వంటగదిలో క్లీన్ చేయడానికి లేదా శుభ్రంగా ఉంచడానికి మొట్టమొదటగా ఉపయోగించేది నిమ్మకాయలనే. దీనిలోని ఆమ్లత్వం, తాజా సువాసన కారణంగా వీటిని మిరాకిల్ క్లీనర్‌గా పిలుస్తుంటారు. చెప్పాలంటే ఏదైనా చెడు వాసన పోగొట్టేందుకు, క్రిమిసంహారక క్లీనర్‌గానూ నిమ్మకాయాలు బెస్ట్. ఈ నిమ్మకాయలు క్లీనింగ్‌కి, సువాసన కోసం ఉపయోగించినప్పటికీ కిచెన్‌లోని ఈ వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మకాయలతో క్లీన్ చేయకూడదు. నిమ్మకాయలకు దూరంగా ఉంచాల్సిన వంటగది వస్తువులు ఏవంటే..
మార్బుల్, గ్రానైట్ కౌంటర్‌టాప్‌లు: ఇళ్లలోని ఫ్లోర్ ఎక్కువగా మార్బుల్ లేదా గ్రానైట్ రాయిని వినియోగిస్తున్నారు. వీటిని క్లీన్ చేసేందుకు నిమ్మకాయలను ఉపయోగించకూడదు. దీనిలోని అధిక ఆమ్లత్వం కారణంగా నష్టం వాటిల్లుతుందే తప్ప అవి క్లీన్ అవ్వవు. పైగా వాటికి ఉండే సహజ మెరిసే గుణం పోతుంది. వీటిని క్లీన్ చేసేందుకు పీహెచ్ తటస్థ క్లీనర్‌లను ఎంపిక చేసుకుంటే అవి మెరుస్తుంటాయి.
కాస్ట్ ఐరన్ పాన్‌లు: తొందరగా వేడేక్కే బెస్ట్ పాన్‌లు. వీటిని కూడా నిమ్మకాయలతో క్లీన్ చేయకూడదు. ఎందుకంటే దీనిలోని ఆమ్లత్వం తుప్పు పట్టేలా చేస్తుంది. పైగా పాన్‌లపై నూనెకు సంబంధించిన జిగటను నిరోధించే రక్షిత పొరకు నష్టం వాటిల్లేలా చేస్తుంది. వీటిని శుభ్రం చేసేందుకు బ్రష్, వేడి నీటిని ఉపయోగించండి.
కత్తులు వంటి వాటికి..
కత్తులు వంటి పదునైన వస్తువులను క్లీన్ చేసేందుకు నిమ్మకాయను అస్సలు వాడకూడదు. ఇది రియాక్షన్ చెంది ఆక్సీకరణం చేయడంతో కత్తులు తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇది క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ వీటిని శుభ్రపరిచేందుకు ఉపయోగించకపోవడమే మంచిది. ఇలాంటి పదునైన వస్తువులను క్లీన్ చేసేందుకు డిష్ సబ్బును ఉపయోగించండి, క్లీన్ చేసిన వెంటనే తడి లేకుండా ఆరనివ్వాలి. ఇలా చేస్తే వాటి పదును పోదు, ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.
చెక్క పాత్రలు, చెక్క కట్టింగ్ బోర్డులు..
చెక్ పాత్రలు, చెక్ కట్టింగ్ బోర్డులు నిమ్మకాయతో క్లీన్ చేస్తే గనుక..దీనిలోని ఆమ్లత్వం పొడిగా అయిపోయి పగళ్లు తెప్పిస్తుంది. పైగా బ్యాక్టీరియాను ఆశ్రయించేలా చేస్తుంది. వీటిని క్లీన్ చేసేందుకు తేలికపాటి సబ్బును ఉపయోగించండి. మంచిగా ఉండేందుకు నూనె అప్లై చేయండి.
అల్యూమినియం పాత్రలు..
అల్యూమినియం పాత్రలను నిమ్మకాయలతో శుభం చేయడం హానికరం. ఎసిడిటీ వల్ల రంగు మారడం, మెరుపు కోల్పోవడం జరుగుతుంది. అంతేగాదు ఆ పాత్ర ఉపరితలంపై చిన్న రంధ్రాలను కూడా ఏర్పరుస్తుంది. వీటిని క్లీన్ చేసేందుకు డిస్ సోప్ వినియోగించండి. కొత్తగా కనిపించేలా చేసేందుకు స్పాంజ్‌తో క్లీన్ చేయండి.
(చదవండి: ఎర్ర బచ్చలికూరతో అధిక బరువుకి చెక్!)
Comments
Please login to add a commentAdd a comment