ఇంతవరకు ఎన్నో రకాల డైట్‌లు చూశాం. ఎవరికి వారు శారీరక సమస్యలు దృష్ట్యా తమకు నచ్చిన డైట్ ఫాలో అవ్వుతారు. చెప్పాలంటే కీటో డైట్, జోన్ డైట్, పాలియా డైట్, వంటి ఎన్నో రకాల డైట్‌ల ఫాలో అవుతున్నారు. అయితే వైద్యులు మాత్రం ఈ డైటే అత్యుత్తమైనది అంటూ సిఫార్సు చేస్తున్నారు. పైగా ఇది చిత్త వైకల్యం, కేన్సర్, గుండె జబ్బులు వంటి సమస్యలను దరి చేరనివ్వదని చెబుతున్నారు. ఇంతకీ ఆ డైట్ ఏంటి? దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..!
ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో కీలకపాత్ర పోషించేది ఆహారమే. మనం తీసుకునే సమతుల్య ఆహారంతోనే అనారోగ్య సమస్య ప్రమాదాన్ని నివారించగలుగుతాం. మనం తినే ఆహారంలో చక్కెర శాతం, సోడియం కంటెంట్ ఎంత మేర తక్కువగా ఉంటే అంత మంచిది. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారినపడకూడదంటే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన డైట్‌ని అనుసరించాలని చెబుతున్నారు. అంతేగాదు తమ పరిశోధనలో అన్నిటికంటే మెడిటేరియన్ డైట్ అత్యుత్తమమైనదని తేలిందని చెబుతున్నారు. ఇది గుండె జబ్బులు, కేన్సర్ వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలదని వెల్లడించారు.
చాలా వరకు మరణాలకు కారణం.. సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడమేనని చెబుతున్నారు. మెడిటేరియన్ డైట్ లేదా మధ్యధరా ఆహారంలో పుష్కలంగా గింజలు, చేపలు అదనపు వెర్షన్ ఆలివ్ ఆయిల్‌లు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ అధ్యయనం న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యింది. యూకేలో నంబర్ 1 కిల్లర్‌గా ఉన్న డిమెన్షియా(చిత్త వైకల్యం) నివారించగలదని చెబుతున్నారు. దీన్ని చాలామంది పెద్ద సమస్యగా భావించారు. కానీ నిశ్శబ్ద కిల్లర్ అని చెప్పొచ్చు.
ఇక మరో మహమ్మారి కేన్సర్ చాలావరకు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కారణంగా వస్తుందని, దీన్ని ఈ డైట్‌తో సమర్ధవంతంగా నియంత్రించగలమని చెప్పారు. అంతేగాదు 30% గుండె ప్రమాదాలను కూడా నివారించగలదని చెబుతున్నారు. వ్యాధులను నివారించడంలో అత్యంత శక్తివంతమైన వైద్య సాధానంగా ఆహారమే కీలకపాత్ర పోషిస్తుందని నొక్కిచెబుతున్నారు.
మెడిటేరియన్ డైట్/మధ్యధరా ఆహారం అంటే..
ఈ పోషక సమతుల్య ఆహారంలో మొక్కల ఆధారిత ఆహారాలు, పండ్లు, కూరగాయలు ఉంటాయి. ధాన్యాలు, బీన్స్, గింజలు, సీఫుడ్, వర్జిన్ నూనెలను ఉపయోగిస్తారు. గ్రీస్, ఇటలీ, లెబనాన్, క్రొయేషియా, టర్కీ, మొనాకోతో సహా మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్న 21 దేశాల్లో ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇది ఈ దేశాల సంప్రదాయ ఆహారం.
మెడిటేరియన్ డైట్ ప్రయోజనాలు..
గుండె ఆరోగ్యం: ఈ ఆహారం ఆలివ్ ఆయిల్,నట్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులపై దృష్టి పెడుతుంది, ఇది చెడు కొలెస్ట్రాల్,రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఫలితంగా గుండె జబ్బులు, స్ట్రోక్,ఇతర హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బరువు నిర్వహణ: ఈ ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా,సంతృప్తిగా ఉంచడంలో సహాయపడతాయి. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది.
వ్యాధుల ప్రమాదం తగ్గింది: టైప్ 2 డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్,కొన్ని రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి మధ్యధరా ఆహారం సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
కాగ్నిటివ్ హెల్త్: మెడిటరేనియన్ డైట్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే గాక మెదడు పనితీరులో క్షీణతను తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబతున్నాయి.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment