న్యూఢిల్లీ: ఒకటి కాదు..రెండు కాదు... ఏకంగా ట్రిపుల్ మ్యూటెంట్ దేశానికి సరికొత్త సవాల్ విసురుతోంది. రోజుకి 3 లక్షలకి చేరువలో కేసులు నమోదై కరోనా ప్రళయ భీకర గర్జన చేస్తున్న వేళ ఈ మూడో అవతారం వెలుగులోకి వచ్చింది. డబుల్ మ్యూటెంట్ అంతర్జాతీయంగా దడ పుట్టిస్తూ ఉంటే ఈ ట్రిపుల్ మ్యూటెంట్ ఎంత విధ్వంసం సృష్టిస్తుందా అన్న భయాందోళనలున్నాయి.
ట్రిపుల్ మ్యూటెంట్ అంటే వైరస్ మూడుసార్లు జన్యు మార్పిడికి లోనవడం. మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మూడుసార్లు జన్యు క్రమాన్ని మార్చుకున్న కరోనా కేసులు బయటపడ్డాయి. మొదట ఈ వైరస్ బెంగాల్‌లో గుర్తించినట్టుగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ శాస్త్రవేత్త వినోద్ స్కారియా తెలిపారు. ‘‘ట్రిపుల్ వేరియెంట్ వాయువేగంతో వ్యాప్తి చెందుతుంది. అత్యధిక మంది దీని బారిన పడతారు’’అని మెక్‌గిల్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మధుకర్ పాయ్ చెప్పారు. ట్రిపుల్ మ్యూటెంట్ కేసుల్ని పూర్తి స్థాయిలో విశ్లేషిస్తే తప్ప ఎంత హానికరమో చెప్పలేమని నిపుణులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment