గుండె జబ్బులు తర్వాత అత్యంత ప్రమాదకరమైన వ్యాధులో క్యాన్సర్ ఒకటి. దీని కారణంగా 2020లో దాదాపు 10 మిలయన్ల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా రొమ్ము, ఊపిరితిత్తులు, పెద్దప్రేగు, ప్రోస్టేట్ తదితర క్యాన్సర్‌లతో మరణించిన వారి సంఖ్యే ఎక్కువ. చాలా వరకు ఈ వ్యాధులను నిర్థారించడంలో రోగి జాప్యం ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం అని చెబుతున్నారు వైద్యులు. క్యాన్సర్ లక్షణాలు కొన్నిసార్లు అంత తేలిగ్గా బయటపడవు. మరికొన్ని సార్లు మనమే ఏదో సమస్య ఉంది అనిపిస్తున్నా సాధారణమైనదిగా భావించి కొట్టిపరేస్తాం. అలా నిర్ల్యంగా కొట్టిపరేసే క్యాన్సర్‌కి సంబంధించిన సీరియస్ సంకేతాలు ఏంటంటే..
అమెరికన్ సోసైటీ ప్రకారం ప్రతి ఒక్కరూ తమ శరీరంపై శ్రద్ధ వహిచక తప్పదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని లక్షణాలు మిస్ అయినప్పటికీ మరికొన్ని ప్రతి ఒక్కరికి తెలుస్తాయని అన్నారు.
అవేంటంటే..
ఎముకల్లో నొప్పి, వాచిన..
ముఖ్యంగా అదే పనిగా ఎముకలు నొప్పిగా లేదా కదపలేనట్లు అనిపించినప్పుడు. భరించలేని నొప్పి ఉండి ఆ ప్రాంతంలో వాచినా అది ఎముకల క్యాన్సర్‌కి సంకేతం. ఇంకొకవ విషయం ఏంటంటే క్రమేణ నొప్పి తీవ్రమై రాత్రి వరకు కొనసాగుతుంది. ఇలా ఉంటే తక్షణమే చెకప్ చేయించుకోవాలి.
మింగడంలో ఇబ్బంది..
ఇక ఆహారం మింగడంలో ఇబ్బంది ఉన్నా, కడుపు నిండిన అనుభూతి కలిగిన తేలిగ్గా తీసుకోవద్దు. వేగంగా తిన్నప్పుడు మింగడంలో వచ్చే ఇబ్బంది వేరు తరుచుగా మింగడంలో ఇబ్బంది రావడం వేరని నిపుణులు అంటున్నారు. తగినంతగా నమలకపోవడం వల్లే వచ్చే సమస్య కూడా వేరుగా ఉంటుంది. అసధారణ రీతీలో మింగడంలో వచ్చే నొప్పి ఎసోఫాగియల్ క్యాన్సర్‌కి సంకేతం అని చెబుతున్నారు. మొదటి స్టేజ్‌లో గుర్తిస్తే సాధారణ క్యాన్సర్‌లా నయం చేయొచ్చే లేదంటే ప్రమాదమేనని తెలిపారు.
దద్దర్లు లేదా ఎలర్జీ..
శరీరంపై దద్దర్లు వచ్చిన నిర్లక్ష్యం చేయొద్దు. అలెర్జీలు, ర్యాష్‌లు అనేకరకాల వ్యాధులకు సంకేతమట. లుకేమియా లేదా బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు ఇలానే కనిపిస్తాయట.
అంతేగాదు అసాధారణ రక్త కణాలు ప్లేట్‌లెట్ల ఉత్పత్తికి అంతరాయం కలిగి చర్మంలోకి లీక్ అవ్వకుండా కేశనాళికలని నిరోధించడంతో పగిలిపోతాయి. దీంతో చర్మంపై ఎరుపు లేదా గోధుమ రంగు మచ్చలను చూస్తారు.
కళ్ల నొప్పి..
కళ్లల్లో నొప్పిని కూడా అంతగా పట్టించుకోం. ఏ ఐడ్రాప్స్ వాడేసి తగ్గిపోయిందనుకుంటాం. కంటి క్యాన్సర్ ఎక్కువగా ఐబాల్‌లోని కణాలు, కనురెప్పలు, కన్నీటి నాళాల సమీపంలో ప్రారంభమువతుంది. సాధార నొప్పితో ప్రారంభమవ్వడంతో దీన్ని అంత సులభంగా గుర్తిచలేమని వైద్యులు చెబుతున్నారు
గుండెల్లో మంట..
గుండెల్లో లేదా ఛాతీలో మంటని గ్యాస్ నొప్పిగా తీసిపారేస్తాం. చిన్నగా వస్తుంది ఈ నొప్పి. దీంతో కాసేపటికి సర్దుకుంటుందని పట్టించుకోం. ఇలా వచ్చి ఎక్కిళ్లు వచ్చి ఇబ్బంది పడినా అది అన్నవాహిక లేదా కడుపు క్యాన్సర్‌కి సంకేతమని చెబుతున్నారు.
వృషణాలు వాచిన..
ఇక గజ్జల్లో నొప్పి, వాపులు లేదా గడ్డలు వచ్చినా..వృషణ క్యాన్సర్‌కి సంకేతం. కొందరిలో ఆ భాగం బరువుగా ఉండటం లేదా వృషణం తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే గజ్జల్లో నిస్తేజంగా నొప్పి వస్తుండటం జరుగుతుంది.
గురక..
గురక కూడా క్యాన్సర్‌కి సంకేతమనని అంటున్నారు. ఒక విధమైన గురక వచ్చి ఊపిరి పీల్చుకోవడంలో సమస్య ప్రారంభమవుతుంది. ఇది ఊపిరితిత్తులు లేదా థైరాయిడ్ క్యాన్సర్‌కి దారితీస్తుందని చెబుతున్నారు. సాధారణ గురకలా కాక చాలా పెద్దగా వస్తూ ఊపిరి పీల్చుకోవడంలో సమస్యలొస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
గమనిక: ఇవి అధ్యయనంలో వెల్లడైన విషయాలు మాత్రమే. ఇది కేవలం అవగాహన కోసం ఇచ్చిందే. ఆయా క్యాన్సర్‌ల గురించి పూర్తి విశ్లేషణాత్మకంగా వైద్యులను సంప్రదించి తెలుసుకోవాల్సిందే.
(చదవండి: ఉత్తమ ఆహార నగరాల జాబితాలో చోటు దక్కించుకున్న ఐదు భారతీయ నగరాలు ఇవే!)
Comments
Please login to add a commentAdd a comment