new challenges
-
భారత్‌కు మరో సవాల్: కరోనా మూడో అవతారం
న్యూఢిల్లీ: ఒకటి కాదు..రెండు కాదు... ఏకంగా ట్రిపుల్ మ్యూటెంట్ దేశానికి సరికొత్త సవాల్ విసురుతోంది. రోజుకి 3 లక్షలకి చేరువలో కేసులు నమోదై కరోనా ప్రళయ భీకర గర్జన చేస్తున్న వేళ ఈ మూడో అవతారం వెలుగులోకి వచ్చింది. డబుల్ మ్యూటెంట్ అంతర్జాతీయంగా దడ పుట్టిస్తూ ఉంటే ఈ ట్రిపుల్ మ్యూటెంట్ ఎంత విధ్వంసం సృష్టిస్తుందా అన్న భయాందోళనలున్నాయి. ట్రిపుల్ మ్యూటెంట్ అంటే వైరస్ మూడుసార్లు జన్యు మార్పిడికి లోనవడం. మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మూడుసార్లు జన్యు క్రమాన్ని మార్చుకున్న కరోనా కేసులు బయటపడ్డాయి. మొదట ఈ వైరస్ బెంగాల్లో గుర్తించినట్టుగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ శాస్త్రవేత్త వినోద్ స్కారియా తెలిపారు. ‘‘ట్రిపుల్ వేరియెంట్ వాయువేగంతో వ్యాప్తి చెందుతుంది. అత్యధిక మంది దీని బారిన పడతారు’’అని మెక్‌గిల్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మధుకర్ పాయ్ చెప్పారు. ట్రిపుల్ మ్యూటెంట్ కేసుల్ని పూర్తి స్థాయిలో విశ్లేషిస్తే తప్ప ఎంత హానికరమో చెప్పలేమని నిపుణులు అంటున్నారు. చదవండి: (డబుల్ మ్యూటెంట్.. పేరు వింటేనే దడపుట్టేస్తోంది!) -
లాక్డౌన్: ఈ చాలెంజ్ ట్రై చేశారా?
లాక్డౌన్ సమయంలో ఇంట్లో బోర్ కొట్టకుండా ఉండేందుకు జనాలు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కాదు. వంటింటి మొహం కూడా చూడనివారు గరిటె పడుతుండగా, అందాన్ని నిగారింపు చేసేందుకు దొరికిన సమయాన్ని కాస్తా కొత్త కొత్త టిప్స్‌తో సద్వినియోగం చేసుకుంటున్నారు. వీలు దొరికితే పజిల్స్ అంటూ, కొత్త ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ కాలాన్ని గడిపేస్తున్నారు. తాజాగా సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మరో కొత్త ఛాలెంజ్ వచ్చింది. అదే గమ్చా చాలెంజ్. నెటిజన్లు అధికంగా ఇష్టపడుతున్న ఈ చాలెంజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. (కరోనా ఎఫెక్ట్; వీడియో కాల్‌తో విషెస్) ఎప్పుడూ నెట్టింట్లో గడుపుతూ ఉండేవారికి ఈపాటికే దీనిగురించి తెలిసే ఉంటుంది. గమ్చా అంటే హిందీలో టవల్ లేదా వస్త్రం అని అర్థం. దీని సహాయంతో ముఖాన్ని కప్పుకోవాలి. అది కూడా ఊడిపోకుండా పర్ఫెక్టుగా కట్టుకోవాలి. ఈ క్రమంలో కళ్లు మాత్రమే కనిపించాలి కానీ, ముక్కు కొంచెం కూడా కన్పించకూడదు. అలా ముఖాన్ని రుమాలుతో కట్టుకుని ఫొటో దిగాలి. అనంతరం దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఉదాహరణకు కింద ఫొటోలు చూసేయండి. నచ్చితే ఓ సారి ట్రై చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్‌కు కూడా ఈ చాలెంజ్ విసరడం మర్చిపోకండి. (ఎక్కడా చోటు లేదని ఇక్కడ దాక్కున్నావా..) View this post on Instagram Can anyone define ... What is Gamchha??? So answer is :- Gamchha is youngest sister of bath towels 😂😉 ... ये सुपरहिट innovative definition मिली आज बनारस से ... हमारे पापा जी से...😁😂😉 ... वो क्या है कि मेरे सारे सवाल पहले घर पर पहुँचते है उसके बाद ज़वाब मिलते हैं ... और उन जवाबों की analysis सहित synopsis तैयार होती है... और फ़िर उसपर theory के theorum😁... अजी वो क्या है कि ... गमछा हम बनारसियों के कंधों पर ज़रूर मिलेगा... अब तो अधिकारिक रूप से ... mask की जगह गमछा के इस्तेमाल पर मंज़ूरी मिल गयी है... यानि UP में mask की हाय तौबा भीड़ से थोड़ी राहत divert होगी गमछे की दुकानों पर... जब भी दुकान खुलेगी... लेक़िन एक बात और बता दे नैना के बनारस से बँगाल के #Safarnama में ... #GamchhaSaree भी आती है बँगाल में...😂 तो ज़नाब इतना समझ लें... हमारे बनारसी अंदाज़ को दूसरा प्रदेश क्या दूसरा देश भी अपनाता है...(बांग्लादेश saree) * Disclaimer :- इन परिस्थितियों में सिर्फ़ मुँह बनाकर रहने से बेहतर है सचेत सहज और सकुशल रहे #GamchhaChallenge #NainaBanarasi #Safarnama A post shared by नैना बनारसी (@naina_banarasi) on Apr 11, 2020 at 9:12am PDT View this post on Instagram #gamchhachallenge A post shared by Sandeep Modi (@modi7672) on Apr 12, 2020 at 4:38am PDT View this post on Instagram #gamchhachallenge A post shared by MJ MANISH JHA (@mjmanishj) on Apr 11, 2020 at 8:24am PDT View this post on Instagram #gamchhachallenge #maskindia #qurantine #qurantinelife #stayhome #2020 #instadaily #instagram A post shared by shweta singh (@shweta1238) on Apr 15, 2020 at 7:35am PDT -
దమ్ముంటే ఇలా మూత తీయండి..!
-
దమ్ముంటే ఇలా బాటిల్ మూత తీయండి..
మొన్న ఐస్ బకెట్, నిన్న కికి చాలెంజ్... నేడు బాటిల్ క్యాప్ చాలెంజ్. సామాజిక మాధ్యమాల్లో కొత్త చాలెంజ్ రావడానికి ఎంత సమయం పడుతుందో కానీ అది ట్రెండ్ అవడానికి అర క్షణం చాలు..! ఇంటర్నెట్లో ప్రస్తుతం బాటిల్ క్యాప్ చాలెంజ్ హవా నడుస్తోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ దీని వెంటపడుతున్నారు. ఇది హాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ఎందరో నటులు ఈ చాలెంజ్‌కు సై అంటూ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. ప్రస్తుతం గల్లీబాయ్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సిద్ధాంత్ చతుర్వేది ఈ సవాలును స్వీకరించి దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన మొదటి బాలీవుడ్ నటుడిగా నిలిచారు. ఇక యూట్యూబ్ స్టార్ భువన్ బామ్ కూడా తనదైన స్టైల్లో కాసింత హాస్యాన్ని జోడించి మరీ బాటిల్ క్యాప్ తీశాడు. స్లో మోషన్లో ఉన్న ఈ వీడియోలో భువన్ కాలితో తన్నకుండా చివర్లో నోటితో తీస్తాడు. భువన్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసిన ఈ వీడియో నవ్వుల్ని పూయిస్తోంది. ‘నీలా ఎవరూ చేయలేరు.. నీకు నువ్వే సాటి’ అంటూ బాలీవుడ్ నటులు జాన్వీకపూర్-ఇషాన్ ఖట్టర్, సిద్ధాంత్లు ప్రశంసలు కురిపించారు. భువన్. బాటిల్ క్యాప్ చాలెంజ్ పూర్తి చేయాలంటూ హార్దిక్ పాండ్యా, విక్కీ కౌశల్, అమాండసెర్నీలకు ట్యాగ్ చేశారు. ‘బాటిల్ క్యాప్ చాలెంజ్’లో బాటిల్ మూతను ముందుగానే కాస్త వదులు చేసి ఉంచుతారు. ఆ తర్వాత కాలితో తన్ని బాటిల్ మూతను తీయాలి.. అదీ బాటిల్ కిందపడకుండా! బాలీవుడ్లో మొదటగా ఈ చాలెంజ్‌లో పాల్గొన్న సిద్ధాంత్ దాన్ని పూర్తి చేయడమే కాక నటుడు ఇషాన్ ఖట్టర్‌కు సవాలు విసిరాడు.మరోవైపు హాలీవుడ్ నటుడు జేసన్ స్టాథమ్‌ను స్ఫూర్తిగా తీసుకుని అక్షయ్ కుమార్ సైతం ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు. అక్షయ్ ఒక్క తన్నుతో బాటిల్ మూతను గాలిలో గింగిరాలు తిప్పి తన ఫిట్నెస్ను నిరూపించుకున్నారు. మరో నటుడు టైగర్ ష్రాఫ్ కొంచెం కొత్తగా ట్రై చేద్దామనుకున్నాడో ఏమో! ఏకంగా కళ్లకు గంతలు కట్టుకుని మరీ చాలెంజ్‌ను పూర్తి చేశాడు. టైగర్ చేసిన ఈ వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే! -
చెయ్‌రా ఛాలెంజ్
ఐస్‌ని నెత్తిమీద వేసుకోగలవా? (ఐస్ బకెట్) డ్రైవ్ చేస్తూ డ్యాన్స్ చేయగలవా? (కీకీ) నీ ఫొటో చూపించగలవా? (అప్పుడు–ఇప్పుడు) సవాల్‌ని స్వీకరిస్తాం. నెట్లో పెట్టేస్తాం. అయితే లైఫ్‌లో తీసుకోవలసిన చాలెంజెస్..వేరే ఉన్నాయని యూత్ అంటోంది. ఆడవాళ్లకు గౌరవం ఇవ్వగలవా? చాలెంజ్! లైంగిక దాడుల్ని నిరోధించగలవా? చాలెంజ్! నెట్లో పోర్నోగ్రఫీని ఆపగలవా? చాలెంజ్! ఇలాంటి చాలెంజ్‌లు మొదలవ్వాలి. సమాజానికి పట్టిన చీడపీడల్ని వదిలించాలి. జస్సికాలాల్.. గుర్తుండే ఉంటుంది. మోడల్. ఢిల్లీలో.. ఒక సోషలైట్స్ పార్టీలో బార్మెయిడ్గా డ్రింక్ సర్వ్ చేస్తూ టైమ్ అయిపోయిందని.. డ్రింక్స్ క్లోజ్ చేయసాగింది. అప్పటికి టైమ్ రాత్రి.. రెండు గంటలు. హర్యానా ఎంపీ (అప్పటి) వినోద్ శర్మ కొడుకు సిద్ధార్థ వశిష్ట్ ఉరఫ్ మనూ శర్మ వచ్చి ఒక డ్రింక్ ఇవ్వమని అడిగాడు ఆమెను. ‘‘సారీ.. టైమ్ అయిపోయింది’’ అని చాలా పొలైట్‌గా ఆన్సర్ చేసింది. ఆ సమాధానాన్ని లెక్క చేయకుండా డ్రింక్ కోసం పట్టుబట్టాడు. జెస్సికా చాలా మర్యాదగా కుదరదని చెప్పింది. అతని అహం దెబ్బతిన్నది.. తుపాకీ తీసి పేల్చాడు. ఆమె చనిపోయింది. 1999 నాటి సంగతి ఇది. మనుశర్మ కోరుకున్న మద్యం ఖరీదు.. జెస్సికా ప్రాణం!అందుకే ‘నో వన్ కిల్డ్ జెస్సికా’ సినిమాలో జెస్సికా అక్క సబ్రీనా పాత్రధారణి అంటుంది ‘‘ఈ దేశంలో ఆడపిల్ల ప్రాణం లిక్కర్ కంటే చీప్’’ అని. ఒక్క మద్యానికే కాదు.. ఈ దేశంలో ఆడపిల్లలు చదువుకోవాలనుకున్నా చావును ఆహ్వానించాల్సిందే. కనీసం సదుపాయాలు కావాలనుకున్నా అమ్మాయిలు తమ మానప్రాణాలను మూల్యంగా చెల్లించాల్సిందే! దీనికి ఉదాహరణ.. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్ గ్రామంలో ముగ్గురు అమ్మాయిల మీద జరిగిన లైంగిక దాడి, హత్యలే! బస్సు సౌకర్యలేమికి వాళ్ల జీవితాలు బలి! ఇలాంటివి జరిగినప్పుడే గజిని సినిమాలోని.. ‘‘ఒరేయ్ ఇప్పుడిప్పుడే మేం గడపదాటి బయటకు వస్తున్నాం రా.. ఇలాంటి వాటితో మళ్లీ మమ్మల్ని వంటిళ్లకే పరిమితం చేయకండిరా’’ అనే డైలాగ్ గుర్తొస్తుంటుంది. అంతేనా? దేశంలో ఏ మూలన పురుషాహంకారం దాడికి తెగబడినా అమ్మాయిలు వేసుకుంటున్న ఆధునిక దుస్తులను, నడతను తప్పుబడుతున్న ‘సంస్కృతి– సంప్రదాయం– సంస్కారం’ కాలర్ పుచ్చుకొని నిలదీయాలనిపిస్తుంది.. వరంగల్‌లో జరిగిన తొమ్మిది నెలల పసిబిడ్డ రేప్, హత్య గురించి! దేశంలో మంచినీళ్లుండవ్.. మద్యానికి మాత్రం భరోసా! కనీస సౌకర్యాలుండవ్.. ఫ్రీగా వైఫై దొరుకుతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కన్నా.. సారా దుకాణాలు ఎక్కువ. అంబులెన్స్‌ల కన్నా ఫ్రీ ఇంటర్నెట్ సెంటర్స్ అందుబాటులో ఉంటాయి. రిటైర్డ్ పర్సన్స్ మొదలు.. ఏడో తరగతి చదివే పిల్లల దాకా.. అందరికీ పోర్న్ కనిపిస్తుంది. వీటన్నిటి ప్రభావం ఎవరి మీద? పిల్లల మీద.. ఆడవాళ్ల మీద! వంద శాతం అక్షరాస్యత, సెక్స్ ఎడ్యుకేషన్, చైతన్యం ఉన్న దేశాలే సోషల్ మీడియా మీద ఆంక్షలు విధించాయి. ఫిల్టర్స్ పెట్టాయి. అవేవీ లేని మనం మాత్రం బార్లా తలుపులు తెరిచాం. పర్యవసానాలను అనుభవిస్తున్నాం. ∙∙ ‘‘వయసులో ఉన్నప్పుడూ çకుదురుగా పనిచేసి.. ఇంటి బాధ్యతలు తీసుకున్నది ఎన్నడూ లేదు. ఇప్పుడైతే పని ఊసే లేదు. తాగడం.. నన్ను ఇబ్బంది పెట్టడ్డం. ఈ మధ్య ఫోన్లో ఏవేవో రోత వీడియోలు ఆయన చూడ్డమే కాక.. నాకూ చూపిస్తున్నాడు. అలా చేయమని బలవంతపెడ్తున్నాడు. చేయకపోతే కొడ్తున్నాడు మేడం’’ అంటూ తను డొమెస్టిక్ హెల్పర్‌గా ఉన్న యజమానికి చెప్పి ఏడ్చింది యాభై రెండేళ్ల సావిత్రి. పోర్న్ చూస్తున్నాడని అర్థమైంది ఆ యజమానికి. ఆ రోజే సాయంకాలం ఈ యజమానికి ఆ సర్వెంట్ మెయిడ్ ఆదరాబాదరాగా ఫోన్ చేసింది..‘‘మేడం.. మా ఆయన... మా పక్కింటోళ్ల పదేళ్ల పిల్ల మీద చెయ్యేశాడట మేడం. పంచాయితీ పెట్టారు వాళ్లు. మా ఆయన మీద నేనే పోలీస్ కంప్లయింట్ ఇద్దామనుకుంటున్నా. సాయం చేయండి మేడం’’ రిక్వెస్ట్ చేసింది ఏడుస్తూనే! ఇంకోచోట..! బాగా సంపన్నుల కుటుంబం. వాళ్లకు ముగ్గురు పిల్లలు. తల్లిదండ్రులిద్దరూ బిజీ. పిల్లలకు అన్ని సౌకర్యాలూ ఇచ్చారు.. స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్ సహా. ఆఖరి పిల్లాడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. వాడికి వాట్సాప్‌కు రోజూ రేప్ వీడియోలు వస్తున్నాయి. వాటిని చూడ్డం వాడికి అలవాటుగా మారింది. ఒకరోజు స్కూల్లో మ్యాథ్స్ టీచర్‌ను ఎక్కడో టచ్ చేశాడట. పెద్ద గొడవ. హైదరాబాద్‌లోనే.. బాగా చదువుకున్న ఉమ్మడి కుటుంబంలోనే.. మంచి ఉద్యోగంలో ఉన్న నడివయసు వ్యక్తి.. తన తమ్ముడి ఏడేళ్ల కొడుకును ప్రతిరోజూ అబ్యూజ్ చేస్తున్నాడు. ఆ వ్యక్తిని చూస్తూనే ఆ పిల్లాడు భయంతో వణికిపోయే పరిస్థితి. çపరేషాన్ అయిన తల్లి... అనునయించి అడిగితే పిల్లాడు ఆ తల్లి గుండె పగిలే నిజం చెప్పాడు. ఒక ఊళ్లో..! చదువుకున్న యువకుడే. పద్నాలుగేళ్ల పిల్లను వేధించడం మొదలుపెట్టాడు. పెద్దవాళ్లకు చెబితే తననే తప్పుపడ్తారేమో.. స్కూల్ మాన్పించి ఇంట్లో కూర్చో పెడ్తారేమోనని ఎవరికీ చెప్పకుండా మౌనంగా సహించసాగింది. ఆ వేధింపులు బ్లాక్‌మెయిల్‌గా కూడా మారేసరికి తట్టుకోలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పైన ఉదాహరణలన్నీ వాస్తవాలే. చదువు.. చదువులేకపోవడం, ఉన్నత కుటుంబం, దిగువ తరగతి, పల్లె, పట్నం.. తేడా లేకుండా! ఒకవైపు సెక్స్ అనే పదాన్ని వినడం..ఉచ్ఛరించడమే పాపంగా పరిగణిస్తూ.. ఇంకోవైపు పోర్న్‌ను ఫోన్ దగ్గర్లో పెట్టే హిపొక్రసీ కల్చర్ వల్లే ఇలాంటి విపరీతాలు.. హాజీపూర్, వరంగల్ వంటి నేరాలు అంటున్నారు మానసిక, సామాజిక విశ్లేషకులు. ఈ ఘోరాలు జరిగినప్పుడల్లా క్యాండిల్‌లైట్ మార్చ్‌లు, సదస్సులు, రేపిస్ట్‌లను ఉరితీయాలనే సోషల్ మీడియా ప్రచారాలు సర్వసాధారణం. ఉరితో సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? మూలాన్ని వదిలి పైపైన పూత పూస్తే రోగం తగ్గదు. హిపోక్రసీ వదలాలి. ఆడ, మగ అనాటమీ గురించి తెలియాలి ఇద్దరికీ. సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి. చాలెంజ్‌లు ఐస్ బకెట్, కీకీ, పదేళ్ల కిందట.. ఇప్పుడు అంటూ పాత, లేటెస్ట్ ఫొటోల పోస్టింగ్ వంటి చాలెంజ్‌లు ప్రపంచంలో ఏ కొసన స్టార్ట్ అయినా.. క్షణాల్లో వాటిని ఓన్ చేసుకొని ఎంతో భక్తితో ఆ చాలెంజెస్‌లో భాగమయ్యే సోషల్ మీడియా పార్టిసిపేంట్స్, ఎక్కడ ఏ చిన్న క్లూ దొరికినా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పదేపదే టెలికాస్ట్ చేస్తూ సెన్సేషన్‌ను క్రియేట్ చేసే మీడియా, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు యూత్.. జెండర్ సెన్సిటివిటీ మీద చాలెంజ్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ప్రతి ఇంట్లో.. ప్రతి ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూషన్, ప్రతి ఊరు.. ప్రతి పట్టణంలో ఆడవాళ్ల పట్ల గౌరవంగా, పిల్లల హక్కుల పట్ల ఎరుకతో ఉండే చాలెంజ్‌ను ఎందుకు స్వీకరించకూడదు? ఇలాంటి కదలిక వస్తే బాగుంటుంది కదా.. అనేది యూత్ అభిప్రాయం. మొక్కుబడిగా చట్టాలు చేసి చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి ఇలాంటి చాలెంజెసే కరెక్ట్ అంటున్నారు పెద్దవాళ్లు. ఎమర్జెన్సీ ప్రకటించాలి రోజురోజుకి ఈ ఘోరాలు పెరిగిపోతున్నాయి. తొమ్మిదినెలల పాపను కూడా వదిలిపెట్టలేదంటే.. చైల్డ్ అండ్ విమెన్ సేఫ్టీ ఎమర్జెన్సీ ప్రకటించాలి. దీన్నొక మూవ్‌మెంట్‌గా మొదలుపెట్టాలి. అయితే ఈ చాలెంజ్‌లో ముందు గవర్నమెంట్‌నే ఇన్వాల్వ్ చేయాలి. అది లిక్కర్, పోర్న్ బ్యాన్తోనే స్టార్ట్ అవ్వాలి. – సి. ప్రియాంక, ఉద్యోగిని, హైదరాబాద్ అనాటమీ తెలియదు మన దగ్గర చాలా మందికి.. అంతెందుకు మా సర్కిల్లోనే చాలా మందికి బాయ్ అండ్ గర్ల్ అనాటమీ తెలియని వాళ్లు బోలెడు. ఇప్పుడు జరుగుతున్న చాలా రేప్‌లకు ఇదీ ఒక కారణం. అంటే సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం. అఫ్కోర్స్ లిక్కర్, పోర్న్ నెక్స్ట్ ప్లేస్‌లో ఉంటాయి. అర్జెంట్‌గా జెండర్ సెన్సిటివిటీని చాలెంజ్‌గా స్టార్ట్ చేయాలి. – ఎస్. కౌశిక్, స్టూడెంట్, బోధన్ చైల్డ్ అండ్ విమెన్ సేఫ్టీ ఎమర్జెన్సీ -
రాజ్యవర్ధన్ నయా ఛాలెంజ్
న్యూఢిల్లీ: గతంలో క్రీడాకారులు, బాలీవుడ్ తారలకు ఫిట్నెస్ చాలెంజ్ విసిరిన కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తాజాగా మరో సవాల్‌కు శ్రీకారం చుట్టారు. బుధవారం పుణేలో ‘ఖేలో ఇండియా’ క్రీడాపోటీలను ప్రారంభించిన ఆయన #5MinuteAur పేరుతో చేసిన కొత్త చాలెంజ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆయన రెండు చేతులతోనూ టేబుల్ టెన్నిస్ ఆడుతూ కనిపించారు. ‘చిన్నప్పుడు మనం హోమ్‌వర్క్ చేసుకోకుండా ఆడుకుంటూ ఉంటే అమ్మ మనల్ని వారించేది. వచ్చి హోమ్‌వర్క్ చేసుకోవాలని హెచ్చరించేది. అప్పుడు మనం ‘ఇంకో ఐదు నిమిషాలే’ అని అనే ఉంటాం. ఈ అనుభవం దాదాపు అందరికీ ఎదురయ్యే ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ ఐదు నిమిషాల పాటు క్రీడల గురించి ఆలోచించండి. ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉంటే పంచుకోండి’ అంటూ ఈ వీడియో సందేశాన్ని ఆయన వినిపించారు. ఈ చాలెంజ్ ప్రాముఖ్యాన్ని చెబుతూ భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, బాలీవుడ్ నటి దీపికా పదుకోన్‌ను ట్యాగ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. క్రీడా అభివృద్ధికి మంత్రి చేస్తున్న కృషి పట్ల నెటిజన్లు ఫిదా అవుతూ.. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. Bas #5MinuteAur-haven't v all asked fr it-in playgrounds,exam halls or on the phone? Let's b the voice of our young athletes & say it loud- #5MinuteAur #KheloIndia Aur Khelenge Toh Aur Jitenge! Share ur story of #5MinuteAur @imVkohli @NSaina @deepikapadukone @BeingSalmanKhan pic.twitter.com/dg91JfzN7z — Rajyavardhan Rathore (@Ra_THORe) 9 January 2019 -
కోహ్లి మరో కొత్త చాలెంజ్‌కు స్వీకారం..
-
ఇక లక్ష్యం సొంత గడ్డే!
సాక్షి నాలెడ్జ్ సెంటర్: దాదాపు తుడిచిపెట్టే దశకు చేరుకున్న ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)తో కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాక్‌లో తమ ప్రధానకేంద్రం మోసుల్‌ను చేజార్చుకోవడం, తాజాగా సిరియాలోని రఖాలో ఓటమి అంచుల్లో నిలవడంతోనే ఐసిస్ కథ ముగిసిందని భావించే పరిస్థితి లేదు. ఐసిస్ తరఫున ఇరాక్, సిరియా, ఆఫ్గానిస్తాన్‌లలో పోరాడేందుకు వెళ్లిన వివిధ దేశాల్లోని సానుభూతిపరులు తమ దేశాలకు మరలడం మొదలుపెట్టారు. ఇక తమ యుద్ధాన్ని సొంత గడ్డపైనే కొనసాగించేందుకు తిరిగి వెళ్లాలంటూ వారిని ఐసిస్ ఆదేశించినట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సైద్ధాంతికంగా ఐసిస్ భావజాలంతో పాటు ఉగ్రశిక్షణ పొందిన వీరి వల్ల భారత్‌లోనూ దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉందని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. కేరళ నుంచి ఐసిస్ సానుభూతిపరులను రిక్రూట్ చేస్తున్న ‘హమ్సా తాలిబన్’ హమ్జా థలసెర్రీ, ఉగ్రమూకలతో సంబంధాలున్న మహ్మద్ మనాఫ్‌ను గురువారం కేరళలోని కన్నూరులో పోలీసులు అరెస్ట్‌చేశారు. ఐసిస్ సానుభూతిపరులన్న అనుమానంతో బుధవారం అదే రాష్ట్రంలో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికలకు ముందు దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారన్న ఆరోపణలతో గుజరాత్లో మరో ఇద్దరిని అరెస్ట్‌చేశారు. ఐసిస్ కోసం పనిచేసి తిరిగొస్తున్న సానుభూతిపరులపై పర్యవేక్షణ ఉండాలని ఇంటెలిజెన్స్బ్యూరో హెచ్చరిస్తోంది. విమానాశ్ర యాలు, పోర్టులతో పాటు సరిహద్దులపై గట్టి నిఘా ఉంచాలని సూచించింది. విదేశాల నుంచి నిధులు.... గతంలో తాలిబన్ నాయకుడికి వంటవాడిగా పనిచేసిన హమ్జా తరువాత ఐసిస్ వైపు ఆకర్షితుడయ్యాడు. అతను 40 మంది యువకులను ఐసిస్ కోసం నియమించుకుని సిరియా, యెమెన్, ఆఫ్గానిస్తాన్‌లకు పంపినట్లు తెలిసింది. సౌదీ అరేబియా, ఒమన్‌ల నుంచి నిధులు అందుతున్నట్లు పోలీసుల విచారణలో హమ్జా వెల్లడించాడు. హమ్జా భారత్‌కు తిరిగి వచ్చాక నిఘా సంస్థలు అతనిపై అయిదు నెలల పాటు నిఘా ఉంచి పట్టుకున్నాయి. రెండు పాస్‌పోర్టులు కలిగి ఉండటంతో పాటు, వివిధ దేశాలు చుట్టి వచ్చిన హమ్జా.. కేరళతో పాటు పశ్చిమ ఆసియా దేశాల నుంచి పలువురిని ఐసిస్ కోసం నియమించుకున్నట్లు భావిస్తున్నారు. దక్షిణాదిలో ఆపరేషన్ ? కేరళలో పట్టుబడినవారిని విచారిస్తున్న సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రసిద్ధ ప్రదేశాలు, ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రణాళికలను రచిస్తున్నట్లు బయటపడింది. పేలుడు పదార్థాల సేకరణలో నిమగ్నమైనట్లు బుధవారం పట్టుకున్న ముగ్గురు వెల్లడించినట్లు పోలీసువర్గాలు వెల్లడించాయి. ఈ ముగ్గురు సిరియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడటంతో టర్కీ అధికారులు భారత్‌కు పంపారు. ఎవరెవరు విదేశాలకు వెళుతున్నారు, వారక్కడ ఏమి చేస్తున్నారు, తిరిగి వచ్చాక ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే దానిపై పోలీసుల వద్ద సమాచారం కొరవడింది. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్న అమెరికా, బ్రిటన్,ఫ్రాన్స్, టర్కీ,యూఏఈ, ఇరాన్, సౌదీలతో కలసి పనిచేస్తూ, ఆయా దేశాల నుంచి భారత్ వస్తున్న అనుమానితుల వివరాలను సేకరించాల్సి ఉంది. -
ఒక్కో నేరం ఒక్కో తీరు!
=ఆర్థిక మోసాల నామ సంవత్సరం =గంజాయితో గుప్పుమన్న గ్రామీణ జిల్లా =కొత్త సవాల్ నకిలీ కరెన్సీ =కలవరపరిచే రీతిలో హత్యలు నిర్దాక్షిణ్యంగా పీక నరికేయడం...కత్తితో పొట్టను తూట్లుతూట్లుగా పొడవడం...కసాయిహత్యలకు ఆనవాళ్లు. ఇప్పుడివి విశాఖ జిల్లాలో నిత్యకృత్యమైపోతున్నాయి. జల్సాలకు అలవాటుపడో..అడ్డదార్లో ఆస్తులు సంపాదించేయాలనో...లేదా పాత కక్షలతోనో కిరాతక హత్యలు చేసేవాళ్ల సంఖ్య రానురాను ఎక్కువైపోతుండడంతో 2013 భీతి గొలిపింది. ఇదంతా ఒకెత్తయితే... తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ ఆశచూపి అనేక ఫైనాన్స్ కంపెనీలు ఈ ఏడాదిలోనే జిల్లాలో రూ.925 కోట్లకుపైగా వసూలుచేసి అడ్డంగా బోర్డులు తిప్పేసి జనానికి టోపీ పెట్టాయి. ఇది కాక అడ్డదార్లో సంపాదించాలనుకునే అక్రమార్కులు గ్రామీణ జిల్లాను అక్రమ గంజాయి రవాణాకు అడ్డంగా వాడుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పేరు వినిపించింది. ఈ ఏడాది గంజాయి రవాణా రూ.100 కోట్లు దాటిపోయి పోలీసు శాఖకే సవాల్ విసిరింది. మరోపక్క నకిలీ కరెన్సీ చాపకింద నీరులా జిల్లా అంతటా విస్తరిస్తోంది. అవతారం ఎత్తడం.... ఇలా రకరకాల నేరాలతో విశాఖ ఉలిక్కిపడుతూనే ఉంది. ఈ నేరాల చిట్టా విప్పితే...ఇదిగో ఇలా ఉంది...! రూ.925 కోట్లకుపైగా ఫైనాన్స్ కంపెనీల కుచ్చుటోపీ గడచిన ఏడాదంతా విశాఖకు ‘ఆర్థిక మోసాల నామ సంవత్సరమే’. తక్కువ పెట్టుబడితో ఎక్కువ వడ్డీ ఆశ చూపి వేలాదిమందిని పదుల సంఖ్యలో ఫైనాన్స్ కంపెనీలు నిట్టునిలువునా ముంచేశాయి. సిమ్స్, సురక్ష ఇన్ఫ్రా (5 కోట్లు),స్పార్క్, స్నేహ, సిద్ధివినాయక, రాగా, కోమలి, మేజిక్, తిరుగుణ, కనకగ్రూప్ తదితర ఫైనాన్స్ కంపెనీలు రాత్రికిరాత్రే బిచాణా ఎత్తేయడంతో జిల్లాలో రూ.925 కోట్లకుపైగా ఆర్థికమోసం జరిగింది. వీటిలో ఒక్క సిమ్స్ సంస్థే రూ.321 కోట్లకుపైగా డిపాజిట్‌దారులను మోసం చేయడం అత్యంత సంచలనాత్మకంగా మారింది. ఇదికాక అసలైన డిపాజిట్దారులకే రూ.100కోట్లకుపైగా చెల్లించకుండా ఫైనాన్స్ శుభకార్యాలు,పైచదువుల కోసం డబ్బుదాచుకున్న వేలాదిమంది ఆశలను అడియాసలు చేసి రోడ్డునపడేశాయి. అదేవిధంగా గుడ్‌లక్ ఎంటర్ప్రైజెస్ ఆన్‌లైన్‌ట్రేడింగ్ పేరుతో రూ.6 కోట్లు, కనకగ్రూప్ రూ.5కోట్లు చొప్పున వసూలు చేసి బిచాణా ఎత్తేశాయి. మోసం జరిగిన నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు బాధితులకు కనీసం న్యాయం జరగలేదు. గుప్పుమన్న గంజాయి రూ.100 కోట్లకుపైనే జిల్లాలో గంజాయి వ్యాపారం గుప్పుమంటోంది. ఈ ఏడాదంతా అక్రమ రవాణాతో జిల్లా పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఒకప్పుడు పాడేరు, అరకు, చింతపల్లి తదిత ర ప్రాంతాల నుంచి అడపాదడపా రవాణా అయ్యే గంజాయి ఇప్పుడు కొత్తపద్ధతిలో దారి మళ్లుతోంది. అధికంగా రోలుగుంట మీదుగా కార్లలోను, పార్సిల్ వ్యాన్లలోను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. ఈవిధంగా జిల్లాలో ఈ ఏడాదిలో రూ.100 కోట్లకుపైగా రవాణాతోపాటు వ్యాపారం సాగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసుల విషయానికివస్తే గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నవారిని అదుపులోకి తీసుకుని 2013లో మొత్తం 124 కేసులు నమోదు చేస్తే... ఇవి 2012లో 116 కేసులుగా ఉన్నాయి. పట్టుబడ్డ సరకు మొత్తం 11,051 కిలోలు మాత్రమే. వాస్తవానికి అక్రమంగా రవాణా అవుతున్న సరకులో పట్టుబడేది కేవలం పది శాతమేకాగా, మిగిలింది చడీచప్పుడు కాకుండా పోలీసుల కన్నుపడకుండా తరలిపోతున్నదే ఎక్కువ. బెంబేలెత్తించిన ఇసుక మాఫియా గ్రామీణ విశాఖలో ఈ ఏడాది ఇసుక మాఫియా మరింత విజృంభించింది. ఇది నదులు, చెరువులు, వంతెనలతోపాటు సముద్రాన్ని కూడా కబళిస్తూ బరితెగిస్తోంది. పెరుగుతున్న పారిశ్రామిక, ఊపుమీదున్న నిర్మాణరంగ అవసరాలను సొమ్ము చేసుకుంటూ కనిపించిన చోటల్లా ఇసుకను రాత్రికిరాత్రే ఊడ్చిపారేసింది. దీనికి రాజకీయ అండదండలు కూడా తోడవడంతో ఇసుక మాఫియా విర్రవీగుతోంది. జిల్లాల్లో రియల్ఎస్టేట్ రంగం ఊపుమీదుండడంతో ఇసుకకు ఊహించని డిమాండ్ పెరిగిపోయింది. దీంతో అధికారికంగా ప్రభుత్వం నుంచి తవ్వకాలకు అనుమతి లేకపోవడంతో జిల్లాలో శారద, తాండవ నదులతోపాటు రైవాడ, కోనాం, కల్యాణపులోవ , మేఘాద్రిగెడ్డ, గంభీరం ,బొడ్డేరు, తాచేరు, తాటిపూడి, ఆండ్ర రిజర్వాయర్లలో ఈ ఏడాదంతా భారీ ఎత్తున ఇసుక తన్నుకుపోయారు. ప్రస్తుతం జిల్లాలో 30కిపైగా మండలాల్లో ఇసుక మాఫియా విస్తరించింది. ఈఏడాది ఇసుక అక్రమ వ్యాపారం రూ.80 కోట్లకుపైగానే జరగడం గమనార్హం. హత్యలు... రోడ్డు ప్రమాదాలు గ్రామీణజిల్లాలో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు కలవరపరిచే స్థాయికి వెళ్లాయి. సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నా దీనిప్రభావం అనేక కుటుంబాలపై పడింది. ఈ ఏడాది మొత్తం 797 రోడు ్డప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా అనకాపల్లి, యలమంచిలి, చోడవరం తదితర ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. హత్యల విషయానికివస్తే 2013లో వీటి సంఖ్య 42గా నమోదయినట్లు పోలీసు శాఖ లెక్కలు చెబుతున్నాయి. గతేడాదితో పోల్చితే ఈ సంఖ్య తక్కువే అని చెబుతున్నా హత్యలు జరిగిన తీరు మాత్రం జిల్లాలో శాంతిభద్రతల దిగజారుడును కళ్లకు కడుతున్నాయి. ప్రధానంగా ఆర్థిక హత్యలు ఈఏడాది ఎక్కువగా నమోదయ్యాయి. దొంగలు పలుచోట్ల దొంగతనాలకు తెగబడి హత్యలుసైతం చేస్తుండడం జిల్లా ప్రజలకు వణుకు పుట్టించింది. గత ఆగస్టు 19న అనకాపల్లిలో కొందరు దుండగులు ఓ బంగారం వ్యాపారి నుంచి రూ.కోటికిపైగా ఆభరణాలు దొంగించారు. అయితే సదరు వ్యాపారి త్రుటిలో వారి నుంచి ప్రాణాలను కాపాడుకున్నారు. నకిలీ నోట్ల హవా గ్రామీణ జిల్లాకు ఇప్పుడు కొత్తరకం సవాల్ ఎదురవుతోంది. నకిలీ కరెన్సీ పెద్ద సమస్యగా తయారైంది. నిన్న మొన్నటివరకు కేవలం ఏజెన్సీకే పరిమితమైన నకిలీ కరెన్సీ ముఠాలు ఇప్పుడు జిల్లా అంతటా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా మైదాన ప్రాంతాలైన నర్సీపట్నం, చోడవరం, అనకాపల్లి, యలమంచిలి తదితర ప్రాంతాల్లో ముఠాలు బరితెగిస్తున్నాయి. అద్దెకు ఇళ్లు తీసుకుని అక్కడే వాటిని ముద్రించడం, అక్కడి నుంచే చలామణీ చేయడం జరుగుతోంది. ప్రధానంగా వారాంతపు సంతలు, చిన్నచిన్న దుకాణాల్లో వీటిని చలామణీ చేసే స్థాయి నుంచి ఏజెంట్లను నియమించుకుని అక్కడి నుంచి దొంగనోట్ల రవాణాతోపాటు చలామణీ చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా చలామణీలో ఉన్న నకిలీ కరెన్సీ సుమారు 80 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో నేరాల సంఖ్య తగ్గింది.. విశాఖపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గినట్లు జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ తెలిపారు. విశాలాక్షినగర్ ఏఆర్ పోలీస్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. గడిచిన ఏడాదిలో నేరాలను అదుపు చేయడానికి పోలీసులు చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా వివరించారు. మహిళా భద్రత, ఈవ్ టీజింగ్ నిరోధం, ఇసుక మాఫియా, గంజాయి దొంగ రవాణా, హత్యలు, హత్యాయత్నాలు, రోడ్డు ప్రమాదాలు, నక్సలిజం, అక్రమ మద్యం అమ్మకాల అదుపు తదితర విషయాల్లో తీసుకున్న చర్యలను వివరించారు. చిన్న నేరం చేసినవారిని సైతం అదుపులోకి తీసుకొన్నామని, దీంతో కేసుల సంఖ్య పెరిగినా, నేరాల సంఖ్య తగ్గిందని విశ్లేషించారు. ఎస్పీ అందించిన గణాంకాలు ఇవీ. 2014లో తీసుకోదలచిన చర్యలు.. ఈ ఏడాది చేపట్టిన చర్యలను కొనసాగించి రాబోవు సంవత్సరంలో మరిన్ని చర్యలు చేపడతామని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ తెలిపారు. కొన్ని పోలీస్ స్టేషన్లు పరిధిలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని వాటిని ఒక్కో సీఐకి అప్పగిస్తామన్నారు. ఆయా గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, వైద్యం, విద్య, విద్యుత్ సౌకర్యాలు కల్పించడానికి చర్యలు చేపడతామన్నారు. కొన్ని పోలీస్ స్టేషన్లను మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. 2014 ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రజలను భాగస్వాములను చేస్తామన్నారు. పోలీసులకు వ్యక్తిగత రుణాలు ఇంత వరకు ఉన్న రూ.50,000 నుంచి రూ.1,00,000 వరకు పెంచినట్లు తెలిపారు. డెత్ రిలీఫ్ ఫండ్ రూ10,000 నుంచి 15,000 వరకు పెంచామన్నారు. -
తెలంగాణ ఏర్పాటుతో కొత్త సవాళ్లు: ఐబీ చీఫ్
ఎవరెన్ని చెప్పినా వినకుండా.. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రాన్ని నిలువునా చీల్చేయడానికి గొడ్డళ్లు పట్టుకుని సిద్ధమైపోతుంటే, ఇంటెలిజెన్స్ బ్యూరో అధినేత ఆసిఫ్ ఇబ్రహీం మాత్రం ఇది సరికాదనే చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయడం వల్ల దేశంలో మరిన్ని ఉద్యమాలు తలెత్తుతాయని ఆయన హెచ్చరించారు. దీనివల్ల భద్రతా సంస్థలకు సరికొత్త సవాళ్లు ఎదురవుతాయన్నారు. వివిధ రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన ప్రతిపాదన వల్ల రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా నిఘా సంస్థలకు చాలా సమస్యలు తలెత్తాయని ఆసిఫ్ ఇబ్రహీం అన్నారు. ఈ సమావేశాన్ని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రారంభించారు.