
Expert Says Maintaining High Seropositivity Rate: భారత జనాభాలోని అధిక సీరోపాజిటివిటీ రేటు దేశాన్ని కరోనా బారి నుంచి కాపాడుతోందని సీసీఎంబీ మాజీ డైరెక్టర్, ప్రస్తుత జీఐజీఎస్ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. అయితే ఒమిక్రాన్ వ్యాప్తిని చూపే గణాంకాలు పెరుగుతున్నందున తగు జాగ్రత్తతో ఉండాలన్నారు. టీకా కవరేజ్‌ను మరింత పెంచడం, కోవిడ్ నిబంధనలను కచ్ఛితంగా పాటించడం చేయాలని సూచించారు. భారత్‌లో 70–80 శాతం సీరోపాజిటివిటీ రేటుందని, పెద్ద నగరాల్లో దాదాపు 90 శాతం జనాభాలో యాంటీబాడీలున్నాయని రాకేశ్ చెప్పారు.
(చదవండి: వర్క్ ఫ్రం హోం చేసినా బీమా చెల్లించాల్సిందే!)
అయితే ఒమిక్రాన్ నేపథ్యంలో అజాగ్రత్త కూడదన్నారు. ఒమిక్రాన్ లేకుండానే యూరప్‌లో వేవ్స్ వస్తున్నాయని గుర్తు చేశారు. భారత్‌లో సెకండ్ వేవ్ కాలంలో భారీగా ఇన్‌ఫెక్షన్ వ్యాపించిందని, దీనివల్ల ఎక్కువమందిలో సీరోపాజిటివిటీ పెరిగిందని వివరించారు. భవిష్యత్‌లో కేసులు పెరిగినా ఆస్పత్రుల పాలవడం పెద్దగా ఉండకపోవచ్చని అంచనా వేశారు. రక్షణ నిబంధల్ని పాటించకుంటే స్వల్పపాటి థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందన్నారు.