నిద్రలో కలలు అందరికీ వస్తుంటాయి. రకరకాల కలలు. కొన్ని అస్పష్టంగా, అల్లిబిల్లిగా అల్లుకుంటాయి. మరి కొన్ని కళ్లముందే జరిగినట్టు చాలా స్పష్టంగా గుర్తు ఉంటాయి. సాధారణంగా వాటిని చాలావరకు మరచిపోతాం. ఒక్కోసారి అస్సలు పట్టించుకోం. డ్రీమ్ సైన్స్ ప్రకారం మన మనసులోని భావాలకు, మన జీవితంలోని అంశాలకు కలలు ప్రతిరూపాలట. కొన్ని కలలు మర్చిపోనీయకుండా వెంటాడుతుంటాయి.
ఎవరితోనో పెళ్లి జరిగిపోతున్నట్టు, ఏదో కొండలోయల్లోకి జారిపోతున్నట్టు, ఎంత పరిగెత్తాలన్నా పరిగెత్తలేక నిస్సత్తువగా ఉన్నట్టు కల వస్తూ ఉంటాయి. ఉలక్కి పడి లేచి ..హమయ్య కలే కదా అనుకుంటాం. కానీ కొన్ని మాత్రం మనల్ని కుదురుగా ఉండనీయవు. అలా ఎలా? అనుకుంటూ ఉంటాం. నిజానికి మన జీవితంలో మనం చేసేది, చేయలేనిది మన కలలో మాత్రమే కనిపిస్తుంది. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో బిడ్డకు జన్మనిస్తే, దాని అర్థం ఏమిటి? అనే దాన్ని పరిశీలిస్తే..
కలలో బిడ్డ పుట్టడం, ఏడ్వటం
ప్రొఫెషనల్ డ్రీమ్ అనలిస్ట్ , రచయిత లారీ క్విన్ లోవెన్‌బర్గ్ ప్రకారం, శిశువు కలలో కనిపిస్తే కొత్త ప్రారంభానికి సూచిక. చేస్తున్న పనిలో పెరుగుదల లేదా అభివృద్ధిని సూచించే సానుకూల సంకేతమని లోవెన్‌బర్గ్ చెప్పారు.
ఒకవేళ బిడ్డ ఏడుస్తున్నట్టు, అలా వదిలేసినట్టు కల వస్తే.. చేయాల్సిన పనిని నిర్లక్ష్యం చేస్తున్నట్టు. పాప ఏడుపు ఆపకుండా, డ్రీమ్ బేబీ అసహనంగా ఏడుస్తుంటే జీవితంలో కొత్త విషయం లేదా కొంత అంశం మీ దృష్టి అవసరమనేదానికి సూచన అని లోవెన్‌బర్గ్ వివరించాడు.
స్వప్న శాస్త్రం ప్రకారం మీరు కలలో పుట్టిన బిడ్డను చూసినట్లయితే అది శుభసూచకమట. మన జీవితంలో కొత్త అదృష్టం ప్రకాశించబోతోంది అని అర్థమట. జీవితంలో చాలా ఆనందం ,సంపద వస్తాయని భావిస్తారు. వెల్.. చెడు అంటే భయపడాలిగానీ, కొత్త సంతోషంగా వస్తోంది అంటే ఆనందమేగా!
నిజానికి శతాబ్దాలుగా కలలపై పరిశోధనలు జరుగుతున్నాయి. నాగరితక ఆరంభంలో భూలోక ప్రపంచం , దేవతల మధ్య కలలను ఒక మాధ్యమంగా భావించేవారు. వాస్తవానికి, కలలకు కొన్ని ప్రవచనాత్మక శక్తులు ఉన్నాయని గ్రీకులు , రోమన్లు విశ్వసించేవారు. పంతొమ్మిదవ శతాబ్దం చివరి వరకు సిగ్మండ్ ఫ్రాయిడ్ , కార్ల్ జంగ్ కలలు కనడం గురించి విస్తృతంగా తెలిసిన కొన్ని ఆధునిక సిద్ధాంతాలను ముందుకు తెచ్చారు. తీరని కోరికలు ప్రతిరూపం కలలని ఫ్రాయిడ్ అంటే, కలలకు మానసిక ప్రాముఖ్యత ఉందంటాడు కార్ల్ జంగ్ అంటాడు. కానీ వాటి అర్థం గురించి భిన్నమైన సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. న్యూరోబయోలాజికల్ సిద్ధాంతంప్రకారం అసలు కలలకు అర్థం లేద. అవి మన జ్ఞాపకాల నుండి యాదృచ్ఛిక ఆలోచనలు ఎలక్ట్రికల్ బ్రెయిన్ ఇంపల్షన్స్ మాత్రమే.
ఏ కల అయినా శుభమా? లేదా అశుభమా? అనేదాన్ని పక్కన పెట్టి.. ఆ కలల్ని మన జీవితంతో అన్వయం చేసుకొని సమీక్షించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు.అర్థం పర్థంలేని కలల గురించి ఊరికే టెన్షన్ పడి ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం కంటే అలా వదిలేయడమే బెటర్.
Comments
Please login to add a commentAdd a comment