రసాన్ని లాగేస్తుంది
మాంసాహారులకైనా.. శాకాహారులకైనా.. నిమ్మకాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. పులిహోరలోకైనా, బిర్యానీలోకైనా నిమ్మకాయ లేకుంటే ఎలా..? అలాగే బరువు తగ్గాలనుకునే వారికి ఉదయాన్నే కావలసిన నిమ్మరసంలోకి నిమ్మకాయే లేకపోతే ఎలా..? ఒకటా? రెండా? నిమ్మకాయ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమై పోయింది. దీనివల్ల కలిగే మేలు ఎంతున్నా.. ఓ సమస్య కూడా ఉంది. అదేనండీ.. దాన్ని పిండి, రసం తీయాలంటే మాత్రం కాస్త కష్టమే.
మార్కెట్‌లోకి రసం తీసే ఎన్ని పరికరాలొచ్చినా... కాస్తో కూస్తో రసం అందులో ఉండిపోక తప్పదు. అందుకే ఈసారి నుంచి ‘సిట్రస్ స్ప్రేయర్’ను వాడండి. ముందుగా నిమ్మకాయ తొడిమను తీసి, ఈ స్ప్రేయర్‌ను దాంట్లోకి గుచ్చి, పైనున్న బటన్‌ను ప్రెస్ చేస్తే సరి. నిమ్మరసం కాయలోంచి డెరైక్ట్‌గా మీ సలాడ్‌లోకే వచ్చేస్తుంది. ఇవి వివిధ రంగుల్లో దొరుకుతున్నాయి. ఈ స్ప్రేయర్‌తో ఒక్క నిమ్మరసాన్నే కాదు.. బత్తాయిలాంటి పండ్లరసాలనూ ఏమాత్రం వృథా కాకుండా లాగేయవచ్చు.