వంటిట్లో పనిచేస్తున్నప్పుడూ కొన్ని సమస్యలు తరుచుగా ఎదురవ్వుతుంటాయి. ఓ పట్టాన వాటిని వదిలించుకోవడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా చేపలు, వెల్లుల్లి వంటి వాటిని బాగు చేస్తున్నప్పడూ చేతుల వాసన ఓ పట్టాన వదలదు. ఎంతలా సబుతో రుద్ది కడిగినా వదలదు. అలాగే కూరగాయాలు తరిగే చెక్క, కుళాయిలపై ఉండే మరకలు కూడా అస్సలు వదలవు. అలాంటి సమస్యలకు జస్ట్ నిమ్మకాయతో చెక్‌పెట్టేయొచ్చట. పైగా క్రిములు చేరవు ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..\
- చేపలూ, ఉల్లిపాయ, వెల్లుల్లి.. వంటివి తరిగినప్పుడు వాటి వాసన చేతులకు అంటుకుంటుంది. అప్పుడు టీపొడిని కొద్దిగా రాసుకుని ఐదు నిమిషాలయ్యాక సబ్బుతో కడిగేస్తే చాలు.
- కాయగూరలు తరిగే చెక్కని నిమ్మచెక్కతో రుద్ది కాసేపయ్యాక కడిగేయండి. మరకలు పోతాయి. ఎప్పుడైనా దానిపై మాంసం కోసినా.. నిమ్మచెక్కతో రుద్దితే క్రిములు వృద్ధి చెందకుండా ఉంటాయి
- నిమ్మచెక్కలని సన్నగా తరిగి కాసిని నీళ్లలో వేసి ఆ పాత్రని మైక్రో ఓవెన్‌లో కొన్ని నిమిషాలు ఉంచి తీసేయండి. అలా చేస్తే దుర్వాసనలు తొలగిపోవడంతో పాటూ లోపల పడి ఉన్న పదార్థాలని శుభ్రం చేయడం కూడా తేలికవుతుంది.
- ఫ్రిజ్‌లో ఓ మూలగా నిమ్మచెక్కని పెట్టి చూడండి. అందులోంచి వచ్చే దుర్వాసనలు పోతాయి.
- స్టీలు కుళాయిలపై నీటిమరకలు పడుతుంటాయి. అవి తెల్లగా మారాలంటే వాటిని నిమ్మచెక్కతో రుద్ది కడిగితే చాలు.
- వేపుడు కూరలనగానే నూనె గుర్తొచ్చి భయం వేస్తుంది. కానీ ఇలా చేస్తే నూనె తక్కువగా రుచికరమైన వేపుడు కూరలను ఆస్వాదించవచ్చు.
- బెండకాయ వేపుడులో నూనె తగ్గిస్తే జిగురు అడుగున నల్లగా పట్టేస్తుంటుంది. కాబట్టి అడుగు పట్టకుండా వేగడానికి నూనె ఎక్కువ వేయాల్సి వస్తుంది. బెండకాయ ముక్కల్లో ఒక స్పూన్ పెరుగు లేదా మజ్జిగ లేదా పాలు వేస్తే జిగురు విరిగిపోయి ముక్కలు అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి, తక్కువ నూనెతో చక్కగా వేగుతాయి.
- దొండకాయ వేపుడు చేసేటప్పుడు ధనియాల పొడి వేస్తే నూనె ఎక్కువ వేయాల్సిన పని ఉండదు.
(చదవండి: స్కూల్లో ఏఐ పంతులమ్మ పాఠాలు! అచ్చం ఉపాధ్యాయుడి మాదిరిగా..)
Comments
Please login to add a commentAdd a comment