ఇటీవల ప్రవేశపెట్టిన మోదీ 3.0 బడ్జెట్‌లో బంగారం మీద ట్యాక్స్ 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించినట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన తరువాత పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. జులై 23 నుంచి ఇప్పటి వరకు తులం గోల్డ్ రేటు గరిష్టంగా ఐదువేల రూపాయలు తగ్గింది. గణనీయంగా తగ్గిన ధరలు మళ్ళీ పెరుగుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి తగ్గుతున్న బంగారం ధరలు మరికొన్ని రోజుల్లో భారీగా పెరిగే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడే బంగారం కొనుగులు చేయడానికి సన్నద్ధమవ్వాలని, రాబోయే రోజులు ఇది మంచి లాభాలను తెచ్చిపెడుతుందని ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు జతీన్ త్రివేది అన్నారు.
24 క్యారెట్ల బంగారం 7500 రూపాయల నుంచి 6900 రూపాయలకు చేరింది. అంటే ఒక వారం రోజుల్లోనే ఒక గ్రామ్ గోల్డ్ రేటు 600 రూపాయలు తగ్గింది. ధరల తగ్గుదల అందరినీ ఆకర్షిస్తుంది. దీంతో తప్పకుండా రాబోయే రోజుల్లో పసిడి ధరలు పెరుగుతాయని గ్లోబల్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ & పరిశోధకులు సర్వేంద్ర శ్రీవాస్తవ అన్నారు.
ఈ రోజు బంగారం ధరల విషయానికి వస్తే.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ పసిడి ధరలు ఉలుకు పలుకు లేకుండా అన్నట్లు స్థిరంగా ఉన్నాయి. దీంతో హైదరాబద్, విజయవాడలో గోల్డ్ రేటు రూ. 69000 (24 క్యారెట్స్ 10 గ్రా), రూ. 63250 (22 క్యారెట్ 10 గ్రా) వద్ద ఉంది. వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. దీంతో కేజీ వెండి రూ. 84500 వద్ద ఉంది.
Comments
Please login to add a commentAdd a comment