ఇటీవల మార్కెట్లోకి ఇబ్బడి ముబ్బడిగా వెరైటీ బ్యూటీ ప్రొడక్ట్‌లు వస్తున్నాయి. ఎలాంటి సమస్య అయినా చిటికెలో చెక్‌పెట్టేలా కళ్లు చెదిరిపోయే ధరల్లో మనముందుకు వస్తున్నాయి సౌందర్య ఉత్పత్తులు. ముఖ్యంగా యువత వీటిని ఎక్కువ ఉపయోగిస్తుంది. వాటిల్లో ప్రముఖంగా ఉపయోగించేది హెయిర్ పెర్ఫ్యూమ్‌నే. ఇది మనం జస్ట్ అలా ఎంట్రీ ఇవ్వంగానే అందరి ముక్కులను ఘామాళించేలా మంచి సువాసన వచ్చేస్తుంది. అందరిలో ప్రత్యేకంగా సువాసనభరితంగా అనిపించేలా కనిపించడం కోసం కొందరూ ఈ హెయిర్ ఫెర్ఫ్యూమ్స్‌ని తెగ వాడేస్తుంటారు. అయితే ఇలా ఉపయోగించటం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. దీని వల్ల రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అవేంటో సవివరంగా చూద్దామా..!
పరిమిళాలు వెదజల్లే ఈ హెయిర్ పెర్ఫ్యూమ్‌లు మంచి తాజాదనాన్ని ఆహ్లాదమైన అనుభూతిని కలిగించినప్పటికీ అవి మీకు హానిని కలుగజేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిల్లో ఇథైల్ ఆల్కహాల్, భారీ సింథటిక్ సువాసనలు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని దీర్ఘకాలం ఉపయోగిస్తే..స్కాల్ప్ డ్యామేజ్ అవ్వడం లేదా పొడిబారినట్లుగా మారుతుంది. ఇవి జుట్టు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువ.
ముఖ్యంగా హెయిర్ పెర్ఫ్యూమ్‌లోని ఆల్కాహాల్‌లు జుట్టులోని సహజ నూనెలను తొలగించి.. పొడిగా, పెళుసుగా అయిపోతాయి. ఎక్కువగా జుట్టు చివర్లు చిట్లిపోవడం, నిస్తేజంగా అయిపోవడం జరుగుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు మెయింటెయిన్ చేయాలనుకుంటే వీటిని మితంగా లేదా దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో ఈ హెయిర్ ఫెర్ఫ్యూమ్‌లు ఓ ట్రెండ్‌గా మారినప్పటికీ.. అవి ఆరోగ్యానికి హానికరమే గానీ ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. అంతగా అలాంటి సువాసనభరితమైన ఫీల్ కావాలనుకుంటే సహజ పదార్థాలతో కూడా ఇలాంటి అనుభూతిని పొందొచ్చని చెబుతున్నారు.
సంరక్షణ పద్ధతులు..
తేలికపాటి మెత్తపాటి జుట్టు ఉన్నవాళ్లు పొగమంచులాంటి లైట్ ఫెర్ఫ్యూమ్‌లు ఒత్తు జుట్టు ఉన్నవారు మంచి గాఢతగలవి వినియోగించొచ్చని చెబతున్నారు నిపుణులు. ఈ పెర్ఫ్యూమ్‌లను మితంగా వాడితే జుట్టు నష్టాన్ని నివారించి ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారని చెబుతున్నారు. తేలికపాటి స్ప్రేలు సరిపోతాయని, వాటిని నేరుగా తలపై కాకుండా చివర్ల లేదా జుట్టు మధ్యలో స్ప్రే చేయడం ఉత్తమం అని సూచిస్తున్నారు.
సహజ ప్రత్యామ్నాయాలు..
హెయిర్ ఫెర్ఫ్యూమ్‌కు సహజమైన ప్రత్యామ్నాయాలు ఏంటంటే..లావెండర్, రోజ్‌మేరీ లేదా చమోమిలే వంటి ఎసెన్షియల్ ఆయిల్స్‌ని నీటిలో కలిపి హెయిర్‌పై స్ప్రేగా ఉపయోగించొచ్చు. ఇవి శిరోజాలకు సహజమైన నూనెలను అందించడమే కాకుండా ఆహ్లాదభరితమైన సువాసనను కూడా ఇస్తాయి. ముఖ్యంగా రోజ్ వాటర్ చక్కటి రిఫ్రెష్‌ని కలిగించే సువాసనను అందిస్తుంది. అలాగే నారింజ లేదా నిమ్మ వంటి సిట్రస్ తొక్కలతో తయారు చేసిన నీటిని కూడా ఉపయోగించొచ్చు. ఇవి జుట్టు స్కాల్ప్‌ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఎలాంటి ఫెర్ఫ్యూమ్ అయినా ఎక్కువ మోతాదులో స్ప్రే చేయకపోవడమే ఉత్తమమని చెబుతున్నారు.
(చదవండి: వెర్సాస్ గౌనులో యువరాణిలా శ్లోకా మెహతా లుక్ అదుర్స్..!)
Comments
Please login to add a commentAdd a comment