాడు. బోరుబావుల తవ్వకానికి ఏకంగా రూ. 22 లక్షలు వెచ్చించాడు. అయినా ప్రయోజనం చేకూరలేదు. 5 బోరుబావుల్లో అరకొరగా భూగర్భజలాలు లభించాయి కానీ తనకున్న 34 వేల అరటి చెట్లకు నీరు సరిపడడంలేదు. మండుతున్న ఎండలకు గెలలు వేసిన అరటి చెట్లు కాయలు పక్వానికి రాకముందే వాలిపోతున్నాయి. ఈ ఏడాది బోరుబావుల తవ్వకానికి రూ. 22లక్షలు, పంటల సాగుకు రూ. 40 లక్షలు వెచ్చించారు. అయినా భూగర్భజలాలు పుష్కలంగా లేకపోవడంతో రూ. 62 లక్షలు నష్టపోవాల్సి వస్తోందని వేదన చెందుతున్నాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయాను.. వర్షం వస్తుందని నమ్మి 35 ఎకరాలలో గత ఏడాది ఏప్రిల్, మే మాసాల్లో అరటి పంటను సాగు చేశాను. ఈ ఏడాది పదునుపాటి వర్షం కూడా కురవలేదు. ఉన్న బోరుబావుల్లో నీరు ఇంకిపోయాయి. ఒక్కో బోరుబావి 1500ల అడుగుల లోతు వరకూ తవ్వించినా నీటి జాడ లేదు. అప్పులు మాత్రమే మిగిలాయి. ఇలాంటి పరిస్థితులలో వ్యవసాయం రైతుల పాలిట భారంగా మారింది. - తుమ్మలూరు ఈశ్వరరెడ్డి, అరటి రైతు, రామనూతనపల్లె